Take a fresh look at your lifestyle.

అనాధ పిల్లల హక్కులు సాధించాలి

  • స్వచ్ఛందసంస్థల డిమాండ్‌
  • సమస్యను  పార్లమెంట్లో ప్రస్తావించాలని ఢిల్లీలో ఎంపీలను కలిసి వినతి

అనాధ బిడ్డల హక్కుల సాధనకోసం తెలంగాణకు చెందిన రోటరీ, ఫోర్స్ ‌నేషనల్‌ ‌తదితర సంస్థలు ఉద్యమించాయి. అనాధల హక్కులు, వారి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవలసిన ఆవశ్యకత గురించి ఈ పార్లమెంట్‌ ‌సమావేశాల సందర్భంగా పార్లమెంటులో ప్రస్తావించి చర్చించాలని కోరుతూ ఆ సంస్థల ప్రతినిధులు ఢిల్లీకి వెళ్లి శనివారం పలువురు ఎంపిలను కలిసి వ్ఞిప్తి చేశారు. ఫోర్స్ ‌సంస్థ అధ్యక్షులు శ్రీ గాదె ఇన్నారెడ్డి, రోటరీ క్లబ్‌ ఆఫ్‌ ‌హనుమకొండ మాజీ డిప్యూటీ గవర్నర్‌ ‌కాయుత ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. దేశంలో సుమారు 4 కోట్ల మంది అనాథ బిడ్డలు ఎటువంటి గుర్తింపు లేకుండా జీవిస్తూ వివిధ ఆశ్రమాలలో, దాతల సహాయ సహకారాలతో వారి విద్యను కొనసాగిస్తున్నారు.

The rights of orphaned children should be achievedవారికి ప్రభుత్వం నుండి ఏ రకమైన సహాయం అందడం లేదని వారి తెలిపారు. అందుకే అనాధల హక్కుల సాధన కోసం 25 మంది టీమ్‌ ‌సభ్యులు, మాఇల్లు ప్రజాదరణ ఆశ్రమం బిడ్డలు ఢిల్లీకి వచ్చారు. గత మూడు రోజులుగా ఇక్కడే మకాం వేశారు. పార్లమెంట్‌ ‌సమావేశాలు ముగింపు వరకూ ఢిల్లీలోనే ఉంటామని వారు తెలిపారు. ఢిల్లీలో ఉంటూ, వివిధ రాష్ట్రాల లోక్‌సభ, రాజ్యసభ సభ్యులను కలిసి రాజ్యాంగంలో అనాధ అనే పదానికి నిర్వచనం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతామన్నారు. కేంద్ర మంత్రులను కలిసి వినతిపత్రాలు అందజేస్తామన్నారు. ఇంతేగాకుండా ఈనెల 11వ తేదీన డిన్నర్‌ ‌విత్‌ ఆర్ఫన్స్ అనే కార్యక్రమాన్ని పెట్టి పార్లమెంటేరియన్స్, ‌మీడియా, పాలసీ మేకర్స్‌ని ఆహ్వానించామని, 12న ఢిల్లీలోని తెలంగాణభవన్‌లోని అంబేద్కర్‌ ఆడిటోరియంలో అనాధలకు రాజ్యాంగపరమైన హక్కులకై ఒక కన్సల్టేషన్‌ ‌కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నామని వారు పేర్కొన్నారు. శనివారం రాజ్యసభ సభ్యులు ప్రొఫెసరు మనోజ్‌ ‌కుమార్‌ ‌ఝా, ఆంధ్రా అసోసియేషన్‌ అధ్యక్షులు ఆర్‌ ‌మణినాయుడు, ఉపాధ్యక్షులు నజీర్‌జాన్‌, ‌కార్యదర్శులు కోటగిరి సత్యనారాయణ ఏవో ప్రభుదాస్‌ ‌వీరి కార్యకమ్రంలో మాట్లాడారు.

రాజ్యసభ సభ్యులు బండ ప్రకాష్‌ , ‌ఢిల్లీ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్లు డాక్టర్‌ ‌మధుసూదన్‌, ‌ప్రొఫెసర్‌ ‌సంజయ్‌ ‌భట్‌, ‌సంజయ్‌ ‌జోషి, ఫార్మర్‌ ఆర్గనైజింగ్‌ ‌జనరల్‌ ‌సెక్రెటరీ, అరకు లోక్‌సభ సభ్యురాలు జి. మాధవి , గోరఖ్‌పూర్‌ ‌లోక్‌సభ సభ్యుడు జి.రవికిషన్‌శుక్లా, మీరట్‌ ‌బిజ్నూర్‌ ‌లోక్‌సభ సభ్యుడు మలూక్‌ ‌నాగర్‌, ‌రాజ్యసభ సభ్యుడు టీ.జీ వెంకటేష్‌,ఉత్తరప్రదేశ్‌ ‌రాజ్యసభ సభ్యులు రామశకల్‌, ‌రాజస్థాన్‌ ‌రాజ్యసభ సభ్యులు నారాయణ్‌, ‌తమిళనాడు రాజ్యసభ సభ్యులు ఏ.విజయ్‌కుమార్‌, ఉత్తరప్రదేశ్‌ ‌రాజ్యసభ సభ్యులు బాలసుబ్రహ్మణ్యం, నేషనల్‌ ‌కమీషన్‌ ‌ఫర్‌ ‌షెడ్యూల్డ్ ‌క్యాస్టెస్‌ ‌కె. రాములు, నేషనల్‌ ‌సెక్రటరీ శ్రీరామ్‌ ‌నాయక్‌, ‌శ్రీనివాస్‌ ‌యూత్‌ ‌కాంగ్రెస్‌ ‌నేషనల్‌ ‌ప్రెసిడెంట్‌, ‌మాజీ పార్లమెంట్‌ ‌సభ్యులు పొన్నం ప్రభాకర్‌, ‌సిరిసిల్ల రాజయ్య, హనుమంతరావు, బలరాంనాయక్‌ ‌తదితరులను కలిసి వినతిపత్రాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్‌ ‌మధుసూదన్‌, ‌సౌజన్య, ఆనంద్‌బాబు ఇచ్చా ఫౌండేషన్‌, ‌ఫోర్స్ ‌సభ్యులు మొదలైన వారు పాల్గొన్నారు..

Leave a Reply