Take a fresh look at your lifestyle.

భారత రాజ్యంగం హామి ఇచ్చిన హక్కులు వివికి దక్కాల్సిందే.. తెలంగాణ విద్యావంతుల వేదిక

“గొప్పలు చెప్పుకోవడానికి మాత్రం భారతదేశం ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం.ఆచరణలో మాత్రం ప్రజాస్వామిక ఆకాంక్షలను  విస్మరిస్తూ యధేచ్ఛగా నియంతృత్వ విధానాలు అమలు చేస్తున్న దుస్థితి.తెలుగు రాష్ట్రాలలోని కవులు రచయితలు, ప్రజాస్వామికవాదులే గాకుండా దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా అనేకమంది కవులు కళాకారుల రచయితలు మేధావులు మహారాష్ట్ర ప్రభుత్వానికి,కేంద్ర ప్రభుత్వానికి మరియు
ఈ దేశ అత్యున్నత న్యాయవ్యవస్థ కు విజ్ఞాపన చేసినా,భిన్న రూపాలలో నిరసనలు తెలియజేసినా పట్టించుకున్న దాఖలాలు లేవు.కనీసం వరవరరావు గారి వయస్సు రీత్యానైనా  ప్రభుత్వం స్పందించాల్సి వుండే  ఆ కోణంలో కూడ అలోచన చేయలేదు.కనీసం వరవరరావు గారి ఆరోగ్య సమాచారాన్ని  కుటుంభ సభ్యులకు తెలియజేయవల్సివుండే..”

భారత ప్రజలమైన మేము భారతదేశ సర్వసత్తాక,సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగాన్ని మాకు మేము సమర్పించుకుంటున్నాం.అని ప్రజల ఆకాంక్షలు ఉట్టిపడేటట్లు రాజ్యంగం పట్ల ప్రజా విశ్వసనీయత ప్రతిబింబి ంచేటట్లు రూపకల్పన చేసిన సార్వజ నీనుడు డాక్టర్‌ ‌బాబా సాహెబ్‌ అం‌బేద్కర్‌.అధికారం అనేది ఏ ఒక్కరి సొత్తు కావొద్దు..ప్రజాస్వామిక బద్దంగా అధికార వికేంద్రీకరణ జరగాలని అంబేడ్కర్‌ ‌గారు భావించారు.ఆ వైపు గా ప్రభుత్వాలు రాజ్యం యొక్క, ప్రజల యొక్క లక్ష్యాలు,ఆశయాలు నెరవేర్చేవిధంగా బాధ్యతాయుతంగా పనిచేయాలని బాబాసాహెబ్‌ ‌రాజ్యంగం లో ప్రస్తావించడం జరిగింది. అధికారం అనడం కంటే కూడా రాజ్యంగం అప్పగించిన బాధ్యత లను శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థ లు ,వీటిని నడిపే బ్యూరోక్రసీ, రాజకీయ వ్యవస్థలు, న్యాయాధీశులు రాజ్యంగం నిర్థేశించిన మార్గంలో ప్రజల ఆకాంక్షలకు అనుగునంగా పని చేయాలని అప్పుడే రాజ్యంగ మౌళిక స్వరూపం యొక్క సంపూర్ణమైన అర్థం ప్రతిబింబించబడతని అంబేడ్కర్‌ ‌గారు ప్రస్తావించారు.కాని నేటి బారతప్రభుత్వం రాజ్యాంగ ప్రాతిపదికన కొనసాగడం లేదని బుద్ది జీవుల వాదన.

ఈ దేశానికి కావాల్సిన అత్యున్నతమైన శాసనాలను రుపొందించాల్సిన పార్లమెంట్‌(‌శాసన వ్యవస్థ), మరియు ప్రజలచేత అధికారం పొందిన మెజార్టీ పార్టీ మరియు అధికార పార్టీ తరుపున కొనసాగుతున్న ప్రజా ప్రతినిధులు ఏనాడు ప్రజల విశ్వాసాన్ని చూరగొనలేదు.కాస్తోకూస్తో రుపొందించబడిన కొన్ని చట్టాలు ప్రజా ఉధ్యమాల ఒత్తిడి మేరకే రుపొందించబడినవి మాత్రమే గాని ప్రజల మీద ప్రేమతో కాదనేది చారిత్రక వాస్తవం. పార్లమెంట్‌ ‌సమావేశంలో లేనప్పుడు అత్యవసరం అనుకుంటే మాత్రమే జారీ చేయాల్సిన ఆర్డినెన్సులను అడ్డగోలుగా జారీచేస్తున్నారు.అలా రుపొందించబడినవే ఉపా లాంటి నల్లచట్టాలు. కనీసం ప్రతిపక్షాలకు వాటి పై చర్చకు అవకాశం లేకుండా బావప్రకటనా స్వేచ్ఛను హరించి వేస్తూ ఏకపక్ష నిర్ణయాలతో ముందుకు సాగుతున్నారు.రాజ్యంగ నియమాలకు లోబడి నడుచుకుంటామని, రాజ్యంగం మీద ప్రమాణం చేసిన వారు రాజ్యంగం అప్పగించిన బాధ్యత లను విడనాడి మనువాదులు రుపొందించుకున్న రాజ్యంగాన్ని వారి వ్యక్తిగత నమునాను అమలు చేసుకుంటున్నారు.కేంద్రం సమాఖ్య స్పూర్తి కి విఘాతం కలిగిస్తూ రాష్ట్రాలకు రాజ్యంగం ఇచ్చిన హక్కులను హరించివేస్తుంది. మహారాష్ట్ర ప్రభుత్వం పరిధిలో వున్న వరవరరావు కేసును ఎన్‌.ఐ.ఏ ‌పేరుతో కేంద్రం తన ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది ఇది రాజ్యాంగ స్పూర్తి కి విరుద్దం కాదా..!ఎటుగూడి ఈ దేశంలో శాసన,కార్యనిర్వాహక వ్యవస్థ లు పెట్టుబడిదారులకు ఊడిగం చేస్తూ ప్రజా ఆకాంక్షలకు పాడెగడుతున్నవి.కనీసం న్యాయవ్యవస్థ ఐనా ప్రజల పక్షాన, ప్రజాస్వామికవాదుల పక్షాన నిలబడతదని ఈ దేశ న్యాయ వ్యవస్థ పాలకుల చేతిలో కీలుబొమ్మ కావొద్దని మహానీయుడు డాక్టర్‌ ‌బాబాసాహెబ్‌ అం‌బేడ్కర్‌ ‌న్యాయవ్యవస్థ కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించడం జరిగింది… కాని నేడు ఆ వ్యవస్థ తనకున్న స్వతంత్ర ను మరియు ప్రజల విశ్వాసాన్ని కోల్పోతున్నట్లు, స్పష్టం గా కనబడుతుంది..22 నెలలు గా ఎనిమిదిపదుల వయస్సు లో ఒక కవి విచారణ ఖైదీ గా వున్నాడంటే ప్రజాస్వామ్య వ్యవస్థ ఎంతమేరకు పరిడవిల్లుతుందో అర్థంచేసుకోవొచ్చు.

కనీసం వైద్య సౌకర్యాలు కల్పించకుండా, న్యాయవ్యవస్థే వివి, సాయిబాబా లాంటి ప్రజాకవుల’రచయితల జీవించే హక్కును కాపాడలేకపోతున్నాయంటే..?? ప్రజలు, ప్రజా సంఘాలు, బుద్ది జీవులు ఇంకా ఎవరికి మొరపెట్టుకోవాలి..??? గొప్పలు చెప్పుకోవడానికి మాత్రం భారతదేశం ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం.ఆచరణలో మాత్రం ప్రజాస్వామిక ఆకాంక్షలను విస్మరిస్తూ యధేచ్ఛగా నియంతృత్వ విధానాలు అమలు చేస్తున్న దుస్థితి.తెలుగు రాష్ట్రాలలోని కవులు రచయితలు, ప్రజాస్వామికవాదులే గాకుండా దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా అనేకమంది కవులు కళాకారుల రచయితలు మేధావులు మహారాష్ట్ర ప్రభుత్వానికి,కేంద్ర ప్రభుత్వానికి మరియు ఈ దేశ అత్యున్నత న్యాయవ్యవస్థ కు విజ్ఞాపన చేసినా,భిన్న రూపాలలో నిరసనలు తెలియజేసినా పట్టించుకున్న దాఖలాలు లేవు.కనీసం వరవరరావు గారి వయస్సు రీత్యానైనా ప్రభుత్వం స్పందించాల్సి వుండే ఆ కోణంలో కూడ అలోచన చేయలేదు.కనీసం వరవరరావు గారి ఆరోగ్య సమాచారాన్ని కుటుంభ సభ్యులకు తెలియజేయవల్సివుండే..అదికూడ జరుగడం లేదంటే రాజ్యం వరవరరావు గారి పట్ల వ్యవహరిస్తున్న కక్షపూరిత ధోరణిని అర్థం చేసుకోవచ్చు.పాలకులు మరియు న్యాయవ్యవస్థ తీరు చూస్తుంటే అస్సలు వివి భారత రాజ్యంగం పరిధిలోకి రాడా..! బారత రాజ్యంగం వివికి వర్తించదా..! వరవరరావు కు జీవించే హక్కు లేదా..! బారత రాజ్యంగం హామి ఇచ్చిన హక్కులు వివికి దక్కకూడదా.! అనే ప్రశ్నలు నిస్సందేహంగా ఉత్పన్నమవుతున్నాయి.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహజ న్యాయ సూత్రాలను, చట్టాలను అతిక్రమిస్తూ దేశ వ్యాప్తంగా విద్యార్థులు, కవులు, రచయితల, మేధావులపై విధిస్తున్న నిర్బంధం రాజ్యంగ వ్యతిరేకం కాదా..! కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రశ్నించే గొంతులను బలవంతంగా నొక్కే కార్యక్రమం కొనసాగుతున్నది. మోసపూరిత అవాస్తవ అర్థరహిత అభియోగాలను మోపి హింసిస్తున్నది వాస్తవం కాదా..! వృద్దులు, వికలాంగులు, మహిళలు, అమాయక యువకులని కూడా చూడకుండా ఏండ్ల కొలది జైల్లల్లో పెట్టి మానసికంగా కుంగదీస్తున్నది. దేశ ద్రోహ అభియోగాలు మోపబడుతున్నాయి. నిజానికి వీరి కార్యక్రమాలు, నమ్మే సిద్ధాంతాలు రాజ్యాంగ విలువలను, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకొనుటకే నని తెలంగాణ విద్యావంతుల వేదిక బలంగా నమ్ముతున్నది. భీమాకోరెగావ్‌ ‌కేసు విషయంలో తెలంగాణ తొలిదశ ఉద్యమ కారుడు, కవి, రచయిత, హక్కుల కార్యాకర్త వరవర రావు గారిని 2018 నవంబరు నుండి జైల్లో పెట్టారు. ఆయన మీదనే కాక సురేంద్ర గాడ్లింగ్‌, ‌శోమసేన్‌, ‌రోనా విల్సన్‌, ‌సుధీర్‌ ‌ధావలే, మహేష్‌ ‌రౌత్‌, ‌సుధా భరద్వాజ్‌, ‌వర్మన్‌ ‌గొన్సాల్వేస్‌, అరుణ్‌ ‌పెరిరా,నల్లమాస క్రిష్ణ తదితర ప్రజా గొంతుకలపై అభియోగాలను మోపి అరెస్ట్ ‌చేసారు. గత రెండేళ్లుగా ఈ కేసు విచారణ దర్యాప్తు సాక్ష్యాదారాల విషయంలో ఒక్కటంటే ఒకక్క అడుగు కూడా ముందుకు పడలేదు.

ఆదివాసుల హక్కుల కోసం నిరంతరం పోరాడిన వారు 90% పైబడి శరీర అవయవాల వికలత్వంతో చక్రాల కుర్చీలో గత నాలుగేండ్లుగా జైల్లో న్యాయం కోసం ఎదురుచూస్తున్నారు ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫసర్‌ ‌జి.ఎన్‌. ‌సాయిబాబా.. వీరు ఏ రాజ్యాన్ని కూల్చగలడు..? వృద్దాప్య దశలో వున్న వరవరరావు ఏ కట్రలకు పూనుకోగలడు..? సమాజంలో ప్రశ్నించే గొంతులను నులమడానికే కేంద్ర ప్రభుత్వం ఈ తంతును కొనసాగిస్తుందని బుద్దిజీవులకు, విద్యావంతులకు అర్థమవుతుంది.మానవ మహమ్మరి కోవిడ్‌ ‌ను దృష్టిలో పెట్టుకొని జైల్లో ఉండే ఖైదీలను విడుదల చేయమని, జైళ్లు ఖాళీ చేయమని సుప్రీం కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను బుట్ట దాఖలు చేస్తున్నది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న ఈ నిర్బంధాన్ని, దమనకాండను తెలంగాణ విద్యావంతుల వేదిక తీవ్రంగా ఖండిస్తున్నది. వర వరరావు, సాయిబాబా తో పాటు వివిధ కేసులలో అభియోగాలు మోపబడిన విధ్యార్థులను, కవులు, మేధావులు మరియు రాజకీయ ఖైధీలను విడుదల చేయాల్సిందిగా తెలంగాణ విద్యావంతుల వేదిక డిమాండ్‌ ‌చేస్తున్నది.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!