Take a fresh look at your lifestyle.

మున్సిపల్‌ ‌కార్మికుల సేవలు ఎనలేనివి

మున్సిపల్‌ ‌కార్మికులు శానిటేషన్‌, ‌మాస్కులు పంపిణీ చేసిన మంత్రి తన్నీరు హరీష్‌రావు

కొరోనా వైరస్‌ ‌నియంత్రణకు ప్రకటించిన లాక్‌ ‌డౌన్‌ ‌లో తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహిస్తున్న మున్సిపల్‌ ‌కార్మికుల సేవలు ఎనలేనివని తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. బుధవారం నారాయణఖేడ్‌ ‌కు వచ్చిన సందర్బంగా స్థానిక రాజీవ్‌ ‌చౌక్‌ ‌వద్ద మున్సిపల్‌ ‌కార్మికులకు శానిటేషన్‌, ‌మాస్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ ‌రావు మున్సిపల్‌ ‌కార్మికుల సేవలను గుర్తించి రూ. 13 వేతనంతో పాటు అదనంగా రూ. 5 వేలు ఇవ్వడం జరిగిందన్నారు.

- Advertisement -

ప్రభుత్వ ఆదేశాలను ప్రతి ఒక్కరు పాటించాలని, అత్యవసరం అయితే గాని ఎవ్వరు కూడా బయటకు రాకూడదని, తప్పని సరిగా మాస్కును ధరించాలని, తరుచు శానిటేషన్‌ ‌చేయాలని, పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎం.పి బీబీ పాటిల్‌, ఎమ్మెల్యేలు మహారెడ్డి భూపాల్‌ ‌రెడ్డి, క్రాంతి కిరణ్‌, ‌డి.సి.సి.బి చైర్మన్‌ ‌చిట్టి దేవేందర్‌, ‌జెడ్పిటిసి లక్ష్మీ బాయి, మున్సిపల్‌ ‌కమిషనర్‌ ‌జి. శ్రీనివాస్‌, ‌మున్సిపల్‌ ‌చైర్మన్‌ ‌రూబినా బేగం నజీబ్‌, ఉప చైర్మన్‌ అహిర్‌ ‌పరుషు రామ్‌,‌కౌన్సిలర్లు మజీద్‌ , ‌స్వప్న అభిషేక్‌ ‌షెట్కార్‌, ‌నాయకులు రవీందర్‌ ‌నాయక్‌ , ‌సి. ఐ రవీందర్‌ ‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు

Leave a Reply