ఎన్నో బలిదానాలు చేసి పోరాడి తెచ్చుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ప్రజల మనోభావాలను దెబ్బ తీస్తూ ఒక నియం తలా వ్యవహరిస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై పిసిసి అధ్యక్షులు ఉత్తంకుమార్ విరుచు కుపడ్డారు బుధవారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ పోతిరెడ్డిపాడు అంశంపై ఏర్పాటుచేసిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ హాజరై మాట్లాడారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడక ముందు నీళ్లు నిధులు నియామకాల కోసం ప్రత్యేక రాష్ట్రం కావాలని అని అన్న కేసీఆర్ తెలంగాణ వచ్చాక తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని ప్రాజెక్టుల పేరిట కెసిఆర్ కమిషన్ డబ్బులను జేబులు నింపుకుంటున్నారు అన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజల పై కేసీఆర్ కుట్రపూరితంగా గా వ్యవహరిస్తున్నారని నాడు ఉమ్మడి రాష్ట్రంలో లో ఆంధ్రులపై గగ్గోలు పెట్టిన కేసీఆర్ నేడు ప్రాజెక్టుల పనులను ఆంధ్ర గుత్తేదారులకు ఇస్తున్నది వాస్తవం కాదా అని ప్రశ్నించారు రీ డిజైన్ ల పేరుతో ప్రాజెక్టుల పేరిట లక్షల కోట్లు దుర్వినియోగం చేస్తున్నారని ఎద్దేవా చేశారు పోతిరెడ్డిపాడు అంశంపై జనవరి నెల 5వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ కు కాంగ్రెస్ నాయకులు నాగం జనార్దన్ రెడ్డి బహిరంగ లేఖను అందించారని అదే నెల 12వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ సీఎం కేసీఆర్ తో రహస్య భేటీ జరిగిందని ఎందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ పోతిరెడ్డిపాడు అంశంపై పెదవి విప్పడం లేదని కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రశ్నించారు.
పోతిరెడ్డిపాడు టు గండి కొట్టి కృష్ణాజలాలను ఆంధ్రకు తరలిస్తే దక్షిణ తెలంగాణ ఎడారిగా మారడం ఖాయమన్నారు నాగార్జున సాగర్ డాం పూర్తిగా నిండితేనే 20 వేల క్యూసెక్కుల నీరు పారుతుందని వీటిలో నుంచి 80 వేల క్యూసెక్కుల నీరు ఆంధ్రకు తరలించే ప్రయత్నాలు చేస్తున్నారని నాలుగు ఇంతలు రెట్టింపు నీటిని ఏపీకి తగ్గించుకోవడానికి కుట్రలు పన్నుతున్నారన్నారు ఈ విషయంపై సీఎం కేసీఆర్ అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నారని అన్నారు రైతులకు రైతుబంధు ఆర్థిక సహాయం అంతంత మాత్రమే చెల్లిస్తున్నారు చాలా మంది రైతులు లక్షల సంఖ్యలో రైతుబంధు ఆర్థిక సహాయం అందలేదని బ్యాంకుల వద్ద బారులు తీరుతున్నారు అన్నారు ఇటువంటి అవినీతి ముఖ్యమంత్రి దేశంలో ఏ రాష్ట్రంలో ఉండని మిషన్ భగీరథ ఇరిగేషన్ పేరిట కోట్ల రూపాయలను దండుకుంటున్నారు ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారన్నారు లక్ష కోట్ల రూపాయల ఖర్చు పెట్టిన కాలేశ్వరం ప్రాజెక్టు ఇప్పటి వరకు కేవలం 52 టిఎంసిల నేను మాత్రమే మారిందన్నారు ప్రజలను మోసగించేందుకు కొబ్బరికాయలు కొట్టి ని మా ఇస్ చేస్తున్నారన్నారు శ్రీశైలం బ్యాక్ వాటర్ నుండి ఎస్ఎల్బీసీ ద్వారా నీరు అందిస్తే ఒక్క రూపాయి కూడా ఖర్చు కాకుండా గ్రావిటీ ద్వారా మూడు లక్షల పైచిలుకు ఎకరాలకు ఆయకట్టు ద్వారానే అందుతుందన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రాజెక్టుల పేరిట డబ్బులు ఖర్చు పెడితే ఆనందం అని ఖర్చు పెట్టకుండా గ్రావిటీ ద్వారా వచ్చే నీరు ని ద్వారా పొలాలకు అందించడం నచ్చదు అన్నారు.ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ పిలుపుమేరకు ప్రతి గ్రామంలోనూ ప్రతి కార్యకర్త సామాజిక మాధ్యమం ద్వారా భారీ ప్రచారాన్ని కొనసాగించాలన్నారు.
అలాగే జూన్ 2 తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పెండింగ్ ప్రాజెక్టు పై నిరసన దీక్షలు చేపడుతున్నట్టు తెలిపారు అలాగే కరో నా ను కట్టడి చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని అన్నారు ప్రజల జీవితాలు అస్తవ్యస్తంగా మారాయి అని అందుచేత కేంద్ర ప్రభుత్వం రూ 10 వేల ఆర్థిక సహాయాన్ని ప్రజలకు అందించాలని డిమాండ్ చేశారు వలస కార్మికుల ను కాపాడే విషయంలో విఫలమయ్యారని గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ కూలీలకు 200 రోజులు పనులు కేటాయించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు పేద ప్రజల తో పాటు ఉ వలస కార్మికులను వారి గమ్యస్థానాలకు చేరేలా రవాణా సౌకర్యం కల్పించాలన్నారు అంతకుముందు ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ పోతిరెడ్డిపాడు అంశంపై పవర్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు ఈ కార్యక్రమానికి సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి డి సీనియర్ నాయకులు మల్లురవి ఏఐసిసి కార్యదర్శి వంశీచందర్ రెడ్డి నియోజకవర్గ ఇన్చార్జిలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.