Take a fresh look at your lifestyle.

సమస్యలకు నిలయంగా పరిగి రెవెన్యూ కార్యాలయం

  • సమస్యలపై కార్యాలయానికి వెళితే కాలయాపనే
  • పనులు కావాలంటే డబ్బులు అడుగుతున్నారంటూ ఆరోపణలు

రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల నివారణే ధ్యేయంగా పలు పథకాలను ప్రవేశ పెట్టి అందుకు అనుగుణంగా అధికారులకు ఆదేశాలు జారీ చేసినా క్షేత్ర స్థాయిలో మాత్రం అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ పలు సమస్యల నిమిత్తమై కార్యాలయానికి వొచ్చే ప్రజలను రోజుకో కారణం చూపుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోతున్నారు. పరిగి తహసీల్దార్‌ ‌కార్యాలయంలో అధికారులు ఇష్టా రాజ్యంగా వ్యవహరిస్తున్నారని, తద్వారా పలు సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నట్టు  పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరణ ధృవీకరణ పత్రం పొందాలంటే 3 వేల రూపాయల డిమాండ్‌
‌పరిగి మండల పరిధిలోని రూఫ్‌ ‌ఖాన్‌ ‌పేట్‌ ‌గ్రామానికి చెందిన ఐనాపురం రాములమ్మ తన భర్త 2001లో మరణించగా ఆయన మరణ ధృవీకరణ పత్రం కోసం మీ సేవలో దరఖాస్తు చేసుకోగా దీని కోసం రెవెన్యూ కార్యాలయంలో  విధులు నిర్వహిస్తున్న ఓ అధికారి  3 వేల రూపాయలు డిమాండ్‌  ‌చేసినట్లు బాధితులు ఆరోపించారు.

రైతుకు తెలియకుండానే భూమి రిజిస్ట్రేషన్‌ ‌చేశారంటూ ఆందోళన..
తమ భూమి తమకు తెలియకుండానే అక్రమంగా ఇతరులకు రిజిస్ట్రేషన్‌ ‌చేశారని తహసీల్దార్‌ ‌కార్యాలయం ఎదుట రైతులు బైఠాయించి నిరసన తెలిపారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం… పరిగి మండలం మల్లేమొని గూడకు చెందిన రాగుల రామ్‌ ‌చంద్రయ్య అనే రైతు తన భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్‌ ‌చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. నజిరాబాద్‌ ‌గ్రామంలో గల 32/ఇ సర్వే నంబర్‌ ‌భూమి 1971 తాను కొనుగోలు చేయగా అప్పటి నుండి ఆ భూమి తన పేరుపై ఉండగా అట్టి భూమిని కొందరు రాజకీయ నాయకుల అండతో తహశీల్దార్‌ ‌కుమ్మైకై భూమిని తనకు కాకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. రిజిస్ట్రేషన్‌కు సంబంధించి రికార్డులను అడగగా వారం రోజుల నుండి తిప్పుకుంటూ కాలయాపన చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు సరైన న్యాయం జరగకపోతే కుటుంబ సమేతంగా కార్యాలయం ఎదుట ఆత్మహత్య చేసుకుంటామని బాధితులు తెలిపారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలంటూ పలువురు డిమాండ్‌ ‌చేస్తున్నారు.

Leave a Reply