- అందరికీ ఆహారంతో పాటు ఆర్థిక ఎదుగుదల ముఖ్యం
- వ్యవసాయ విశ్వవిద్యాలయ ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ
వ్యవసాయంలో స్వావలంబన అంటే ఎవరికివారు తమకు సరిపడా ఆహారాన్ని పండించడం మాత్రమే కాదనీ… గ్రామమంతా ఆర్థికంగా ఎదగడమే నిజమైన స్వావలంబన అని ప్రధాని నరేంద్రమోదీ అభివర్ణించారు. పాఠశాల స్థాయిల నుంచే వ్యవసాయ విద్య, దానికి సంబంధించిన ప్రత్యక్ష అనుభవం అందించాల్సిన అవసరం ఉందనీ.. దీనికి సంబంధించి గ్రాణ స్థాయిలో ఓ సబ్జెక్టును ప్రవేశపెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన
పేర్కొన్నారు.ఉత్తర ప్రదేశ్లోని ఝాన్సీ నగరంలో నిర్మించిన రాణి లక్ష్మీభాయి కేంద్రీయ వ్యవసాయ విశ్వవిద్యాలయం నూతన భవనాలను ప్రధాని మోదీ ప్రారంభించారు.
వ్యవసాయంలో పరిశోధనలతో పాటు రైతులకు తోడ్పాటు అందించేలా మౌలిక విద్యా సదుపాయాలు కల్పిస్తామని ఈ సందర్భంగా ఆయన హా ఇచ్చారు. వర్చువల్గా జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధానితో పాటు కేంద్ర వ్యవసాయం మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ పలువురు విద్యార్థులతో ముచ్చటించారు. ‘డ్రోన్ టెక్నాలజీ కావచ్చు… ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ టెక్నాలజీ కావచ్చు… అధునిక వ్యవసాయ సాధనాలు, లాంటి యువ శాస్త్రవేత్తలు, పరిశోధకులు దేశంలోని వ్యవసాయ రంగం కోసం మరింత ఉపయోగపడేలా పనిచేస్తూనే ఉండాలి…’ అని ప్రధాని పిలుపునిచ్చారు. ఆరేళ్ల క్రితం కేవలం ఒకేఒక కేంద్రీయ వ్యవసాయ యూనివర్సిటీ ఉండేదనీ.. కానీ ఇప్పుడు మూడు యూనివర్సిటీలు వచ్చాయని ఆయన గుర్తుచేశారు.