Take a fresh look at your lifestyle.

శాసన మండలి ఎన్నికలలో వోటు హక్కు ని సద్వినియోగం చేసుకోవాలి

“ఈ ఎన్నికల్లో ప్రాధాన్యత ప్రకారం వోటు వేయాల్సి రావడంతో చాలామందిలో ఆందోళన నెలకొని ఉంది. పోటీ చేస్తున్న వారిలో ఒక్కరికే కాకుండ ఒకరికన్నా మించి లేదా అందరికీ కూడా తమ ప్రాధాన్యత ప్రకారం అంకెల రూపంలో వోటు వేయడానికి ఓటర్‌ ‌కు అవకాశం ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల జాబితా పెద్దదిగానే ఉండటంతో బ్యాలెట్‌ ‌పేపర్‌ ‌భారీ సైజులోనే ఉండే అవకాశముంది. నల్గొండ-ఖమ్మం-వరంగల్‌ ‌స్థానానికి 71 మంది,… హైదరాబాద్‌- ‌రంగారెడ్డి – మహబూబ్‌ ‌నగర్‌ ‌స్థానానికి 93 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. పట్టభద్రుల్లో అనేక మంది వోటు వేయడానికి వెనకడుగు వేస్తూ వున్నారు. వోటు వేయడం రాజ్యాగం మనకు కల్పించిన వరం అని తెలిసినా ఆ అప్పటి వరకు ఆలోచించుదాంలే అనుకుంటూ తీర సమయానికి వోటు హక్కు వినియోగించు కోవడం లేదు.”

తెలంగాణలో రెండు గ్రాడ్యుయేట్‌ ‌శాసన మండలి స్థానాలకు మార్చి14పోలింగ్‌ ‌జరగబోతోంది. ఆరు ఉమ్మడి జిల్లాలకు విస్తరించిన ఈ రెండు నియోజకవర్గాల్లో దాదాపు 10 లక్షల మంది గ్రాడ్యుయేట్స్ ‌తమ వోటు హక్కును వినియోగించుకోబోతున్నారు. వీళ్ళల్లో సగం మందికి పైగా మొదటిసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో వోటు వేస్తున్నారు. ఈ ఎన్నికల్లో ప్రాధాన్యత ప్రకారం వోటు వేయాల్సి రావడంతో చాలామందిలో ఆందోళన నెలకొని ఉంది. పోటీ చేస్తున్న వారిలో ఒక్కరికే కాకుండ ఒకరికన్నా మించి లేదా అందరికీ కూడా తమ ప్రాధాన్యత ప్రకారం అంకెల రూపంలో వోటు వేయడానికి ఓటర్‌ ‌కు అవకాశం ఉంది.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల జాబితా పెద్దదిగానే ఉండటంతో బ్యాలెట్‌ ‌పేపర్‌ ‌భారీ సైజులోనే ఉండే అవకాశముంది. నల్గొండ-ఖమ్మం-వరంగల్‌ ‌స్థానానికి 71 మంది,… హైదరాబాద్‌- ‌రంగారెడ్డి – మహబూబ్‌ ‌నగర్‌ ‌స్థానానికి 93 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. పట్టభద్రుల్లో అనేక మంది వోటు వేయడానికి వెనకడుగు వేస్తూ వున్నారు. వోటు వేయడం రాజ్యాగం మనకు కల్పించిన వరం అని తెలిసినా ఆ అప్పటి వరకు ఆలోచించుదాంలే అనుకుంటూ తీర సమయానికి వోటు హక్కు వినియోగించు కోవడం లేదు.తద్వారా ఓటింగ్‌ ‌శాతం తగ్గుతూ వుంది. వోటు హక్కు వున్న ప్రతీ పట్టభద్రులు ఈ సారి ఎక్కడ వోటు హక్కు వున్న అక్కడికి నిర్ణీత సమయానికి చేరుకుని వోటు హక్కు ని సద్వినియోగం చేసుకోవాలి.

మీరు వోటు వేసే ముందు కొన్ని విషయాలు గుర్తుంచుకోండి.
1) తమకు నచ్చిన అభ్యర్థికి మొదటి నెంబర్‌ ‌వోటు వేసి… మిగతా వారికి కూడా వరుసగా నెంబర్స్ ‌వేసే అవకాశం మీకు ఉంది. లేదా వేయకపోవచ్చు కూడా,2) ఉదాహరణకు మీకు నచ్చిన వ్యక్తి 30వ నెంబర్‌ ‌లో ఉన్నాడనుకుంటే… ముందుగా అతని పేరు పక్కన 1 నెంబర్‌ ‌వేయాలి… ఆ తర్వాత రెండో ప్రాధాన్యత ఇస్తున్న వ్యక్తి నెంబర్‌ 5‌లో ఉందనుకోండి… అతని పేరు పక్కన రెండో నెంబర్‌ ‌వేయాలి. ఇలా బ్యాలెట్‌ ‌పేపర్‌ ‌పై మనకు ఇష్టమొచ్చిన వాళ్ళందరికీ మీ ప్రాధాన్యత ప్రకారం వోటు వేయొచ్చు.,3) అందరికీ ఒకటే నెంబర్‌ ‌వేయకూడదు. 1 నుంచి 2,3,4 ఇలా మాత్రమే వోటు వేయాలి. సాధరణ ఎన్నికలకు లాగా స్వస్తిక్‌ ‌మార్క్ ‌వేయడం ఉండదు.,4) మీరు ప్రాధాన్యత ప్రకారం వోటు వేసేటప్పుడు ఎక్కడా కూడా సీరియల్‌ ‌నెంబర్‌ ‌మిస్‌ ‌చేయొద్దు. ఒక వేళ మిస్‌ అయితే… సక్రమంగా ఉన్నంత వరకే మీ వోటు లెక్కలోకి తీసుకుంటారు.,5) బ్యాలెట్‌ ‌పేపరులో నోటా ఉండదు,6) భారత ఎన్నికల సంఘా జారీ చేసినవోటరు గుర్తింపు కార్డు లేదా ఎలక్షన్‌ ‌కమిషన్‌ అనుమతించిన ఇతర డాక్యుమెంట్లను చూపి వోటు వేయొచ్చు

ఏ వోట్లు చెల్లుతాయి ?
1) మీ ప్రాధాన్యతా క్రమాన్నిబట్టి 1,2,3,4,5… ఇలా అంకెలలో మాత్రమే మీ వోటు వేయాలిలి,2) ఒక అభ్యర్థికి ఒక ప్రాధాన్యత మాత్రమే ఇవ్వాలి… రెండు నెంబర్లు వేస్తే చెల్లదులి,3) బ్యాలెట్‌ ‌పేపర్‌ ‌లో ఉన్న వాళ్ళల్లో ఒక్కరికి మాత్రమే మొదటి ప్రాధాన్యత (1) అనేది ఇవ్వాలి. అందరికీ ఇవ్వకూడదు.,4) బ్యాలెట్‌ ‌పేపర్లలో ఉన్న అభ్యర్థులందరికీ ప్రాధాన్యత ఇవ్వదలిస్తే… వారి పేర్ల పక్కన నెంబర్‌ ‌వేయాలి.,5) అభ్యర్థి పేరు, ఫోటో పక్కన ఉన్న గడి లోపలే … బోర్డర్‌ ‌దాటకుండా సంఖ్య లేదా అంకె వేయాలి. ( అభ్యర్థులకు ఎలాంటి పార్టీ గుర్తులు అక్కడ ఉండవు ),6) 1,2,3,4,5… లేదా… రోమన్‌ అం‌కెలలో కూడా వేయొచ్చు.,7) పోలింగ్‌ అధికారి ఇచ్చిన పెన్ను మాత్రమే ఉపయోగించి మీ అంకెలు, సంఖ్యలు వేయాలి.

ఏ వోట్లు చెల్లవు?
1) బ్యాలెట్‌ ‌పేపర్‌ ‌పై వేలి ముద్ర లేదా సంతకం, పేర్లు…ఇతర ఏ రాతలు రాసినా మీ వోటు చెల్లదు.,2) రైట్‌ ‌గుర్తు, తప్పు గుర్తు… ఇతరత్రా ఏ బొమ్మలు వేయరాదు.,3) మొదటి ప్రాధాన్యత (1) నెంబర్‌ ఇవ్వకుండా 2,3,4… ఇలా మీరు ఎన్ని ఇచ్చినా మీ వోటు ను లెక్కలోకి తీసుకోరు.,4) ప్రాధాన్యత క్రమాన్ని అక్షరాల్లో రాయడం, కొన్ని అంకెల్లో వేయడం… మరికొన్ని అక్షరాల్లో రాయడం లాంటి గందరగోళ పనులు చేయరాదు.,5) ఒకే అభ్యర్థికి ఒకటి కంటే ఎక్కువ ప్రాధాన్యత నెంబర్స్ ఇవ్వరాదు.,6) ఎన్నికల అధికారి ఇచ్చిన పెన్ను తప్ప…. మీ పెన్ను లేదా పెన్సిల్‌ ‌లాంటివి ఉపయోగించరాదు.పోలింగ్‌ ‌కేంద్రంలో ఎలాంటి టెన్షన్‌ ‌లేకుండా ఒకటికి రెండు సార్లు బ్యాలెట్‌ ‌పేపర్‌ ‌పరిశీలన చేసి ప్రాధాన్యత క్రమంలో వోటు వేయాలి.కొరోనా వున్న కారణముగ తప్పక మాస్క్ ‌ధరించండి.సామాజిక దూరం పాటించండి.లైన్‌ ‌లో నిలబడి వోటు హక్కు వినియోగించటం మన భాధ్యత.గుంపులు గుంపులుగా కాకుండా ఒకరి తర్వాత ఒకరు వోటు వేయడం కూడా మన భాధ్యత.పోలింగ్‌ ‌సిబ్బందికి సహకరించండి.

kaamidi satish
కామిడి సతీశ్‌ ‌రెడ్డీ, జడలపేట, జయశంకర్‌ ‌భూపాలపల్లి జిల్లా, 9848445134

Leave a Reply