Take a fresh look at your lifestyle.

‌గిరిజన విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి

The problems of tribal students must be solved

మణుగూరు గిరిజన విద్యార్ధుల సమస్యలను పరిష్కరించాలని తుడుందెబ్బ ఆధ్వర్యంలో విద్యార్ధులు కలిసి భారి ర్యాలీ నిర్వహించారు. సోమవారం ప్రభుత్వ జూనియర్‌ ‌కళాశాల నుండి సురక్ష బస్టాండ్‌ ‌మీదుగా అంబేద్కర్‌ ‌సెంటర్‌ ‌వరకు ర్యాలీ నిర్వహిం చారు.  తహసీల్దార్‌ ‌కార్యాలయం ముందు గిరిజన విద్యార్ధుల సమస్యలు పరిష్కరిం చాలని విద్యార్ధులు ధర్నా నిర్వహిం చారు. అనంతరం తుదుంబెబ్బ జిల్లా అధ్యక్షులు ఆలెం కోటి మాట్లా డుతూ…. మణుగూరు మండల కేంద్రంలోని గిరిజన విద్యార్ధుల వసతి గృహాల్లో లోపల సమస్యలు అపరిష్కతంగా వున్నాయన్నారు. గిరిజన బాలికల వసతి గృహాలకు చూట్టు ప్రహారి గోడ లేక పోవడం విద్యార్ధులు భయందోలనకు గురవతర్నారన్నారు. ఏప్పుటు ఏలాంటి ప్రమాదం జరుగుతుందో అని విద్యార్ధులు బెంబేలేత్తు•్న రన్నారు. విద్యార్ధులు వసతి గృహానికి వెళ్లడానికి సరైన రహాదారి సౌకర్యం కూడా లేదన్నారు. వసతి గహాల్లో గదులకు తలపులు, కిటికీలు కూడా సరిగ్గా లేవన్నారు. ప్రభుత్వం జారీ చేసిన మెను ప్రకారం విద్యార్ధులకు భోజనం పెట్టడం లేదన్నారు. వసతి గృహాల్లో సరైన డ్రేనేజి వ్యవస్థ లేక పోవడం వలన దోమలు వృద్ధి చెంది విద్యార్ధులు రోగాల భారీన పడుతున్నారన్నారు. మణుగూరు హాస్టల్లోని గిరిజన విద్యార్ధులు భయబ్రాంతుల మధ్య తమ చదువును కొనసాగితున్నారని, వెంటనే ప్రభుత్వం, అధికారులు స్పందించి సమస్యల పరిష్కరానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని తహసీల్దార్‌ ‌నారాయణమూర్తికి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ విద్యార్ధి సంఘం, రాష్ట్ర వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ఆలెం కిషోర్‌, ‌రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొర్నిబెల్లి గణేష్‌, ‌ప్రధాన కార్యదర్శి సంపత్‌ ,  ‌పాల్గన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply