నాగర్ కర్నూల్, మే 14.ప్రజాతంత్రవిలేకరి: కరోనా నిర్మూలణలో ఆశాకార్యకర్తలు అందిస్తున్న సేవలు అమోఘమని అచ్చంపేట ఎంఎల్ఏ, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు అన్నారు. గురువారం రెడ్ క్రాస్ సొసైటీ నాగర్ కర్నూల్ శాఖ ఆధ్వర్యంలో సర్వింగ్ హాండ్ సొసైటీ నాగర్ కర్నూల్ వారి సహకారంతో అచ్చంపేట ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు చెతుల మీదుగా అచ్చంపేట మండల పరిధిలోని 80 మంది ఆశా కార్యకర్తలకు ఒక్కొక్కరికి 10కేజీల బియ్యము మరియు కూరగాయలు, స్మార్ట్ వాటర్ బాటిల్ ని పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అచ్చంపేట ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గువ్వలబాలరాజు మాట్లాడుతూ ఆశా కార్యకర్తలు కరోనా నివారణలో ముందుండి పోరాడుతున్నారని, వీరు అందిస్తున్న సేవలు వెలకట్టలేనివని తెలిపారు.
అదేవిధంగా కష్టకాలంలో పేదలకు సర్వింగ్ హాండ్ సొసైటీఅందిస్తున్నసహకారం ఎంతో గొప్పద ని, ఇలాంటివిపత్తు సమయం లో స్వచ్ఛంద సంస్థలు ముందుకు రాబట్టే ప్రభుత్వానికి చాలా భారం తగ్గిందని అన్నారు. ఈ కార్యక్రమంలో డా. శ్రీధర్, రెడ్ క్రాస్ సెక్రటరీ సి. రమేష్ రెడ్డి, జిల్లా యూత్ కోఆర్డినేటర్ డి. కుమార్, రెడ్ క్రాస్ సభ్యులు అశోక్ ప్రసాద్ సర్వింగ్ హాండ్ ప్రెసిడెంట్ వెంకట్ రెడ్డి, సభ్యులు సందీప్, సుభాష్,హర్ష, తదితరులు పాల్గొన్నారు.