Take a fresh look at your lifestyle.

కొరోనా కట్టడిలో పోలీసుల పాత్ర అభినందనీయం

స్వీయ రక్షణ తో సమాజ పరిరక్షణ : ఎస్పి రమ రాజేశ్వరి

మహబూగర్‌ 21 ‌మే ప్రజాతంత్ర ప్రతినిధి )మాజాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా మహమ్మారి అంటువ్యాధి నుండి ప్రజలను కాపాడే గురుతర బాధ్యత మన పోలీసులపై ఉన్నదని, ఈ నేపథ్యంలో పోలీసు సిబ్బంది స్వయంగా తమ రక్షణకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా ఎస్‌.‌పి. రెమా రాజేశ్వరి  అన్నారు. కనిపించని మహమ్మారి కరోనా అంటువ్యాధితో పోరాటం చేయడంలో సిబ్బంది  ర్‌ఓ ‌పికగా, తెలివిగా వ్యవహరించే విధానాలపై అవగాహన కల్పించేందుకుగానూ ప్రత్యేక బృందాలతో జిల్లా పోలీసులకు అవగాహన కల్పించే కార్యక్రమాన్ని ఎస్‌.‌పి. గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా అధికారి మాట్లాడుతూ కరోనా అంటువ్యాధి గురించి దాదాపుగా అందరికీ అవగాహన ఉన్నదని, ఈ వ్యాధి పట్ల అజాగ్రత్తగా, నిర్లక్ష్యంగా ఉంటే మాత్రం ఒక్కరితో కాకుండా కుటుంబం, సమాజం ఇబ్బందులు ఎదుర్కొనక తప్పదని అన్నారు.
ముఖ్యంగా ప్రస్తుత పరిస్థితుల్లో సమాజ రక్షణలో ప్రధాన భూమిక పోషిస్తున్న పోలీసు సిబ్బంది స్వీయ రక్షణకు ప్రాధాన్యతనిస్తూ సమాజ పరిరక్షణకు కృషి చేయాలని ఎస్‌.‌పి. స్ఫూర్తినిచ్చారు. ఇందులో భాగంగానే ఆయా పోలీసు స్టేషన్లలోని వివిధ విభాగాలు రిసెప్షన్‌, ‌రైటర్‌, ‌ట్రాఫిక్‌, ‌కోర్టు ఇతర విధుల్లో ఉన్నవారు తీసుకొనవలసిన జాగ్రత్తలు, ప్రజలు, బాధితులకు అవగాహన కల్పిస్తూ విధుల్లో వ్యవహరించవలసిన విషయాలపై పోలీసు బృందాలతో అవగాహన కల్పిస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో భాగంగా నేడు రెండు బృందాలు స్థానిక వన్‌ ‌టౌన్‌, ‌టూ టౌన్‌, ‌రూరల్‌, ‌మహిళా పోలీసు స్టేషన్లలో అవగాహనా కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా పోలీసు సిబ్బందికి జాగ్రత్తలు చెప్తూ, విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు రక్షణ కల్పించే బాధ్యతలను నిష్ఠతో చేద్దామనే ఎస్‌.‌పి.  ఆలోచనలను వివరించడానికిగానూ శిక్షణ పొందిన పోలీసు బృందాలు సంఘ అధ్యక్షుడు వెంకటయ్య, ఉపాధ్యక్షుడు మద్దిలేటి, కళా బృందం సభ్యులు రాములు, జగదీశ్వర్‌ ‌పోలీసు స్టేషన్లను సందర్శిస్తున్నారు. ఇన్స్పెక్టర్లు మహేశ్వర్‌, ‌శ్రీనివాస చారి, రాజేశ్వర్‌, ‌హన్మప్ప, ఎస్‌.ఐ.‌లు పాల్గొన్నారు.

Leave a Reply