Take a fresh look at your lifestyle.

ఏడేళ్ల బీజేపీ-తెరాస పాలనపై చర్చ జరగాలి

  • 30న సిలిండర్‌కు దండం పెట్టు..బీజేపీని బొంద పెట్టు
  • వావిలాలను మండంల చేస్తాం..గెల్లును గెలిపించండి
  • హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ప్రచారంలో ఆర్థిక మంత్రి హరీష్‌ ‌రావు

‘‘ఈటల రాజేందర్‌కు ఓటమి భయం పట్టుకుంది. ఓడిపోతానని ఫస్ట్రేషన్‌లో నోటికి వొచ్చినట్లు మాట్లాడుతున్నడు..ఓరేయ్‌ అం‌టున్నడు. కూలగొడత అంటున్నడు, కాలబెడతా అంటున్నడు..ఓటమి భయం ఉన్న వారికి ఫస్ట్రేషన్‌లో నోరు జారి మాట్లాడుతున్నరు..అని గురువారం మంత్రి హరీష్‌ ‌రావు హుజూరాబాద్‌ ‌నియోజక వర్గం వావిలాల ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ అన్నారు.

ఎన్నికలు వొచ్చినప్పుడు ఏడేళ్లలో బీజేపీ ఢిల్లీలో అధికారంలో ఉంది..ఏం పని చేసింది, టీఆర్‌ఎస్‌ ఏడేళ్లలో ఏం పని చేసింది..అన్నది చర్చ జరగాలి కదా…అని పేర్కొంటూ… ‘‘గెలిస్తే ఏం చేస్తం అని ప్రజలను వోట్లు అడగాలి. కాని అది మాట్లాడటం లేదు..ఏడేళ్ల టీఆర్‌ఎస్‌- ‌బీజేపీ పరిపాలన మీద చర్చ జరగాలి. ముంగటికి ఎవరు ఏం చేస్తరో చెప్పి వోట్లు అడగాలి…సానుబూతి మాటలు, రెచ్చగొట్టే మాటలు, పరుషపదజాలంతో మాట్లాడుతున్నారు.ఆయనకు బీజేపీ వాసన బాగా పట్టింది. బీజేపీ అంటే జూటేబాజ్‌, ‌బట్టేబాజ్‌ ‌పార్టీ..పండుగ పూట వడ్డీ లేని రుణం ఇస్తున్నం అని చెప్పిన. డబ్బులు వొచ్చినయా లేవా.. కాని రాజేందర్‌ ఏం ‌మాట్లడిండు..హరీష్‌ ‌రావు చెల్లని చెక్కులు, డూప్లికేట్‌ ‌చెక్కులు ఇచ్చిన అన్నడు. చెక్కులు చెల్లినయా లేదా…ఈటల రాజేందర్‌ ‌బట్టేబాజ్‌ ‌బీజేపీ పార్టీ మాటలు మాట్లాడతున్నరు…చెక్‌ ‌చెల్లిందని తెలిసి కూడా రాజేందర్‌ అబద్దపు మాటలు మట్లాడుతున్నరు. ఇది చాలదా ఆయన వరుస…వావిలాల మండలం కావాలని 36 రోజులు నిరహార దీక్ష చేసారు. అయినా రాజేందర్‌ ‌మనసు కరగలేదు…అరెస్టులు చేసాడు తప్ప మండలం ఇవ్వలేదు…మండలం ఇవ్వలేదు కాని, మండలం కన్నా ఎక్కువ పని చేస్తా అన్నరు. ఒక్క ఇళ్లువచ్చిందా, పశువుల దవాఖానా వొచ్చిందా..చేసిందేమి లేదు.

ప్రజల కోసం పెట్టిన పీహెచ్‌ ‌సీ కోసం రాజేందర్‌ ‌చేసిందేమి లేదు. మాటలు తప్ప చేతల్లో జరిగిందేమి లేదు…రాజేందర్‌ ‌మంత్రిగా నే చేయలేదు. ఆయన గెల్చేది లేదు. మళ్లీ మంత్రి అయ్యేది లేదు. ..గెల్లును అఖండమైన మెజార్టీతో గెలిపించడండి. కేసీఆర్‌ ‌కాళ్లు మొక్కయినా వావిలాల మండలం చేయిస్తా. ఇది ఉద్యమం జరిగిన గడ్డ. వావిలాల మండలం కోసం పోరాటం జరిగింది…పోలీసులను బెట్టి అణిచివేసిండు, కాని వావిలాల కోరిక రాజేందర్‌ ‌తీర్చలేదు…ఎన్నికల కోడ్‌ అయ్యాక మండలాన్ని చేసుకుందాం. ఇది మీ చేతుల్లో ఉంది. మండలం కావాలంటే రాజేందర్‌ ‌తో అవుద్దా…గెలుస్తడా….మంత్రి అయితడా….ప్రభుత్వం వస్తదా…రెండేళ్ల నాలుగేళ్లు మాత్రమే ఎమ్మెల్యేగా ఉండాలి. గెల్లుపై సీఎంగారికి ప్రేమ ఉంది. గెల్లు కేసీఆర్‌ ‌గారి దగ్గరు వెళ్లి మీ పోరాటం నిజం చేసే బాధ్యత తీసుకుంటాం .

మేం సీఎం గారిని కలిసి ఈ పని చేయిస్తాం..ఇంత పెద్ద ఊరు మహిళా  భవనం కట్టించారా రాజేందర్‌, ‌మీరు అడగ్గానే మహిళా భవనం  ఇచ్చినం…ప్రతీ నెల రెండు సార్లు వచ్చి హుజూరాబాద్‌ ‌నియోజకవర్గ పనులు చేయించే బాధ్యత తీసుకుంటా..టీఆర్‌ఎస్‌ ఏం ‌చేసింది. బీజేపీ ఏడేళ్లలో ఏం చేసింది…200 పెన్షన్‌ 2016 ‌చేసినం. పెదింటి ఆడపిల్ల పెళ్లికి లక్ష రూపాయల కళ్యాణ లక్ష్మి ఇచ్చినం…రాజేందర్‌ ఏం అం‌టున్నరు. బీజేపీ నాయకులు హైదరాబాద్‌ ‌నుంచి, ఢిల్లీ నుంచి వచ్చిండ్రు..కేంద్ర మంత్రులు, ఎంపీలు, రాష్ట్ర బీజేపీ నేతలు అంతా తమ్ముడు గెల్లును ఓడగొడతామని తిరుగుతున్నరు…తిరుగుండ్రి. కాని మా ప్రజలకు ఎం చేస్తారో చెప్పండి. లేని అబద్దాలు తప్ప ప్రజలకు పని కి వచ్చే మాటలు ఏమైన చెబుతున్నరా…బీజేపీ వస్తే బాయిల కాడ మీటర్లు వస్తయి…పక్క రాష్ట్రంలో జగన్మోహన్‌ ‌రెడ్డి శ్రీకాకుళంలో 30 వేల మీటర్లు పెట్టిండ్రు…మన సీఎం నేను బతికుంటగా, తెలంగాణ రైతు బాయికాడ మీటర్లు పెట్ట. ఉచిత కరెంటు ఇస్త అన్నడు…ఉచిత కరెంటు ఇస్త  అన్న కేసీఆర్‌ ‌కు ఓటు వేద్దామా…. బాయి కాడ మీటర్లు పెట్టే బీజేపీకి ఓటు వేద్దామా…సిలండర్‌ ‌ధర ఎంత అయిందో అక్కా చెల్లేళ్లు చెప్పాలి. ..ఈటల రాజేందర్‌ ‌గారు కేంద్ర ప్రభుత్వం ధరను పెంచిందని.

1030 రూ. పెంచారు…ఓట్లు వేయమని తిరుగుతున్నవు రాజేందర్‌ ‌గారు. ఢిల్లీ లో పలుకుబడి ఉంది కదా..సిలండర్‌ ‌ధర 500 కు తగ్గిస్తా అని చెప్పాలికదా. ..సబ్సిడీ ఇంతకు ముందు 250 రూ. వచ్చేది. దాన్ని ఎగబెట్టిండ్రు…బండి సంజయ్‌, అరవింద్‌ ‌గార ఇక్కడ బాగానే మాట్లాడుతున్నారు. ఈ సిలండర్‌ ‌ధరను తగ్గిస్తరా…తగ్గించరా..  పెట్రోల్‌…‌డిజిల్‌ ‌తగ్గిస్తరా…తగ్గించరా… చెప్పండి ముందు…ఈ ధరలు పెరిగిన బీజేపీని ఎం చేద్దాం.. బీజేపీకి ఓటువేస్తే సిలిండర్‌ ‌ధర 1500 రూ చేస్తరు..30 వ తేదీన ఓటు వేసే ముందు వంట రూంలోకి వెళ్లి గ్యాస్‌ ‌సిలండర్‌ ‌కు దండంపెట్టు – బీజేపీని బొంద పెట్టు. అప్పుడే ధర తగ్గుతుంది..పెట్రోల్‌, ‌డీజీల్‌ ‌పెరగడం వల్ల మంచి నూనే ధర 180 రూ అయింది. పప్పు, ఉప్పు , కూరగాయల ధర పెరిగింది..ధరలు తగ్గాలంటే బీజేపీకి గుణ పాఠం చెప్పాలి. నన్ను గెలిపీయండి..రాజేందర్‌ ‌గారు ఒక్క ఇళ్లు కట్టలేదు. స్వంత జాగాలో నేను ఇల్లు కట్టించేందుకు 5 లక్షల రూపాయలు ఇప్పిస్తా అన్నడు…ఇది టీఆర్‌ఎస్‌ ‌వల్ల సాధ్యమయితది..అర్వింద్‌ అనే నిజామాద్‌ ‌బీజేపీ ఎంపీ. రైతులకు బాండ్‌ ‌పేపర్‌ ‌మీద మూడు నెలల్లో పసుపు బోర్డు తెస్తా అని రాసిచ్చిండు. అది అటే పోయింది. ఆయన వొచ్చి హుజూరాబాద్‌లో ఏదో చేస్తా అంటున్నడు…పసుపు బోర్డు తెస్తా అని అబద్దమాడి, బాండ్‌ ‌పేపర్‌ ‌మీద రాసి, మోసం చేసిన వ్యక్తి ఇక్కడ చెబితే ఎవరైనా వింటరా.

ఈటల రాజేందర్‌ ‌కూడా ఇలాగే చేస్తారని అర్థమవుతుంది. రాజేందర్‌ ‌గెలిస్తే వ్యక్తిగా ఆయనకు లాభం- బీజేపికి లాభం. గెల్లు గెలిస్తే వావిలాల ప్రజలకు- హుజూరాబాద్‌ ‌నియోజకవర్గానికి లాభం అవుతుంది..వ్యక్తి ప్రయోజనం కాదు. వ్యవస్థ ప్రయోజనం ముఖ్యం కాదు..! వావిలాల ప్రజలను  రాజేందర్‌ ‌పట్టించుకోలేదు. కేసులుపెట్టారు. వేధించారు.ఆరు సార్లు 17 ఏళ్లు గెల్చారు. కేసీఆర్‌ ఇచ్చిందే తప్ప, ఆయన చేసిందేమి లేదు. బీజేపీతో చేసేది లేదు. 17 ఏళ్లలో చేయని పనులు గెల్లు గెలిస్తే చేసి చూపిస్తాం.రాజేందర్‌ ‌గారు ఏం చేయలేదు కాని అన్నీ నన్ను చూసి వొచ్చిందటున్నరు. మరి రైతు బంధు ఎవర్ని చూసి వచ్చింది, వడ్డీ లేని రుణం ఎవర్ని చూసి వొచ్చింది. ఏం మాట్లాడాలో పాలుపోక నోటికి వొచ్చింది మాట్లాడుతున్నరు. వీళ్ల మాటలకు మోసపోవద్దు. పని చేసే టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వాన్ని, కేసీఆర్‌ను, గెల్లును గెలిపించండి. పన్నులు పెంచిన బీజేపీకి తగిన గుణపాఠం చెప్పాలి.పేదల మీద పన్నులు వేసి, పెద్దలకు పంచింది బీజేపీ పార్టీ.

బడా బడా కార్పొరేట్‌ ‌పెద్దలకు పది లక్షల కోట్ల రుణం మాఫీ చేసింది. రైతులకు, చేనేత కార్మికులకు, పేదల రుణాల మాత్రం మాఫీ చేయలేదు బీజేపీ పార్టీ. గెల్లును గెలిపించండి- వావిలాలను మండలం చేసుకుందాం. ప్రత్యేక కేసుగా పరిగణించి మండలం చేస్తాం. ఇష్టం లేని గ్రామాలను ఇందులో కలపనే కలపం…’’ అని సందర్బంగా మంత్రి హరీష్‌ ‌రావు హామీ ఇచ్చారు.

Leave a Reply