Take a fresh look at your lifestyle.

రాజపుత్రులు మహారాణా ప్రతాప్‌ను ఆదర్శంగా తీసుకోవాలి.

తాండూరు : రాజపుత్రుల ఆరాధ్య వీరుడు మహారాణ ప్రతాప్‌ 480‌వ జయంతి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. తాండూర్‌  ‌రాజ్‌ ‌పుత్‌ ‌సమాజం అధ్యక్షులు ఠాకూర్‌ ‌రమేష్‌ ‌సింగ్‌ ఆధ్వర్యంలో మహారాణ ప్రతాప్‌ ‌చిత్రపటానికి పూల మాలలు వేసి జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన 20వ వార్డు బీజేపీ కౌన్సిలర్‌ ‌సంగీత ఠాకూర్‌  ‌మహారాణా ప్రతాప్‌ ‌జయంతి సందర్భంగా రాజపుత్రులు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. జయంతి సందర్భంగా నిరుపేదలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ  రాజస్థాన్‌ ‌లోని కుంబల్ఘర్‌ ‌ప్రాంతంలో మే 9, 1540 లో జన్మించారని మేవాడు మహారాజుగా తన రాజ్య ప్రజల సుఖ శాంతి ప్రయోజనాలను కోరుకుని మాతృభూమి కోసం పోరాడిన మహావీరుడు అని అన్నారు. 49 వేలమంది అక్బర్‌ ‌సైన్యంతో కేవలం ఎనిమిది వేలమంది  రాజపుత్రుల తో మొగుళులను ఎదిరించి పోరాడిన ధీరుడు మహారాణా ప్రతాప్‌ అన్నారు.

ప్రాణాలు పోయినా ఇచ్చిన మాటను నిలబెట్టుకునే తత్వం రాజపుత్రులదని అన్నారు. అనంతరం రాజ్‌ ‌పుత్‌ ‌సంఘం అధ్యక్షులు ఠాకూర్‌ ‌రమేష్‌ ‌సింగ్‌ ‌మాట్లాడుతూ మహారాణ ప్రతాప్‌ ‌గొప్ప  వీరుడని ఢిల్లీ రాజు అక్బర్‌ ‌మహారాణా ప్రతాప్‌ ‌ని ఒక్కసారి తలదించి నా కాళ్ళ మీద పడితే సగం హిందుస్థాన్‌ ‌కి రాజును చేస్తాం అని ప్రలోభ పెట్టినా దానిని తుచ్ఛమైన దిగా  తిరస్కరించిన మహావీరుడు మహారాణ ప్రతాప్‌ అన్నారు. రాజపుత్రులు మహారాణ ప్రతాప్‌ను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. ప్రతి ఇంట్లో మహారాణ ప్రతాప్‌ ‌చిత్రపటాన్ని పెట్టుకొని పూజించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కొల్లాపూర్‌ ‌సమాజం సభ్యులు ఠాకూర్‌ ‌సుభాష్‌ ‌సింగ్‌ ‌ఠాకూర్‌, ‌సత్యనారాయణ సింగ్‌ ‌ఠాకూర్‌, ‌రాజు సింగ్‌, ‌జగన్‌ ‌సింగ్‌ ‌ఠాకూర్‌, అజయ్‌ ‌సింగ్‌ ‌ఠాకూర్‌, ‌రఘువీర్‌ ‌సింగ్‌ ‌ఠాకూర్‌,‌దిలీప్‌ ‌సింగ్‌ ‌ఠాకూర్‌, ‌నర్సింగ్‌ ‌సింగ్‌ ‌ఠాకూర్‌, ‌దీపక్‌ ‌సింగ్‌ ‌ఠాకూర్‌,‌రవి సింగ్‌ ‌సంతోష్‌ ‌సింగ్‌ ,‌బాలాజీ సింగ్‌, ‌శివాజీ సింగ్‌, ‌మురళి సింగ్‌, ‌గులాబ్‌ ‌సింగ్‌ ‌తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply