Take a fresh look at your lifestyle.

అవసరమైన విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉంచాలి : కలెక్టర్‌

రెబ్బెన, మే 13, ప్రజా తంత్ర విలేఖరి : వచ్చే వర్షాకాలం సీజన్‌లో రైతులకు అవసరమైన విత్తనాలకు సంబం ధించి కార్య ప్రణాళిక ను తయారు చేయాల ని జిల్లా పాలానాధికా రి సందీప్‌ ‌కుమార్‌ ‌ఝూ వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ, ఇరిగేషన్‌, ‌భూగర్భ శాఖ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌ ‌నుండి అన్ని మండలాలకు సంబంధించిన అధికారులతో వీడియో కాన్ఫరేన్స్ ‌నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే వర్షాకాలంలో రైతులకు అవసరమైన విత్తనాలు ఎరువులను అందుబాటులో ఉంచాలని, జిల్లాలో మొత్తం వరి, మొక్కజోన్న, పత్తి, కంది విత్తనాలు ఎంత అవసరమో కార్య ప్రణాళికను తయారుచేసి నివేధికలతో సమర్పించాలన్నారు. సరిపోయేంత విత్తనాలను అందుబాటులో ఉంచాలని, యూరియా, డిఏపి ఎరువులు తక్కువ కాకుండా సరఫరా చేయాలని సూచించారు. వ్యవసాయశాఖ అధికారి శ్రీనివాసరావు (ఇంచార్జీ) ఈ పనులను పర్యవేక్షించాలని ఆదేశించారు.

అలాగే అధికారులందరూ హెడ్‌ ‌క్వార్టర్‌లలో ఉండి రైతులకు తగు సూచనలు, సలహాలు ఇవ్వాలన్నారు. ఉద్యానవన పంటను సాగు చేసే విధంగా చూడాలని, ఏ పంటలు వేయాలో ఉద్యానశాఖ అధికారులు, రైతులకు అవగాహన కల్పించి, కార్య ప్రణాళికను సిద్దం చేయాలని తెలిపారు. వ్యవసాయ శాఖ అధికారులకు ఇరిగేషన్‌ ‌భూగర్భ శాఖ అధికారులు సహకరించా లని ఆదేశించారు. ఈ విడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్‌ ‌పి.రాంబాబు, డిఆర్‌వో జే.ప్రభాకర్‌తో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!