Take a fresh look at your lifestyle.

అ‌క్రమ నిర్మాణాల ప్రక్రియను వేగవంతం చేయాలి: కలెక్టర్‌

‌నాలాలపై అక్రమ నిర్మాణాలను సత్వరమే తొలగింపు నిర్దేశించిన వ్యవధిలోపు పూర్తి చేయాలని కలెక్టర్‌ ‌రాజీవ్‌ ‌గాంధీ హనుమంతు సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం నయిమ్‌ ‌నగర్‌, ‌కిషన్‌పుర అక్రమ నిర్మాణాలు, నాలాలకు ఇరువైపుల చేసిన మార్కింగ్‌ ‌తొలగింపుకు తీసుకుంటున్న చర్యల పై మహా నగర పాలక కమీషనర్‌ ‌పమేలా సత్పతితో కలిసి కలెక్టర్‌ ‌రాజీవ్‌ ‌గాంధీ హనుమంతు ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం అలంకార్‌ ‌టాకీస్‌, ‌రంగంపేట, ఎల్‌బి కళాశాల ఆవరణలోని నాలాలను పరిశీలించి నాలాలపై నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన అక్రమాలను వెంటనే మార్కింగ్‌ ‌చేసి తొలగింపుకు చర్యలు తీసుకోవాలని, గతంలో లాగ నాలాల స్వరూపాలు ఉండేవిధంగా చర్యలు తీసుకోని, నాలాల్లో ఉన్న చెత్తను, ముళ్ళపొదను అడ్డంగా వున్న పెద్ద చెట్లను కూడా తొలగించాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ ‌మాట్లాడుతూ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి వరంగల్‌ ‌పర్యటనలో దిశా నిర్దేశం చేసిన ప్రకారం నాలాలపై నిర్మించిన అక్రమ నిర్మాణలను గుర్తించి తొలగింపులు చేయుటకు కమిటీని నియమించినట్లు పేర్కొన్నారు. తొలగింపుకు తీసుకోవాల్సిన చర్యలపై  ఇప్పటికీ మున్సిపల్‌, ‌రెవెన్యూ, ఇరిగేషన్‌ ఆర్‌అం‌డ్‌బి సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించామన్నారు. పట్టణంలోని మేజర్‌ ‌నాలాల అక్రమాలను గుర్తించామని రెవెన్యూ, పోలీసు, మున్సిపల్‌ అరిగేషన్‌ ఇతరశాఖల అధికారులతో 4 బృందాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. గత మూడు రోజుల నుండి అక్రమాలను మార్కింగ్‌ ‌చేసిన తొలగిస్తున్నట్లు స్పష్టం చేశారు.

ఈ ప్రక్రియను మొత్తం నెల రోజుల్లో పూర్తిచేసేందుకు లక్ష్యంగా పేట్టుకున్నట్లు తెలిపారు. అలాగే చెరువుల అక్రమణ వలన నిర్మించిన భవనాలను తొలగింపు చర్యలు తీసుకుంటామన్నారు. నిబంధనలకు అనుగుణంగా లభించిన వాటిని పరిశీలించి అనుమతులు పొందిన దానికంటే అధికంగా నిర్మిస్తే వాటిపై కూడా చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ ‌తెలిపారు. నగర పాలక సంస్థ కమీషనర్‌ ‌పమేలా సతృతి మాట్లాడుతూ టౌన్‌ ‌ప్లానింగ్‌ ఇరిగేషన్‌ అధికారుల సంయుక్తంగా జాయింట్‌ ‌సర్వే నిర్వహిస్తున్నారన్నారు. ఇప్పటికీ నియమించిన టాస్క్ ‌ఫోర్స్ ‌కమిటీ అధ్యక్షతన క్షేత్రస్థాయిలో పర్యటించి గుర్తిస్తున్నట్లు చెప్పారు. మున్సిపల్‌ ‌పరిధిలో దాదాపు 922 శిధిలావస్థ భవనాలను గుర్తించామని చాలా ముట్టుకు తొలగించినట్లు స్పష్టం చేశారు. నాలాలో పేరుకుపోయిన చెత్తను తొలిగించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఎంఓ రాజారెడ్డి, టివిఎస్‌లు సుమన్న కావ్య రెవెన్యూ ఇరిగేషన్‌ ‌మున్సిపల్‌ ‌సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply