Take a fresh look at your lifestyle.

రైతు వేదికల నిర్మాణాలతోనే మార్పు

తాండూర్‌, ‌జూలై 7, ప్రజాతంత్ర విలేఖరి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న రైతు వేధికలు వ్యవసాయ చరిత్రలో పెను మార్పులకు శ్రీకారం చుట్టయన్నాయని అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ ‌రెడ్డి పేర్కోన్నారు. మంగళవారం బెల్లంపల్లి మండలంలోని కన్నాల గ్రామాల్లో రైతు వేధిక భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ ‌రైతులను రాజును చేసేందుకు ఎన్నో పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు. రైతులకు పంటల సాగు కోసం పుష్కలంగా నీరు, రైతుబంధు సహాయం, పంటలకు గిట్టుబాటు ధరలు కల్పిస్తూ రైతుల సంక్షేమానికి పాటు పడుతున్నారని తెలిపారు.

రైతు వేధికల ద్వారా రైతులు అన్ని విషయాలపై చర్చలు జరుపుకోని మార్కెటింగ్‌కు అనుగుణంగా పంటలు వేస్తూ లాభాలు గడించాలని పేర్కోన్నారు. అనంతరం ఆరవ విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా బెల్లంపల్లిలోని ఏఆర్‌ ‌హెడ్‌ ‌క్వార్టర్స్‌లో పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హరితహారం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటి సంరక్షించాలని పేర్కోన్నారు. బెల్లంపల్లి ఏఆర్‌హెడ్‌ ‌క్వార్టర్స్‌లో 40 వేల రకాల మొక్కలు నాటడానికి ముందుకు రావడం గొప్ప విషయమన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పురాణం సతీష్‌, ‌జిల్లా జెడ్పీ చైర్మన్‌ ‌నల్లాల భాగ్యలక్ష్మీ, ఓదేలు, ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, గ్రంథాలయ చైర్మన్‌ ‌ప్రవీణ్‌ ‌సీపి సత్యనారాయణ,కలెక్టర్‌ ‌భారతి హోళ్ళికేరి, డిసిపి ఉదయ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి, బెల్లంపల్లి ఎసిపి రహెమాన్‌, ‌ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply