Take a fresh look at your lifestyle.

జర్నలిస్టుల సేవలు అభినందనీయం -యాక్షన్ ఎయిడ్ ఆర్ఎం ఆంజనేయులు

కరోనా మహమ్మారిపై ప్రజలను అప్రమత్తం చేయడానికి జర్నలిస్టులు చేస్తున్న కృషి అభినందనీయమని యాక్షన్ ఎయిడ్ సంస్థ రీజనల్ మేనేజర్ యం.ఆంజనేయులు అన్నారు. కరోనా విపత్తు సహాయంగా ఎల్ఐసి హౌజింగ్ ఫైనాన్స్ సంస్థ సహకారంతో శనివారం నాడు బషీర్ బాగ్ లోని దేశోధారక భవన్లో హైదరాబాద్ జిల్లాకు చెందిన 150 మంది లోకల్ రిపోర్టర్లకు తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యుజె) ఆధ్వర్యంలో బియ్యం, విలువైన నిత్యవసర సరుకులు, మాస్కులు, సానిటాయిజర్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత విపత్తు సందర్భంలో ఆకలితో అలమటిస్తున్న నిరుపేదలను ఆదుకునేందుకు ప్రతి మానవతావాది స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కరోనా విపత్తు సందర్భంలో ఎల్ఐసి హౌజింగ్ ఫైనాన్స్ సంస్థ సహకారంతో హైదరాబాద్ నగరంతో పాటు పరిసర ప్రాంతాల్లో 15,000 నిరుపేద కుటుంబాలకు దాదాపు 2.25 కోట్ల రూపాయల విలువచేసే నిత్యవసర సరుకులను పంపిణీ చేసినట్లు సత్యనారాయణ స్పష్టం చేశారు.
టీయూడబ్ల్యుజె రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ మాట్లాడుతూ కరోనా విపత్తుతో రాష్ట్రంలో మీడియా రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుందన్నారు. దీంతో ఉద్యోగ భద్రత కరువై జర్నలిస్టులు, మీడియా సిబ్బంది ఆందోళన చెందుతున్నట్లు ఆయన విచారం వ్యక్తం చేశారు. ఈ సంక్షోభం నుండి మీడియాను గట్టెక్కించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. జర్నలిస్టుల ఆర్థిక కష్టాలను అర్థం చేసుకొని యాక్షన్ ఎయిడ్ సంస్థ స్పందించి ఎల్ఐసి హౌజింగ్ ఫైనాన్స్ సంస్థ సహకారంతో విలువైన నిత్యవసర సరుకులు పంపిణీ చేయడం అభినందనీయ మన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఐజేయూ కార్యదర్శి వై.నరేందర్ రెడ్డి, యూనియన్ నాయకులు ఏ.రాజేష్, వి.యాదగిరి, శిగ శంకర్ గౌడ్, కె.రాములు,డి.స్వామి, ఎ.శ్యామ్ సుందర్,కె.గోపీనాథ్,ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

error: Content is protected !!