Take a fresh look at your lifestyle.

వలంటీర్లపై పలు పార్టీల నుంచి ఫిర్యాదులు చర్యలు తీసుకంటామన్న ఎస్‌ఇసి

ఎన్నికల ప్రవర్తన నియమావళికి విరుద్ధంగా వాలంటీర్లు ఎవరైనా విధులు నిర్వహిస్తే వెంటనే తమకు ఫిర్యాదు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ‌పేర్కొంది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. వాలంటీర్ల వ్యవహారాలకు సంబంధించి రాజకీయ పార్టీలు, ప్రజలు, ప్రసార సాధనాల నుంచి పలు ఫిర్యాదులు తమ దృష్టికి వస్తున్నాయని తెలిపింది. ఓటర్లను భయబ్రాంతులకు గురి చేయడం, వారిని ప్రలోభపెట్టడం, నిష్పక్షపాతంగా జరగాల్సిన ఎన్నికల క్రతువులో వాలంటీర్ల ప్రమేయం అందుకు భిన్నంగా ఉండటం తదితర ఆరోపణలకు దూరంగా ఉండాల్సిన అవసరం ఉందని కమిషన్‌ అభిప్రాయ పడింది. ఎన్నికల ప్రవర్తన నియమావళికి ఎవరు విరుద్ధంగా వ్యవహరించినా వారిపై చర్యలు తప్పవని హెచ్చరించింది.

ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కాల్‌సెంటర్‌ ‌కమిషన్‌ ‌పరిధిలో 24 గంటలు పనిచేస్తుందని ఎస్‌ఈసీ తెలిపింది. ఎన్నికల నియమావళికి భిన్నంగా ఏ వాలంటీరు పనిచేస్తున్నా కాల్‌సెంటర్‌ ‌ఫోన్‌ ‌నంబర్‌ 0866-2466877‌కు ఫిర్యాదు చేయొచ్చని తెలిపింది. ఫిర్యాదులను తక్షణం పరిశీలించి చర్యలు తీసుకుంటామని పేర్కొంది. కాల్‌సెంటర్‌తోపాటు ఈమెయిల్‌ అం‌దుబాటులో ఉంటుందని తెలిపింది. బ।ఞా.జూబ।ఞ2అణపజీతి.ఞనీప మెయిల్‌కు కూడా ఫిర్యాదు పంపొచ్చని తెలిపింది.

అదేవిధంగా జిల్లాల్లోను, మున్సిపాలిటీల్లోను కలెక్టర్లు, మున్సిపల్‌ ‌కమిషనర్‌ ‌కార్యాలయాల్లో హెల్ప్‌లైన్లు, కాల్‌సెంటర్లు పనిచేస్తున్నాయని.. వాటికి కూడా ఫిర్యాదు చేయొచ్చని వివరించింది. ఎన్నికలపై ఓటర్లలో విశ్వాసం కలిగించడానికి అవసరమైన అన్ని చర్యలు కమిషన్‌ ‌తీసుకుంటోందని స్పష్టం చేసింది.

Leave a Reply