- ఇక్కడా కెసిఆర్‌ను తరిమికొట్టే రోజు వొస్తుంది
- ఏడేళ్లలో 5 లక్షల కోట్ల అప్పులు
- రాజపక్స కుటుంబం లాగే కెసిఆర్ కుటుంబం దోపిడీ
- కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వరంగల్ డిక్లరేషన్ అమలు
- మీట్ ద ప్రెస్‌లో పిసిసి చీప్ రేవంత్ రెడ్డి వెల్లడి
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 18 : తెలంగాణను అప్పులకుప్పగా మార్చి మరో శ్రీలంకను చేసేలా కెసిఆర్ కృషి చేస్తున్నాడని కేసీఆర్ ప్రభుత్వంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను కేసీఆర్ దివాలా తీయించారని ఆరోపించారు. 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో రూ.69 వేల కోట్లు అప్పు చేస్తే…కేసీఆర్ 7 ఏళ్ల పాలనలో రూ.5లక్షల కోట్లు అప్పు చేశారని గుర్తు చేశారు. శ్రీలంక పరిస్థితి తెలంగాణలోనూ వొస్తుందని, శ్రీలంక అధ్యక్షుడిపై దాడి ఘటనలు తెలంగాణలో కూడా వొస్తాయని రేవంత్ అన్నారు. 60 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ తెచ్చిన రైతు విప్లవాలను కేసీఆర్ ధ్వంసం చేశారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో చెరుకు, కందులు, పత్తి, మాయమైందని, వరికి మాత్రమే రైతులు పరిమితం అయ్యారని పేర్కొన్నారు. త్వరలో తమ పార్టీ అధికారంలోకి వొస్తుందన్నారు. అధికారంలోకి రాగానే వరంగల్ రైతు డిక్లరేషన్ వందశాతం అమలు చేస్తామని, ఆ బాధ్యత తానే తీసుకుంటానన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 30 రోజుల్లోనే రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. తెలంగాణ వొచ్చాక ధనిక రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల పాలుచేసిండని వి•ట్ద ప్రెస్‌లో రేవంత్ రెడ్డి అన్నారు.
శ్రీలంకలానే తెలంగాణ లోటు బ్జడెట్లో ఉందన్నారు. శ్రీలంక ప్రజలు తరిమికొట్టినట్లే తెలంగాణ ప్రజలు కేసీఆర్ కుటుంబాన్ని తరిమి కొట్టే రోజులు దగ్గరపడ్డాయన్నారు. రాజపక్సే కుటుంబం దోచుకున్నట్లే కేసీఆర్ కుటుంబం ఇక్కడ దోచుకుంటుందన్నారు. ఈ నాలుగేళ్లలో ఏళ్ళల్లో 74 వేల మంది రైతులు చనిపోయినట్లు వారికీ రూ. 5లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ఇచ్చినట్లు సీఎం కెసీఆర్ బర్త్ డే సందర్బంగా వ్యవసాయ శాఖ మంత్రి యాడ్ ఇచ్చుకున్నారన్నారు. భూమిలేని పేదలకు అసైన్డ్ ల్యాండ్స్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనన్నారు. భూముల్లో పంటలు బాగా పండాలని సాగు నీరు అందించిందన్నారు.
అందులో భాగంగానే రాష్ట్రంలో దేశంలో డ్యామ్‌లు, ప్రాజెక్టులు కాల్వలు నిర్మించిందన్నారు. భూమికి ఉన్న డీఎన్ఏను బట్టి ఏ పంట వేయాలో నిర్దారించవచ్చన్నారు. ప్రకృతిని, కాలాలను బట్టి ఎలాంటి పంటలు వేసుకోవాలో రాష్ట్ర సర్కార్ చెప్పాలన్నారు. రైతు శ్రమ దోపిడీకి గురవుతుందని భావించి కాంగ్రెస్ కనీస మద్దతు ధరను తీసుకొచ్చిందన్నారు. ఈ పాలసీలు తీసుకొచ్చినం కాబట్టే.. రైతు దోపిడీకి గురికాకుండా ఉంటున్నాడన్నారు. కానీ గోడౌన్ లల్లో నిల్వలు దాచి వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారన్నారు. ప్రకృతి వైపరీత్యాల నుండి ప్రజలను కాపాడ్డానికి ఎఫ్‌సీఐని కూడా కాంగ్రెస్సే ఏర్పాటు చేసిందని అన్నారు.