Take a fresh look at your lifestyle.

రెండోవిడత తొలి రౌండ్‌లో ఫలితాలు వైకాపా అనుకూలం

ఏపీలో రెండో విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్‌ ‌కొనసాగుతోంది. మరోవైపు కొన్ని చోట్ల ఫలితాలు వెల్లడవుతున్నాయి. కృష్ణాజిల్లా గుడివాడ డివిజన్‌ ‌పరిధిలో తొలి ఫలితం విడుదలైంది. నందివాడ మండలం గుండెపూడి పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ మద్దతు సర్పంచ్‌ అభ్యర్థి కర్నాటి సత్యనారాయణ ఒక్క ఓటుతో విజయం సాధించారు. పామర్రు నియోజకవర్గం జమ్మి దగ్గుమిల్లిలో వైసీపీ మద్దతుదారు కూనపరెడ్డి చంద్రశేఖర్‌ 256 ఓట్లతో సర్పంచ్‌గా గెలుపొందారు.

నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం బెడుసిపల్లి సర్పంచ్‌గా బోయపాటి లక్ష్మి 84 ఓట్ల మెజారిటీతో గెలుపొందింది. విజయనగరం జిల్లాలో రోచెక్కలో 10 ఓట్ల తేడాతో వైసీపీ మద్దతుదారు విజయం సాధించారు. కురుపాం, పాచిపెంట, పార్వతీపురం, గుమ్మలక్ష్మీపురం, కొమరాడలో వైసీపీ గెలుపొందింది.బిన్నిడి పంచాయతీలో స్వతంత్ర అభ్యర్థి దివ్యభారతి గెలిచారు. పట్టుచెన్నూరులో వైసీపీ రెబల్‌ అభ్యర్థి గెలిచారు. ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలం తంగెళ్లలో వైసీపీ మద్దతుదారు విజయం సాధించారు. గుంటూరు జిల్లా నర్సరావుపేట మండలం పెద్దతురకపాలెంలో వైసీపీ గెలుపొందారు.

Leave a Reply