Take a fresh look at your lifestyle.

స్వాతంత్య్ర సమరయోధుల త్యాగమే నేటి మనస్వేచ్చకు మూలం..

  • క్విట్ ఇండియా దినోత్సవము సందర్భంగా స్వాతంత్య్ర సమరయోధుడు అనుముల నర్శయ్య కు సన్మానo

*రాష్ట్రపతి తరపున అంగవస్త్రం, శాలువ తో సత్కరించిన జెడ్పీ చైర్మన్, సిరిసిల్ల జిల్లా అదనపు కలెక్టర్.
స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాల ఫలితం నేడు మనం అనుభవిస్తున్న స్వేచ్చ అని జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి ఎన్ అరుణ అన్నారు. క్విట్ ఇండియా దినోత్సవము ఆగస్ట్ 9న సందర్భంగా కోనారావు పేట మండలం నిమ్మపల్లిలోని తన గృహంలో 90 సంవత్సరాల స్వాతంత్య్ర సమరయోధుడు అనుముల నర్శయ్య ను జిల్లా అదనపు కలెక్టర్ ఆర్ అంజయ్య, జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి ఎన్ అరుణ లు సంయుక్తంగా డిల్లీ రాష్ట్ర కార్యాలయం నుంచి ప్రత్యేకంగా వచ్చిన అంగవస్త్రం, శాలువ తో ఘనంగా సన్మానించారు.

ఈ సంధర్భంగా జెడ్పీ చైర్మన్ శ్రీమతి ఎన్.అరుణ మాట్లాడుతూ..స్వాతంత్య్ర సమరయోధుడు అనుముల నర్శయ్య లాంటి స్వాతంత్య్ర సమరయోధుల త్యాగల వల్లే మనం స్వేచ్ఛ వాయువులు పీల్చుకుం టున్నామని పేర్కోన్నారు. క్విట్ ఇండియా దినోత్సవము రోజు వారిని సత్కరించుకోడం అనందంగా ఉందన్నారు. స్వయంగా రాష్ట్రపతి భవన్ నుంచి సన్మానం చేయాలని అదేశాలు రావడం జిల్లా ప్రజలo దరికి గర్వకారణం అని అన్నారు. జిల్లా అదనపు కలెక్టరు శ్రీ ఆర్ అంజయ్య మాట్లాడుతూ..ప్రతి ఏటా ఢిల్లీ లోని రాష్ట్రపతి భవన్ లో రాష్ట్ర పతి క్విట్ ఇండియా దినోత్సవము ఆగస్ట్ 9న సందర్భంగా స్వాతంత్య్ర సమరయోధులకు సన్మానo చేస్తు న్నార నీ తెలిపారు.ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం జిల్లాలో నీ స్వాతంత్య్ర సమరయోధుల వివరాలు పంపవల సిందిగా కోరగా జిల్లా నుంచి నిమ్మపల్లి వెళ్లి స్వాతంత్య్ర సమరయోధుడు అనుముల నర్శయ్య పేరును జిల్లా కలెక్టర్ ప్రతిపాదించారని తెలిపారు.వీరిని సన్మానం కోసం ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.

కోవిద్ నేపథ్యంలో స్వాతంత్య్ర సమరయోధులను క్విట్ ఇండియా దినోత్సవము ఆగస్ట్ 9న వారి నివాసంలోనే రాష్ట్ర పతి తరపున సన్మానం చేయాలని కేంద్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్ లకు ఆదేశాలు జారీచేసిందన్నారు.ప్రభుత్వ ఆదేశాల మేరకు వారి నివాస గృహంకు వచ్చి సన్మానం చేశామన్నారు.నవతరానికి స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను గుర్తుచేయడంతోపాటు నాటి దేశభక్తి స్ఫూర్తిని ప్రేరేపించే ఉద్దేశంతోనే ప్రభుత్వము ఈ కార్యక్రమాలను చేపడుతున్నామని అదనపు కలెక్టర్ అన్నారు.ఈ కార్యక్రమం ద్వారా దేశ స్వాతంత్య్రం గురించే కాకుండా ఎంత కష్టపడితే, ఎన్ని త్యాగాలు చేస్తే ఇది సిద్ధించిందన్న వాస్తవాన్ని కూడా నేటి తరానికి తెలియ జేసి నట్లు అవుతుందన్నారు.కార్యక్రమం లో మండల ఎంపీపీ ఏదురు గట్ల చంద్రయ్య, సెస్ డైరెక్టర్ తిరుపతి, తహశీల్దార్ నరేందర్ , స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply