Take a fresh look at your lifestyle.

‌ప్రజల ప్రత్యక్షదేవుడు

తెల్లని కోటు దరించేవాడు
మెడలో ‘‘స్టెతస్కోపు’’ వేసినవాడు
నాడిని పట్టి జబ్బును చెప్పేవాడు
గుండె చప్పుడు తెలుసుకొనువాడు
ప్రజల ఆరోగ్యం పట్ల శ్రద్ధ కలవాడు
ప్రజల ప్రాణాలను కాపాడే అతడు
అతడే అతడే ప్రజా వైద్యుడు
ప్రజల పాలిటి ప్రత్యక్ష దేవుడు …!!

సరియగు మందులు రాసేస్తాడు
ముందు జాగ్రత్తలు చెప్పేస్తాడు
రోగిలో ధైర్యం నింపేస్తాడు
సలహాలు ఎన్నో చెప్పేస్తాడు
సగరోగం అప్పుడే నయం చేసేస్తాడు
రోగాలను దూరంగా తరిమేస్తాడు
అతడే అతడే ప్రజా వైద్యుడు
ప్రజల పాలిటి ప్రత్యక్ష దేవుడు …!!

ప్రసూతి వైద్యం అందించి
పసివాళ్ళను పుడమిన రప్పించి
పసివాళ్ళ బాధలను పరీక్షించి
వారి పరిస్థితికి తగిన మందులిచ్చి
కుటుంబీకులకు తగు సలహాలిచ్చి
పసివాళ్ళ ప్రాణాలకు భరోసానిచ్చి
కాపాడే ధీరుడు ప్రజా వైద్యుడు
ప్రజల పాలిటి ప్రత్యక్ష దేవుడు…!!

మూలిక వైద్యం చేయునితడు
గూళిక వైద్యం చేయునితడు
పసరు వైద్యం చేయునితడు
అల్లోపతి వైద్యం చేయునితడు
మాత్రల వైద్యం చేయునితడు
అతడే అతడే ప్రజా వైద్యుడు
ప్రజల పాలిటి ప్రత్యక్ష దేవుడు…!!

చెడిన అవయవాలు తొలిగించి
కొత్త అవయవాలను అక్కడ అమర్చి
విరిగిన ఎముకలను సరిచేసి
అవసరమైతే శస్త్రచికిత్స చేసి
అవాంతరాలను దూరం చేసి
ప్రజల ఆపదలను తొలగింపచేసి
పరిశుభ్రతను వివరించేవాడు
ఆరోగ్య నియమాలు చెప్పేవాడు
అతడే అతడే ప్రజా వైద్యుడు
ప్రజల పాలిటి ప్రత్యక్ష దేవుడు…!!

మందులు తయారు చేసే వాడు
మందు చీటీలు మంచిగా రాసేవాడు
సూదులు సరిగా ఇచ్చే వాడు
ద్రవరూప శక్తిని నింపేవాడు
శస్త్ర జ్ఞానం మెండుగా పొందిన వాడు
శస్త్రచికిత్సలు యుక్తితో చేసేవాడు
అతడే అతడే ప్రజా వైద్యుడు
ప్రజల పాలిటి ప్రత్యక్ష దేవుడు…!!

రక్త పరీక్షలు చేసే వైద్యుడు
రకరకాల పరీక్షలు చేసే వైద్యుడు
వ్యాధిని నిర్ధారించే వైద్యుడు
నియమాలెన్నో వివరించే వైద్యుడు
వ్యాధుల పాలిటి భక్షకుడు ఇతడు
ప్రజల పాలిటి ప్రాణ రక్షకుడు ఇతడు
అతడే అతడే ప్రజా వైద్యుడు
ప్రజల పాలిటి ప్రత్యక్ష దేవుడు…!!

– తారాసింగ్‌

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!