Take a fresh look at your lifestyle.

భావి తరాల నిర్మాత గురువు

“కోల్కతా విశ్వవిద్యాలయంలో ఉన్నప్పుడు భారతీయతత్త్వ శాస్త్రంపై ఆయన రాసిన గ్రంథం.. విదేశీ పండితుల ప్రశంసలు అందుకుంది. మీరు ఆక్స్‌ఫర్డ్ ‌విశ్వ విద్యాలయం నుండి డిగ్రీ తీసుకుని వుంటే మీకు ఇంకా మరింత గొప్ప పేరు వచ్చేది’’ అని ఒక మిత్రుడు అనగా, బదులుగా, డా. రాధాకృష్ణన్‌, ‘‘‌నేను ఆక్స్‌ఫర్డ్ ‌వెళ్తే అధ్యాపకునిగా మాత్రమే వెళ్తాను. కాని విద్యార్ధిగా మాత్రం వెళ్ళను’’ అన్నాడు. అంత దేశభక్తి రాధాకృష్ణన్‌ది.బోధన అనేది ఒక గొప్పవృత్తి అని ఒకప్పుడు ప్రజలు నమ్మేవారు. కానీ ప్రస్తుత సమాజంలో టీచర్లు సమాజంలో గౌరవాన్ని కోల్పోతున్నారు. తక్కువ వేతనాల కారణంగా ఇతర రంగాలను ఎంచుకుంటున్నారు. అందు వల్ల బోధన ఇప్పటికీ ఉత్తమ వృత్తి అని అందరికీ గుర్తు చేయడానికి ఇదే సరైన సమయం.బోధన ఇప్పటికీ ఒక వృత్తిగా పరిగణించబడుతోంది. కాబట్టి ఉపాధ్యాయులు సమాజంలో, సాయుధ దళాలలో, వైద్యులతో సమానంగా గౌరవాన్ని పొందుతారు. ఇలాంటి గౌరవం మరెవ్వరికి లభించదు.”

డి అనే నారుమడిలో, విద్యా అనే విత్తనం వేసి, అక్షరం అనే నీరు పోసి చెడు అనే కలుపు తీసి, మంచి, నీతి అనే ఫలాన్ని సమాజానికి అందించేవాడే ఉపాధ్యాయుడు. అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించి, జ్ఞానం అనే వెలుగును ప్రసాదించే చైతన్య శిల్పి గురువు. అంతటి ఉన్నతమైన వ్యక్తి కాబట్టే ఆది యుగం నుంచి ఆధునిక కాలం వరకు ఆయనే రుషి.సమాజ దేవాలయానికి నిజమైన రక్షకుడు. అందుకే మన సమాజంలో అమ్మానాన్నల తర్వాతి స్థానం గురువులకు ఇచ్చారు. శిశువును లోకానికి పరిచయం చేసిన అమ్మ మొదటి గురువైతే, గుండెలపై తన్నుతూ ఆటలాడే శిశువుకు నడక నేర్పే నాన్న రెండో గురువు. ఆ తర్వాత ఈ లోకంలో ఎలా నడుచుకోవాలో నేర్పి, విద్యా బుద్ధులు అందించే ఉపాధ్యాయుడు మూడో గురువు. అందుకే పెద్దలు మాతృ దేవోభవ, పితృ దేవోభవ ఆచార్యదేవోభవ అని అన్నారు. ఇంతటి ఉన్నతమైన ఉపాధ్యాయవృత్తికి వన్నె తెచ్చి, గురువు జాతి గౌరవాన్ని లోకానికి చాటి చెప్పిన మనదేశ రెండో రాష్ట్రపతి, మేధావి, విద్యావేత్త అయిన డాక్టర్‌ ‌సర్వేపల్లిరాధకృష్ణ జయంతిని ప్రభుత్వం ఉపాధ్యాయ దినోత్సవంగా గుర్తించింది. ప్రతి యేటా సెప్టెంబర్‌ 5‌న గురువులను సన్మానించుకునే అవకాశాన్ని ఇచ్చింది. సమాజంలో టీచర్ల పాత్రను ప్రజలకు తెలియజేసేందుకు, టీచర్లు విద్యార్థులకు నాణ్యమైన విద్యను బోధించేలా వారిలో అవగాహన కల్పించేందుకు గాను ప్రతిఏటా, భారత్లో సెప్టెంబర్‌ 5‌వ తేదీన టీచర్స్ ‌డే నిర్వహించుకుంటున్నాం.

చరిత్ర:
భారతరత్న, భారతదేశ తొలి ఉపరాష్ట్రపతి డాక్టర్‌ ‌సర్వేపల్లి రాధాకృష్ణన్‌. ఆయన పుట్టిన రోజైన సెప్టెంబర్‌ 5‌ను ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించుకుంటున్నాం. రాధాకృష్ణన్‌ 1888‌లో తిరుత్తనిలో జన్మించారు. కేంద్ర ప్రభుత్వం రాధాకృష్ణన్‌ ‌పుట్టిన రోజును 1962 నుంచిఉపాధ్యాయ దినోత్సవంగా పరిగణించి గౌరవిస్తోంది. ఆయన 15 సార్లు నోబెల్‌ ‌సాహిత్య బహుమతికి, 11 సార్లు నోబెల్‌ ‌శాంతి బహుమతికి నామినేట్‌ అయ్యారు. సర్వేపల్లి తనకు కృష్ణుడితో సమాన మని జాతిపిత మహాత్మాగాంధీ కీర్తించారు. ‘మీరు నా కృష్ణుడు, నేను అర్జునుడిని’ అన్నారు గాంధీజీ. ‘మీరు నాఉపాధ్యాయుడు’ అని కీర్తించారు పండిట్‌ ‌నెహ్రూ. బహుశా ఈ వ్యాఖ్యల నేపథ్యం నుంచే ఆయన పుట్టిన రోజును టీచర్స్ ‌డేగా నిర్వహించాలనే ఆలోచన వచ్చిందేమో! ‘యుగ పురుషుల గురించి ఉపన్యాసం ఇవ్వండని పిలిస్తే, యుగ పురుషు డేవచ్చి ఉపన్యసించారు’ అని కొనియాడారు హోవెల్‌. ‘‌నాలో మామూలు మనిషిని దర్శించిన మహర్షి’ అని కీర్తించారు సోవియట్‌ అధినే• •స్టాలిన్‌. అలాంటి గీతా చార్యుడు, ప్రబోధకుడు, యుగపురుషుడు, జ్ఞాన మహర్షి మన సర్వేపల్లి రాధాకృష్ణన్‌. ‌గురువులకే గురువు ఆయన. అందుకే ఆయన పుట్టిన రోజు ‘ఉపాధ్యాయ దినోత్సవం’ అయింది. బాల్యం నుంచే అఖండమైన రాధాకృ•్ణ•న్‌ ‌మేథాశక్తికి ఉపాధ్యాయులు ముగ్థులయ్యే వారు. తత్త్వశాస్త్రం, మనస్తత్వ శాస్త్రంపై బాగా అధ్యయనం చేసిన ఆయన చిన్న వయసులోనే ఇచ్చిన ఉపన్యాసాలు పలువురిని ఆకట్టుకునేవి. ఇక 16 ఏళ్లవయసులోనే శివకామేశ్వరితో రాధాకృష్ణన్‌ ‌వివాహం జరిగింది. మద్రాస్‌ ‌క్రిష్టియన్‌ ‌కాలేజీ నుంచి ఎం.ఏ పట్టా పొందిన ఆయన, మద్రాస్‌ ‌ప్రెసిడెన్సీ కళాశాలలో అధ్యాపకునిగా పనిచేశారు. అనంతర కాలంలో తత్త్వశాస్త్రంలో రాధాకృష్ణన్‌ ‌ప్రతిభను తెలుసుకున్న మైసూరు విశ్వవిద్యాలయం ఆయనను, ప్రోఫెసర్‌గా ఆహ్వానించింది. కంచు లాంటి కంఠంతో రాధాకృష్ణన చేసే ఉపన్యాసాలు విద్యార్ధులను ఎంతగానో ఆకట్టుకునేవి. దీంతో వారు కదల కుండా, బెంచ్‌లకు అతుక్కు పోయి మరి శ్రద్ధగా వినేవారు. రాధాకృష్ణ ప్రతిభను గుర్తించిన డాక్టర్‌. అశుతోష్‌ ‌ముఖర్జీ , రవీంద్రనాథ్‌ ‌ఠాగూర్‌ ‌కలకతా్త విశ్వవిద్యాలయానికి రావాల్సిందిగా కోరారు. దీంతో వారి ఆహ్వానం మేరకు రాధాకృష్ణన్‌ ‌కలకత్తా వెళ్లేందుకు నిర్ణయించుకున్నారు. అయితే మైసూరు విశ్వవిద్యాలయం యాజమాన్యం, విద్యార్ధులు ఆవార్తను జీర్ణించుకోలేక పోయారు. గురువుపై అభిమానంతో వారు బండికి కట్టిన గుర్రాలను తీసివేసి, రైల్వేస్టేషన్‌ ‌వరకు విద్యార్ధులే బండినిలాక్కొని వెళ్లారు. మార్గమధ్యంలో పురప్రముఖులు, ప్రజలు రాధాకృష్ణన్‌కు వీడ్కోలు పలికారు.

కోల్కతా విశ్వవిద్యాలయంలో ఉన్నప్పుడు భారతీయతత్త్వ శాస్త్రంపై ఆయన రాసిన గ్రంథం.. విదేశీ పండితుల ప్రశంసలు అందుకుంది. మీరు ఆక్స్‌ఫర్డ్‌విశ్వ విద్యాలయం నుండి డిగ్రీ తీసుకుని వుంటే మీకు ఇంకా మరింత గొప్ప పేరు వచ్చేది’’ అని ఒక మిత్రుడు అనగా, బదులుగా, డా. రాధాకృష్ణన్‌, ‘‘‌నేను ఆక్స్‌ఫర్డ్ ‌వెళ్తే అధ్యాపకునిగా మాత్రమే వెళ్తాను. కాని విద్యార్ధిగా మాత్రం వెళ్ళను’’ అన్నాడు. అంత దేశభక్తి రాధాకృష్ణన్‌ది. బోధన అనేది ఒక గొప్పవృత్తి అని ఒకప్పుడు ప్రజలు నమ్మేవారు. కానీ ప్రస్తుత సమాజంలో టీచర్లు సమాజంలో గౌరవాన్ని కోల్పోతున్నారు. తక్కువ వేతనాల కారణంగా ఇతర రంగాలను ఎంచుకుంటున్నారు. అందు వల్ల బోధన ఇప్పటికీ ఉత్తమ వృత్తి అని అందరికీ గుర్తు చేయడానికి ఇదే సరైన సమయం.బోధన ఇప్పటికీ ఒక వృత్తిగా పరిగణించబడుతోంది. కాబట్టి ఉపాధ్యాయులు సమాజంలో, సాయుధ దళాలలో, వైద్యులతో సమానంగా గౌరవాన్ని పొందుతారు. ఇలాంటి గౌరవం మరెవ్వరికి లభించదు.

మరోవైపు ప్రైవేట్‌ ‌రంగంలో పనిచేసే అధ్యాపకులను మాత్రం సమాజంలో గౌరవం మాట అటుంచితే, చిన్న చూపు చూస్తున్నారు.బతక లేనివాడు బడి పంతులు అన్న మాటలు ప్రైవేట్‌, ‌కార్పొరేట్‌ ‌విద్యా సంస్థలలో పనిచేస్తున్న అధ్యాపకులకు సరిగ్గా వర్తిస్తాయి. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీల కంటే ప్రైవేట్‌ ‌పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయుల జీవితాలు దుర్భరంగా ఉంటున్నాయి. ఏడాది మొత్తానికి ప్రతి విద్యార్థి నుండి యాజమాన్యం ఫీజులు వసూలు చేస్తుంది. కానీ అక్కడ పని చేసే ఉపాధ్యాయులకు మాత్రం 10 నెలలు మాత్రమే వేతనాలు ఇస్తారు. అవీ నామ మాత్రంగానే చెల్లిస్తారు.దేశంలో ఎక్కడా లేని విధంగా మన తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేటు, కార్పొరేట్‌ ‌విద్యా సంస్థలు పుట్ట గొడుగుల్లా పుట్టుకొచ్చాయి. వేల పాఠశాలలు, కళాశాలలకు అడ్డగోలుగా అనుమతులు ఇస్తున్న ప్రభుత్వం అందులో ఎవరు చదువు చెబుతున్నారు? వారి అర్హతలు ఏంటి? వారికి ఇస్తున్న వేతనాలు ఏంటి? వారి జీవన ప్రమాణాలు ఏంటని? ప్రశ్నించే వ్యవస్థను ఏర్పాటు చేయకపోవడం శోచనీయం.

గత •నాలుగు నెలల నుంచి జీతాలు లేక జీవితాలే ప్రశ్నర్ధకమైన వేళ ఒక్క అధి కారపక్షనాయకుడు కూడా ఎటువంటి సానుభూతి కానీ కనీసం గాలి వాటు హామీకూడాఇవ్వలేదం• •ప్రైవేట్‌ అధ్యాపకులపై ఎంత మంచి అభిప్రాయం ఉందొ అర్థమౌతుంది. ప్రైవేట్‌ ఉద్యోగులు ఓటుబ్యాంకు కేసరిపోతారాలేదా రాజకీయ నాయకులను గద్దెనెక్కించి తాము బలిపీఠంపై కూర్చునేందుకు మానవజన్మ ఎత్తారా అనే సందేహం వస్తుంది. ప్రతిరోజు ఏదో ఒక దినపత్రికలో వీరి సమస్యల గూర్చి వార్తలు వస్తున్న నిమ్మకు నీరెత్తినట్టు ప్రవర్తిస్తుంది ఉద్యమం ద్వారా పురుడు పోసుకున్న ప్రభుత్వం . వీళ్ళసమస్యకు ఎక్కడో ఒకచోట పుల్‌స్టాప్‌ ‌పడాల్సిందే. దానికి ప్రభుత్వం ప్రత్యేక జీవో ద్వారా అర్హులైన అధ్యాపకులందరికి ప్రభుత్వమే జీత భత్యాలు చెల్లించాలి. అప్పుడే సమాజంలో వీరికి తగిన హోదా లభిస్తుంది. లేక పోతే రైతు ఆత్మహత్యల స్థానంలో గురువు ఆత్మహత్యల వార్తలను చదువాల్సివస్తుంది.

డా।। ఎండి ఖ్వాజా మొయినొద్దీన్‌ ‌ప్రొఫెసర్‌, అకౌంటింగ్‌ అం‌డ్‌ ‌ఫైనాన్స్, 9492791387

Leave a Reply