Take a fresh look at your lifestyle.

వారసత్వ గుర్తింపును… వ్యతిరేకించిన పలు దేశాల మేథావులే సహకరించారు

ప్రపంచస్థాయి గుర్తింపు రావడం ప్రజల అదృష్టం
రామప్పను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాం…
ప్రాచీన కట్టడాలను కాపాడుకుందాం
కేంద్ర మంత్రి జి కిషన్‌ ‌రెడ్డి

రామప్పకు ప్రపంచ వారసత్వపు గుర్తింపును వ్యతిరేకించిన పలు దేశాల మేథావులే ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయాల మేరకు సహకరించడంతో యునెస్కో గుర్తింపు లభించిందని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య ప్రాంతాల అభివృద్ధి శాఖ మంత్రి గంగారపు కిషన్‌ ‌రెడ్డి అన్నారు. రాష్ట్ర మంత్రి శ్రీనివాస్‌ ‌గౌడ్‌, ఎమ్మేల్యే సీతక్క, కలెక్టర్‌ ఎస్‌.‌కృష్ణ అదిత్యతో కలిసి గురువారం 11 గంటలకు ఆయన రామప్పకు చేరుకున్నారు. వారికి ఆలయ పూజారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించగా ఆలయ ప్రాంగణం మొత్తం తిరిగిన మంత్రి ఆలయ శిల్ప సౌందర్యాన్ని చూసి మంత్ర ముగ్దులయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..800 సంవత్సరాల చరిత్ర కలిగిన అతిప్రాచీన కట్టడమైన రుద్రేశ్వర దేవాలయంకు యునెస్కో గుర్తింపు లభించడం తెలుగు ప్రజల అదృష్టమని, ప్రపంచ వారసత్వ గుర్తింపు కోసం మొదటి సారి ప్రపంచ దేశాల ముందు ఉంచగా కొన్ని కారణాలను చూపుతూ గుర్తింపు రాకుండా ప్రయత్నించారని, అదే సమయంలో తాను మంత్రి పదవి తీసుకోగా ఎలాగైనా గుర్తింపు పొందే విధంగా చర్యలు తీసుకోవడంలో బాగంగా ప్రధాని మోడీ, ప్రహ్లద్‌ ‌పటేల్‌లతో చర్చించడం జరిగిందన్నారు.

 

వారం రోజుల అనంతరం రెండవ సారి ప్రపంచ మేథావుల దృష్టికి తీసుకపోగా 17 దేశాలకు చెందిన మేథావులు వారసత్వపు సంపదగా గుర్తించుటకు అంగీకరించడంతో ప్రపంచ చిత్ర పటంలో రామప్పకు చోటు దక్కిందన్నారు. అనేక మంది మేథావుల కృషి పలితంగా గుర్తింపు రావడం హర్షించదగ్గ విషయమని అన్నారు. ఇదే సమయంలో కొరోనా మహమ్మారీ పట్టి పీడిస్తున్న సమయంలో ఇతర దేశాలకు సంబంధించిన పర్యాటకులు ఇక్కడికి రావడం తగ్గిపోయిందని, అయితే నేడు కొరోనా కట్టడి చేయడంలో విజయం సాధించిన దేశం పర్యాటకులను అకట్టుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. రామప్పతో పాటు కాకతీయుల నాటి కట్టడాలైన వెయ్యి స్థంబాల గుడి, వరంగల్‌ ‌ఫోర్టులతో పాటు ఇతర ప్రాంతాలలో ఉన్న ప్రాచీన కట్టడాలను వెలుగులోకి తెచ్చి పర్యాటకులను అకట్టుకునే విధంగా చొరవ చూపుతున్నామన్నారు.

ప్రాచీన కట్టడాలు కనుమరుగు కాకుండా నేటి తరం..భావితరం వారు చూసే విధంగా తీర్చిదిద్దుతున్నామని అన్నారు. కొరోనా మహమ్మారీ కట్టడి చేయడానికి ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీ వైద్య బృందాలతో పలు దఫాలుగా చర్చలు జరిపి మన దేశంలోనే టీకా తయారు అయ్యే విధంగా చర్యలు తీసుకుని నేడు దేశంలో వంద కోట్ల డోసులు పంపిణీ పూర్తి చేసుకోవడంతో పాటు ప్రపంచ దేశాలకు సైతం ఎగుమతి చేసే స్థాయికి ఎదిగామని ఆయన హర్షం వ్యక్తం చేశారు. రానున్న రోజులలో 12 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల వయస్సు గల వారికి టీకా అందజేయడం జరుగుతుందని వివరించారు. జిల్లాలోని రామప్ప, లక్నవరం, మేడారం, బోగత జలపాతం, క్ష్మినర్సింహస్వామి తదితర ప్రాంతాల అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ప్రపంచ దేశాల నుండి పర్యాటకులు రావడానికి త్వరలోనే వరంగల్‌లో విమానాశ్రమం ప్రారంభం కాబోతున్నదని అన్నారు. రాష్ట్ర మంత్రి శ్రీనివాస్‌ ‌గౌడ్‌ ‌మాట్లాడుతూ..రామప్పకు యునెస్కో గుర్తింపు రావడానికి సిఎం కేసిఆర్‌ ‌ప్రత్యేక చర్యలు తీసుకున్నారని, రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాల అభివృద్ది కోసం 2016 సంవత్సరంలోనే కాకతీయ హెరిటేజ్‌ ఏర్పాటు చేశారని అన్నారు.

రాష్ట్రంలోని చారిత్రక కట్టడాలు అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో సిఎం కేసిఆర్‌ ‌ప్రపంచమే అబ్బుర పరిచే విధంగా 16 వందల కోట్ల రూపాయలతో యాదాద్రి ఆలయాన్ని నిర్మించారని, రానున్న రోజులలో కాళేశ్వరం ప్రాజెక్టును టూరిజం స్పాట్‌గా ఏర్పాటు చేస్తామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యాక్రమాలకు కేంద్ర ప్రభుత్వం సహకరించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. హిందూ ధర్మాన్ని కాపాడటమే కాకుండా సిఎం కేసిఆర్‌ అనేక యాగాలు చేసిన ఫలితంగానే రాష్ట్రంలో పుష్కలంగా వర్షాలు కురుస్తున్నాయని, పంటలు నిండుగా పండుతున్నాయని అన్నారు. ఎమ్మేల్యే సీతక్క మాట్లాడుతూ..నియోజకవర్గంలోని రామప్పకు వారసత్వపు గుర్తింపు రావడం హర్షించదగ్గ విషయమే అయినప్పటికి ఇతర పర్యాటక ప్రాంతాలను సైతం అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా 67 శాతం అటవి ప్రాంతంతో కూడుకున్న ములుగు జిల్లాలో వివిధ పర్యాటక ప్రాంతాలను పర్యటించడానికి బస్సు సౌకర్యం లేక పర్యాటకులు ఇబ్బందులకు గురౌతున్నారని, జిల్లా కేంద్రంలో బస్‌ ‌డిపో ఏర్పాటు చేయ్యాలని మంత్రులను కోరారు. ప్రత్యేకంగా ఐఏఎస్‌ అఫీసర్‌తో కూడిన కమిటి ఏర్పాటు చేసి అర్కెటిక్‌ ‌కళాశాల, గిరిజన యూనివర్సీటీ తరగతుల ప్రారంభం, మేడారం జాతరకు జాతీయ హోదా కల్పించాలని ఆమే కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక శాఖ చైర్మెన్‌ శ్రీ‌నివాస్‌ ‌గుప్తా, ఎస్‌పి డాక్టర్‌ ‌సంగ్రామ్‌ ‌సింగ్‌ ‌జి పాటిల్‌, ‌డాక్టర్‌ ‌పాండు రంగా రావు, పర్యాటక శాఖ ఎండి మనోహర్‌, ‌విద్యావతి, మాజీ ఎమ్మేల్యే ధర్మారావు, వెంకటాపూర్‌ ఎం‌పిపి బుర్ర రజిత సమ్మయ్య, జడ్పీటిసి గై రుద్రమదేవి అశోక్‌, ‌సర్పంచ్‌ ‌డోలి రజిత శ్రీనివాస్‌, ‌వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply