కార్మిక చట్టాల రద్దు ఉపసంహరించుకొవాలని తహశీల్దార్ కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉప అధ్యక్షుడు కల్లూరి మల్లేశం మాట్లాడుతూ కార్మికుల చట్టాల రద్దును ఉపసంహరించుకొవాలని, పని గంటలను 8నుండి 12 గంటలు పెంచె అలోచన విరమించుకొవాలని డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కార్మికులకు వెల్ఫెర్ బోర్డు ద్వారా నెలకు రూ: 5వేలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జాతీయ కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు తహశీల్దార్ కార్యాలయం ముందు ప్లే కార్డ్ పట్టుకొని ధర్నా నిర్వహించం జరిగిందని తెలిపారు. దేశ రక్షణ రంగంలో 74 విదేశీ పెట్టుబడులకు మోడి ప్రభుత్వం అవకాశం కల్పిస్తూ దేశ ఆత్మగౌరవాన్ని కార్పోరేట్ ల ముందు తాకట్టు పెడుతున్నారని విమర్శించారు. కార్మికచట్టాలను సవరిస్తూ కొన్నింటిని రద్దు చెస్తూ కార్మికుల హక్కులను కాలరాస్తున్నాడని ఆయన విమర్శించారు. అనంతరం తహశీల్దార్ యండి సలిమోద్దీన్ వినతి పత్రాన్ని అందజేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో సిఐటియు మండల కన్వీనర్ పొతరాజు జహంగీర్, కొక్కొండ లింగయ్య, గడ్డమిది నర్సింహ్మ, తూటి వెంకటేశం, మల్లయ్య, జి.భలరాం, సాయి తదితరులు పాల్గొన్నారు.