Take a fresh look at your lifestyle.

కేంద్రం గెజిట్‌ ‌నోటిఫికేషన్‌తో లాభమే

ఏపీ జలవనరుల శాఖ ఈఎన్‌సీ
అమరావతి,జూలై16 : కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిని ఖరారు చేస్తూ కేంద్రం విడుదల చేసిన గెజిట్‌ ‌నోటిఫికేషన్‌ను ఎపి జలవనరుల శాఖ స్వాగతించింది. ఇది ఆంధ్రప్రదేశ్‌ ‌హక్కులను కాపాడుతుందని ఏపీ జలవనరుల శాఖ ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి అన్నారు. అయితే నోటిఫికేషన్‌లో కొన్ని తప్పిదాలున్నాయని.. వాటిని సరిచేయమని కేంద్రాన్ని కోరతామన్నారు. కేఆర్‌ఎం‌బీ కార్యాలయాన్ని ఏపీలోనే ఏర్పాటు చేయాలని విభజన చట్టంలో ఉందని నారాయణరెడ్డి గుర్తు చేశారు. ఏపీలోని కొన్ని ప్రాజెక్ట్‌లను బోర్డు పరిధిలోకి తీసుకురావడం అనవసరం అని నారాయణ రెడ్డి అన్నారు. ప్రాజెక్ట్‌ల నుంచి నీటిని విడుదల చేశాక.. ఎలా వినియోగించు కోవాలనేది దిగువ రాష్ట్రంగా ఏపీకున్న హక్కన్నారు.

దిగువనున్న ఏపీలో ప్రాజెక్ట్‌లు, కాల్వలు బోర్డు పర్యవేక్షణలో ఉంటే పంటలు దెబ్బతింటాయని తెలిపారు. రాయలసీమ ఎత్తిపోతల అంశం చాలా సున్నితమైనదని.. దాన్ని నోటిఫై చేస్తే ఒక లాభం.. చేయకుంటే మరో లాభం అన్నారు. అయితే ఇకనుంచి పరిధి మేరకు నీటి వాటాలు వాడుకునే అవకాశం ఏర్పడిందన్నారు. గతంలో లాగా ఎగువన ఉన్న తెలంగాణ ఇకనుంచి ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరించడానికి లేదన్నారు.

Leave a Reply