ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలి : కలెక్టర్
- దరఖాస్తుల పరిష్కారంపై
- ప్రతి శనివారం ప్రత్యేక సమీక్ష

ప్రజా సమస్యల్ని సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమ వారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పాల్గోని ప్రజల వద్ద నుంచి అర్జీలను ఆమె స్వీకరించారు. వివిధ సమస్యలపై ప్రజల నుండి 62 వినతులు అందిన ట్లు అధికారులు తెలిపారు. ముత్తారం మండలం లక్కారం గ్రామానిక చెందిన గటిక శ్రీలత తన భర్త కుమారస్వామి భారత సైన్యంలో విధులు నిర్వహిస్తు డ్యూటీలో చనిపోయాడని, తనకు ఎక్స్ సర్వీస్‌మెన్ కోటాలో పంచాయతీ కార్యదర్శి పరీక్షలు రాసి ఎంపికైన ట్లు తెలిపారు. తన సర్టిఫికేట్లను పరిశీలించి ఉపాధి కల్పించవలసిందిగా ఆమె మొర పెట్టుకున్నారు. ఎలిగే డు మండలం సుల్తాన్‌పూర్‌కు చెందిన మంజుల తాను ఒంటరి మహిళనని, తనకు ఇద్దరు పిల్లలు ఉన్నట్లు, 7వ తరగతి వరకు చదివిన తనకు ఉపాధి కల్పించాలని అభ్యర్థించారు. మంథని మండలం ఆరెంద గ్రామానికి చెందిన బక్కయ్య గ్రామ శివారులోని సర్వె నెం.160/4లో తన 4ఎకరాల 12గుంటల భూమి పట్టా ఉన్నప్పటికి అటవీశాఖ అధికారులు తన భూమిపై అభ్యం తరం వ్యక్తం చేస్తున్నారని, తన భూమిని తనకు ఇప్పిం చాలని కోరారు. రామగుండం జ్యోతినగర్‌కు చెందిన రామచందర్ తాను శాసనసభలో 14 సంవత్సరాలు విధులు నిర్వహించిన తనకు పెద్దపల్లి జిల్లాలోని గురుకుల వసతి గృహంలో నాల్గవ తరగతి సిబ్బందిగా ఉద్యోగం ఇప్పించాలని ఆయన వేడుకున్నారు. పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉంటున్న కనకవ్వ తనకు ఎవ్వరు లేరని ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నివసి స్తున్నానని తనకు సహాయం చేయాలని రోధించారు.
పురం స్వప్న అనే మహిళ తన భర్త హింసిస్తున్నాడని, తనతో పాటు తన ఇద్దరు పిల్లలకు వసతి కల్పించి కా పాడాలని కలెక్టర్‌ను వేడుకున్నారు. ప్రజల నుండి వినతులను స్వీకరించి సంబంధిత శాఖలకు వెంటనే పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. అర్జీదారులు అందించే వివిధ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాల ని, అర్జీదారులకు తప్పనిసరిగా రశీదివ్వాలని, లిఖీత పూర్వకమైన సమాధానం ఇవ్వాలని కలెక్టర్ అధికారుల ను ఆదేశించారు. ప్రజావాణీ కార్యక్రమంలో వచ్చే దరఖాస్తులు వాటిపై తీసుకున్న చర్యలకు సంబంధించి ప్రతి శనివారం నాడు ప్రత్యేక సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు. మండల స్థాయిలో తహశీల్దార్ కార్యాలయా లలో నిర్వహించే ప్రజావాణీలో అర్జీదారుల సమస్యల ను సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమంలలో జిల్లా జాయింట్ కలెక్టర్ వనజాదేవి, ఇంఛార్జీ డిఆర్వో నరసింహమూర్తి, జిల్లా అధికారులు, సంబంధిత సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.