Take a fresh look at your lifestyle.

కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లర్లకు పంపాలి

కొనుగోలు కేంద్రాల్లో కొన్న ధాన్యాన్ని వెంట వెంటనే మిల్లర్లకు చేరేలా చూడాలని త్వరితగతిన అన్‌లోడ్‌ అయ్యేలా చర్యలు తీసుకోవాలని జగిత్యాల జిల్లా కలెక్టర్‌ ‌జి.రవి సంబందిత అధికారులను అదేశించారు. బుధవారం కలెక్టరేటు క్యాంపు కార్యాలయంలో కొనుగోలు చేసిన ధాన్యం మిల్లర్లకు ట్రాన్స్‌పోర్ట్ ఆం‌శంపై జిల్లాలోని అధికారులతో టెలికాన్ఫరెన్స్ ‌నిర్వహించారు. ఈసందర్బంగా కలెక్టర్‌ ‌మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యం క్వాలిటిని చెక్‌చేసి వెంటనే కొనుగోలు చేసేలా చూడాలన్నారు. ఎవరికి కేటాయించిన ధాన్యాన్ని అయా మిల్లులకు సరఫరా చేసేలా చర్యలతోపాటు మిల్లర్లు వెంట వెంటనే దింపుకునేలా ఏర్పాట్లను చూడాలని డిఆర్‌డిఏ పిడి, డిసివోలకు కలెక్టర్‌ ‌సూచించారు. వ్యవసాయ అధికారులు తమకు కేటాయించిన కొనుగోలు కేంద్రాల్లో అందుబాటులో ఉంటూ ఎప్పటికప్పుడు క్వాలిటిని చెక్‌ ‌చేస్తు విధులలో నిబద్దతతో పనిచేయాలన్నారు. ఎవరైనా అలసత్వం ప్రధర్శిస్తే వారిపై శాఖాపరమైన చర్యలుంటాయని కలెక్టర్‌ ‌హెచ్చరించారు.

కొనుగోలు కేంద్రాల నుంచి దాన్యం రవాణాకు ఎలాంటి ట్రాన్స్‌పోర్టు అవరోదాలు ఉండకుండా అధికారులు చర్యలు ఉండాలని, ప్రతి రోజు ఎంత ధాన్యం కొనుగోలు చేశామనే ఆంశంతోపాటు ఎంత ధాన్యాన్ని మిల్లర్లకు ట్రాన్స్‌పోర్టు చేశామన్న రికార్డులలో నమోదు చేయాలన్నారు. అనంతరం జిల్లా అడిషనల్‌ ‌కలెక్టర్‌ ‌బి.రాజేశం మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగుతోందని ఇంకా త్వరితగతిన కొనుగోలు చేసేలా చర్యలుంటాయాన్నారు. గతంలో దాన్యం రవాణాకు ట్రాన్స్‌పోర్టు వాహానాల సమస్య వచ్చిందని అయా కాంట్రాక్టర్లకు నోటిసులిచ్చినట్లు రాజేశం అన్నా రు. లోడింగ్‌ ‌సమయంలో హమాలీల కొరతతో కొంత లోడింగ్‌ ‌సమస్య ఉత్పన్నమైందని తిరిగి స్థానికుల సహాకారంతో లోడింగ్‌ ‌సమస్యను అధిగమిం చామన్నారు. మిల్లర్లు కొనుగోలు చేసిన ధాన్యం నిల్వ చేసుకోవడానికి మిల్లులలో స్థలం కొరత ఉంటే వారు చూపించిన స్థలంలో నిల్వ చేసుకోవడా నికి ప్రభుత్వం ఆనుమతి ఇస్తుందని అడిషనల్‌ ‌కలెక్టర్‌ ‌రాజేశం తెలిపారు. ఈ టిలికాన్ఫరెన్స్‌లో డిఆర్‌డిఏ పిడి లక్ష్మినారాయణ, డిసివో రామానుజం, డిఎం సివిల్‌సప్లై రజనీకాంత్‌, ‌డిఎస్‌ఓ ‌చందన్‌కుమార్‌తోపాటు జిల్లాలోని తహాశీల్దార్లు, సంబందిత అధికారులు ఉన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!