Take a fresh look at your lifestyle.

నెహ్రూపై మోడీ అక్కసుకు కారణం ఆర్‌ఎస్‌ఎస్‌ ‌నేపథ్యమే

“ప్రధాని మోడీ,కేంద్ర హోం మంత్రి అమిత్‌ ‌షాలకు ఆంగ్ల భాషపై పట్టు లేదు. మోడీకి ఇప్పుడంటే అంతర్జాతీయ వ్యవహారాలపై  అవగాహన పెంచుకున్నారు కానీ, అప్పట్లో అది లేదు. నెహ్రూ అంతర్జాతీయంగా పేరొందిన నాయకుడు . కాశ్మీర్‌ ‌నుంచి చైనా వరకూ ఏ అంశంపై ప్రసంగించినా మోడీ  నెహ్రూను  తప్పు పడుతుంటారు.  ఆర్‌ ఎస్‌ ఎస్‌ ‌భావజాలంతో పెరిగిన మోడీ,షాలకు  నెహ్రూ  తొలి ప్రధాని కావడం ఇష్టం లేదు.”

The reason behind Modi's interest in Nehru is the RSS background
The reason behind Modi’s interest in Nehru is the RSS background

గాంధీ కుటుంబాన్నీ, కాంగ్రెస్‌ను బద్నామ్‌ ‌చేయడానికి ప్రధానమంత్రి నరేంద్రమోడీ తరచూ నెహ్రూని దుమ్మెత్తి పోస్తున్నారు. మోడీ ప్రతి సందర్భంలోనూ తొలి ప్రధాని నెహ్రూపై విమర్శలు కురిపిస్తున్నారు. నెహ్రూ అనుసరించిన విదేశాంగ,ఆర్థిక విధానాల వల్లే దేశం ఇన్ని కష్టాలను ఎదుర్కొంటోందనేది మోడీ నిశ్చితాభిప్రాయం. మోడీకి నెహ్రూ ఫోబియా పట్టుకుందా అని పించే రీతిలో ఆయన ప్రసంగాలు ఉంటున్నాయి. ఇటీవల పార్లమెంటులో ఆయన చేసిన ప్రసంగాన్ని తీసుకుంటే, రాష్ట్రపతి ప్రసంగానికి ధన్య వాదాలు తెలిపే తీర్మానం పై జరిగిన చర్చకు సమాధానమిస్తూ మోడీ వంద నిమిషాలు పైగా ప్రసంగించారు. ఈ వ్యవధిలో ఆయన కనీసం 24 సార్లు నెహ్రూ గురించి ప్రస్తావించి ఉంటారు. ఇక నెహ్రూ మునిమనవడు రాహుల్‌ ‌గాంధీని మోడీ అసలు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా మోడీ మాజీ ఆర్మీ చీఫ్‌ ‌తిమ్మయ్య పేరును కూడా ప్రస్తావించారు. ఆర్మీజనరల్‌ ‌గా తిమ్మయ్య 1957 నుంచి 61 వరకూ పని చేశారు.తిమ్మయ్య కర్నాటకలోని కొడవ (కూర్గ్ ) ‌ప్రాంతానికి చెందిన వారు. అప్పట్లో తొలి ప్రధాని నెహ్రూ ఆర్మీజనరల్‌ ‌తిమ్మయ్యను అవమానపరిచారంటూ కర్ణాటకలో బీజేపీ తరఫున ప్రచార సభల్లో మోడీ ప్రస్తావించారు. ఇది అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది.అది కూడా ఎన్నికల ప్రచారంలో. అప్పట్లో నెహ్రూ తీసుకున్న నిర్ణ యాలను తప్పు పట్టే ఉద్దేశ్యంతోనే ఆ ప్రస్తావనలు చేశారు.

మోడీ, ఆయన ప్రధాన అనుచరుడు, కేంద్ర హోం మంత్రి అమిత్‌ ‌షాలకు ఆంగ్ల భాషపై పట్టు లేదు. మోడీకి ఇప్పుడంటే అంతర్జాతీయ వ్యవహారాలపై అవగాహన పెంచుకున్నారు కానీ, అప్పట్లో అది లేదు. నెహ్రూ అంతర్జాతీయంగా పేరొందిన నాయకుడు . కాశ్మీర్‌ ‌నుంచి చైనా వరకూ ఏ అంశంపై ప్రసంగించినా మోడీ నెహ్రూను తప్పు పడుతుంటారు. ఆర్‌ ఎస్‌ ఎస్‌ ‌భావజాలంలో పెరిగిన వీరికి నెహ్రూ తొలి ప్రధాని కావడం ఇష్టం లేదు. ఆర్‌ ఎస్‌ ఎస్‌ ‌నాయకులు నెహ్రూ కాకుండా తొలి ప్రధానిగా వల్లభాయ్‌ ‌పటేల్‌ అయి ఉంటే భారత్‌ ఎం‌తో అభివృద్ధి సాధించి ఉండేదని తరచూ అంటూంటారు. మాజీ ప్రధాని వాజ్‌పేయి, మాజీ ఉప ప్రధాని అద్వానీ కూడా ఈ భావజాలంతోనే పెరిగినా నెహ్రూ ఇంత తీవ్రంగా ఎప్పుడూ విమర్శించలేదు. నెహ్రూ మాదిరిగా పాశ్చాత్య నాగరికత గురించి వీరికి పెద్దగా ఆసక్తి లేదు. నెహ్రూ మొదటి కేబినెట్‌లో వల్లభ్‌భాయ్‌ ‌పటేల్‌ ‌ని చేర్చలేదని విపి మీనన్‌ ‌మనవలు పేర్కొన్నారు. వీపీ మీనన్‌ ‌చివరి ముగ్గురు వైస్రాయ్‌ ‌ల కాలంలో రాజ్యాంగ సలహాదారుగా పని చేశారు. వీపీ మీనన్‌, ‌మౌంట్‌ ‌బాటన్‌లు చెప్పిన మీదట పటేల్‌ ‌పేరును కేబినెట్‌ ‌జాబితాలో చేర్చారట. నెహ్రూ మీద చాలా పుస్తకాలు వచ్చాయి. ఎంజె అక్బర్‌, ‌తాజాగా జైరామ్‌ ‌రమేష్‌ ‌లు నెహ్రూలోని మరో పార్శ్వాన్ని తెలిపే ప్రయత్నం చేశారు. నెహ్రూతో పోలిస్తే ఇందిరాగాంధీని విమర్శిం చలేదనే చెప్పాలి., ఆమె తీసుకున్న కొన్ని కఠిన నిర్ణయాలను మెచ్చుకున్నారు. రాజీవ్‌ ‌గాంధీని అసలు పట్టించుకోలేదు. రాహుల్‌ ‌పేరును ప్రస్తావించడానికి కూడా ఇష్టపడకుండా ఆయనపై పరోక్షంగా విమర్శలు గుప్పిస్తున్నారు. లాల్‌ ‌బహదూర్‌ ‌శాస్త్రిని పొగుడుతారు. లాల్‌ ‌బహదూర్‌ ‌శాస్త్రి, వల్లభ్‌భాయ్‌ ‌పటేల్‌ ‌తాము కాంగ్రెస్‌ ‌వాదులమేనని స్పష్టం చేసినప్పటికీ వారిని ఆర్‌ ఎస్‌ ఎస్‌ ‌భావజాలానికి దగ్గరగా ఉన్న మనుషులుగా మోడీ భావిస్తూ ఉంటారు. నెహ్రూ విమర్శకుల్లో రామమనోహర్‌ ‌లోహియాని ఎక్కువ మెచ్చుకుంటారు . ప్రస్తుత కాంగ్రెస్‌ ‌నాయకుల్లో మన్మోహన్‌ ‌సింగ్‌ ‌ని గులామ్‌ ‌నబీ ఆజాద్‌ ‌శశిథరూర్‌ ‌లను కూడా మెచ్చుకుంటారు. ఆర్‌ ఎస్‌ ఎస్‌ ‌భావజాలాన్ని బాగా వంటబట్టించుకోవడం వల్లనే మోడీ , అమిత్‌ ‌షాలు నెహ్రూని సమయం వచ్చినప్పుడల్లా విమర్శిస్తున్నారు.

– ‌శేఖర్‌గుప్తా

Leave a Reply

error: Content is protected !!