Take a fresh look at your lifestyle.

మానవ హక్కుల పరిరక్షణ మనందరి బాధ్యత రాచకొండ సీ పీ మహేష్ భగవత్

భూమిక ‘ఉమెన్స్ కలెక్టివ్’ తో కలిసి అంతర్జాతీయ మానవ హక్కుల దినం నిర్వహించిన రాచకొండ పోలీస్

నాగోల్ : “అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం” సందర్భంగా మహిళలపై హింసను అంతం చేయడానికి 16 రోజుల క్రియాశీల కార్యక్రమం ముగింపు (25 నవంబర్ నుండి డిసెంబర్ 10 వరకు) సమావేశం గురువారం హోటల్ అక్షర గ్రాండ్ లో నిర్వహించారు. ఈ సందర్బంగా రాచకొండ సిపి మహేష్ భగవత్ మహిళల హక్కుల గురించి, ఈవ్ టీజింగ్, స్టాకింగ్, వోయురిజంపై వివరించారు. మానవ హక్కుల పరిరక్షణ మనందరి బాధ్యత అని, మానవ అక్రమ రవాణా అనేది ఒక వ్యాపారంగ మారిందని, మానవ అక్రమ రవాణాను అరికట్టె వివిధముగా చర్యలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు. మానవ అక్రమ రవాణాకు గురైన వారి యొక్క సమాచారాన్ని తెలుసుకొని వారిని కాపాడవలసిన బాధ్యత మనందరిది అని అన్నారు. మహిళల పట్ల జరుగుతున్న గృహ హింసను అరికట్టాలని ఆయన అన్నారు. మైనర్ల పట్ల మానవ హక్కుల అతిక్రమణలు జరుగుతున్న నేపథ్యంలో మానవ హక్కులను కాపాడవలసిన ప్రధమ బాధ్యత పోలీస్ అధికారులపై ఉన్నదని అన్నారు.

ప్రమాదకరమైన కర్మాగారాలలో పనిచేసే 14 సంవత్సరాల బాల, బాలికల రక్షణ కల్పించాలని, బాల్య వివాహాలను అరికట్టాలని, మానవ అక్రమ రవాణా లు జరగకుండా పోలీసు అధికారులు గట్టి నిఘా ఉంచాలని, మానవ హక్కుల పరిరక్షణ కొరకు ప్రతి పోలీస్ అధికారి తన ప్రథమ కర్తవ్యంగా భావించాలి ఆయన అన్నారు. 9490617111 ఫోన్ నంబర్ ద్వారా షీ టీం కు ఫిర్యాదు చేయవచ్చన్నారు. అత్యవసర పరిస్థితుల్లో పోలీసులను సంప్రదించాలని, వాట్సాప్ మెసేజ్, ఫోటో మొదలైన వాటి ద్వారా సమాచారాన్ని పోలీసులతో పంచుకోవాలని ఆయన అభ్యర్థించారు. కోర్టు చర్యల అనంతరం నిందితులకు షీ టీమ్స్, భూమికా కౌన్సెలర్లు కౌన్సెలింగ్ ఇస్తారని తెలిపారు. సత్యవతి ‘విమెన్స్ కలెక్టివ్ తరఫున పోలీసు సిబ్బందికి gender sensitization…(లింగ సున్నితత్వం)పై శిక్షణ ఇస్తారని ఆయన వివరించారు.

Rachakonda CP Mahesh Bhagwat is responsible for the protection of human rights

నేరస్థులు, నిందితులకు కౌన్సెలింగ్ అందించడంలో పోలీసులు భూమికా సహాయం తీసుకుంటున్నారు. అధికార పరిధితో సంబంధం లేకుండా పోలీసులు మహిళలను కాపాడాలనే తపనతో కేసులు నమోదు చేస్తారని ఆయన అన్నారు. నిర్భయ చట్టం, కార్యాలయంలో లైంగిక వేధింపుల నివారణలపైనా ఆయన వివరించారు. మహిళల గౌరవాన్ని కించపరిచే గీతాలను/ పాటలను ప్రోత్సహించవద్దని పాల్గొన్న వారందరినీ ఆయన అభ్యర్థించారు. బాలికలలో విశ్వాసం, ధైర్యాన్ని పెంపొందించాలని పాల్గొన్నవారందరికీ ఆయన సూచించారు.రంగారెడ్డి జిల్లాకు చెందిన జిల్లా న్యాయ సేవల అథారిటీ సభ్యుడు కార్యదర్శి ఉదయ్ కుమార్ అందుబాటులో ఉన్న న్యాయ సేవలపై పాల్గొనేవారికి అవగాహన కల్పించారు. మహిళల రక్షణకు పలు అంశాలపై భూమిక కలెక్టివ్ చేస్తున్న ప్రయత్నాలను కూడా ఆయన అభినందించారు. మహిళలపై హింసను నివారించడానికి జెండర్ సెన్సిటివ్ అంశాలపై పనిచేస్తున్న రాచకొండలోని 10 మంది బస్తీలకు చెందిన సిబిఓ నాయకులు మరియు భూమికా మిత్రాస్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Leave a Reply