సర్కారును ప్రశ్నించే గొంతు
ఈ సారి ఎవరిదో ఆ వంతు
‘ప్రశ్న’ పట్టభద్రుల విధానం
విపక్షాల అభ్యర్థుకు అదే నినాదం
గొంతుల మధ్య లేనేలేదు ఐక్యత
పోటీతో కొరవడింది కదా సఖ్యత
తానే ప్రశ్నించే వాన్నంటూ చీలిక
వోటు లాభం పొందుతున్న ఏలిక
ఎవరైనా సరే పోటీకి నిలువొచ్చు
అది ప్రజాస్వామిక హక్కు కావొచ్చు
కాలాన్ని బట్టి ‘గుమి’ కూడక పోతిరి
గెలుపు బాటలో ‘కాట’ కల్సిపోతిరి
కత్తెర శాల కుమార స్వామి
సీనియర్ జర్నలిస్ట్