- ప్రభుత్వ సూచనలు పాటించి..
- ఆర్థ్ధిక స్వాలంబన సాధించాలి
- ఆర్థ్ధిక మంత్రి హరీష్రావు పిలుపు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతో సాగునీరు మన భూములను చేరిన వేళ గుంట భూమి కూడా ఖాళీగా ఉండకుండా పంటల సాగుతో ప్రాంతమంతా కళకళలాడాలని ఆర్ధిక మంత్రి తన్నీరు హరీష్రావు అన్నారు. చిన్నకోడూరు మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో రైతు వేదిక భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం బెల్లంకుంట చెరువు నిండి మత్తడి దూకిన సందర్భంగా గోదావరి జలాలను ఆహ్వానిస్తూ.., చెరువు గంగమ్మ తల్లికి మంత్రి హరీశ్ రావు, జెడ్పీ చైర్మన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మలు జల హారతి పట్టి స్వాగతించారు. ఆ తర్వాత పెద్ద చెరువులో జిల్లా మత్స్యశాఖ ఆధ్వర్యంలో కొర్ర మట్ట చేపలను మంత్రి హరీశ్ రావు వదిలారు. ఈ మేరకు జిల్లా జెడ్పీ చైర్మన్ దంపతులు సైతం చేపలు చెరువులోకి వదిలారు. అనంతరం పెద్ద చెరువు కట్టపై ఉన్న శ్రీ గంగా భవాని దేవాలయంలో గంగమ్మ తల్లికి హారతి ఇచ్చి మంత్రి హరీశ్ ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా మంత్రి హరీష్రావు మాట్లాడుతూ..రైతుకు బతుకు మీద ప్రభుత్వం భరోసా కల్పించే విధంగా సిఎం కెసిఆర్ నేతృత్వంలోని తెరాస ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కోటిన్నర లక్షల ఏకరాలకు రైతుబంధు అందిస్తున్నాట్లు తెలిపారు. వానా కాలం రూ.7 వేల కోట్లు, యాసంగిలో రూ.7 వేల కోట్లు రైతుకు పెట్టుబడి సాయం కింద అందిస్తున్నట్లు పేర్కొన్నారు. కరోనా వచ్చి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కుంగదీస్తున్న రైతులకు ఏ లోటు రానివ్వమని, తెలంగాణ ప్రభుత్వం రైతులను అన్నీ విధాలుగా ఆడుకుంటుందన్నారు. చిన్నకోడూర్ పెద్ద చెరువును మినీ ట్యాకు బండ్ గా మారుస్తామని హామీనిచ్చారు. అధిక సాగు, అధిక ఆదాయం వచ్చేలా రైతులు పంటలు సాగు చేసి పుట్ల కొద్దీ వడ్లు పండించాలని ఆశాభావం వ్యక్తంచేశారు. ప్రభుత్వం సూచించిన ప్రాధాన్య పంటలు సాగుచేసి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవాలన్నారు. ఈకార్యక్రమంలో మండల పరిధిలోని ప్రజాప్రతినిధులు, టిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.