చెన్నై, జనవరి 19 : కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోనీ ఆరోగ్య పరిస్థితి విషయమంగా ఉంది. తాజాగా బిచ్చగాడు – 2 సినిమా షూటింగ్ మలేషియాలో జరుగుతోంది. ఈ షూటింగ్లో పాల్గొన్న విజయ్ యాక్షన్ సీన్స్ చేసే క్రమంలో బోటు అదుపుతప్పి నేరుగా కెమెరా ఉన్న బోటులోకి దూసుకెళ్లింది. సోమవారం జరిగిన ఈ ఘటనలో విజయ్ ఆంటోనీ తీవ్రంగా గాయపడ్డాడు. చిత్రయూనిట్ హుటాహుటిన చికిత్స కోసం అతన్ని కౌలాలంపూర్లోని ఆసుపత్రికి తరలించారు.
అక్కడి నుంచి విజయ్ ను చెన్నైకు తరలించినట్లు విజయ్ భార్య ఫాతిమా తెలిపారు. ప్రస్తుతం విజయ్ అపస్మారక స్థితిలో ఉన్నాడని, అతని పళ్లు, దవడ ఎముక విరిగిందని, ముఖానికి కూడా గట్టి దెబ్బలు తగిలాయని చిత్రబృందంలోని యువకుడు చెప్పుకొచ్చాడు. దీంతో విజయ్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.