సమాజంలో అతి వినయం, అణుకువతో ఉండే మన్మోహన్ సింగ్, ముకేష్ అంబానీ వంటివారిపై కూడా నీలి నీడలు ఏర్పడ్డాయి. ఆ సమయంలో అవినీతికి వ్యతిరేకంగా గాంధేయవాది అన్నా హజారే అవినీతికి వ్యతిరేకంగా పోరు ప్రారంభించారు. ఈ ఉద్యమంలో కేజ్రీవాల్, యువ బృందం పాలు పంచుకుంది. వారు రాజకీయాల్లో లేరు. వారిపై ఎటువంటి అవినీతి మరకలు లేవు. రాజకీయ వారసత్వం కూడా లేదు. వోటు బ్యాంకు సంస్కృతి అసలే లేదు. అంతేకాక, సైద్ధాంతికంగా కుడి, ఎడమ వంటి భేదభావం కూడా లేదు. సరిగ్గా ఆ సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ అవతరించింది.
అరవింద్ కేజ్రీవాల్ నెలకొల్పిన ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) రాజకీయాల్లో అన్ని అడ్డంకులను ఛేదించింది. ముఖ్యంగా కులం, జాతి, సైద్ధాంతిక, అనువంశిక లక్షణాలేవీ ఆ పార్టీలో లేవు. ఢిల్లీలో అధికారంలో ఉన్న పార్టీ అయినా, అఖిల భారత స్థాయిలో గుర్తింపు పొందింది. ఇప్పుడు అంకురాల దశాబ్దం నడుస్తోంది. వందలాది కొత్త సంస్థలు ఆవిర్భవిస్తున్నాయి. డజను పైగా విలక్షణత స్థాయిని అతి స్వల్ప కాలంలో సంతరించుకున్నాయి. రాజకీయ రంగంలో కొత్త అంకురంగా అరవింద్ కేజ్రీవాల్ నెలకొల్పిన ఆమ్ ఆద్మీ పార్టీని చెప్పుకోవచ్చు. ఈ దశాబ్దం ఆ పార్టీదే. ఇందుకు కారణాలు అనేకం.మొదటిది ఏమంటే దేశంలో పాతుకుని పోయిన రాజకీయ పార్టీలు కులం, మతం, జాతి, సైద్ధాంతిక పరమైన భావజాలంతో ఏర్పడినవే, అందుకు జనసంఘ్, స్వతంత్ర పార్టీ, జనతాపార్టీ, నుంచి తెలుగుదేశం, బిజేడీ, టిఎంసీ , డిఎంకె సహా అన్నీ అలా ఏర్పడినవే. సైద్దాంతిక, నాయకత్వ ప్రాబల్యం, కుల, మత వోటు బ్యాంకు పునాదులతో ఏర్పడిననే. ఆప్ అందుకు భిన్నమైన రీతిలో ఏర్పడింది.
దేశంలో ఒక చిన్న రాష్ట్రంలో రాజకీయాలకు కొత్త అయిన కేజ్రీవాల్ ఈ పార్టీని 2012 నవంబర్ 26వ తేదీన స్థాపించారు. అయితే, ఈ పార్టీకి సంబంధించి ఆలోచన 2010లోనే వచ్చింది. యూపీఏ స్వీయ విధ్వంసక విధానాల వల్ల ఏర్పడింది. ముఖ్యంగా కాంగ్రెస్, బిజేపీ విసిరిన వలలో చిక్కుకుని విలవిల్లాడుతున్న సమయంలో నరేంద్రమోడీ బీజేపీ సారథ్యం స్వీకరించడానికి ముందు కొంత గడువు ఉంది. కేజ్రీవాల్ అవినీతికి వ్యతిరేకంగా జరిగిన పోరులో జాతీయ ప్రాముఖ్యాన్ని సంపాదించారు. ప్రభుత్వానికి సంబంధించిన అన్ని సంస్థలు. విశ్వాసాన్ని కోల్పోయాయి. రాడియా టేపుల వ్యవహారం వెలుగుచూడటంలో అందరూ దొంగలేనన్న భావన అందరిలో ఏర్పడింది. సమాజంలో అతి వినయం, అణుకువతో ఉండే మన్మోహన్ సింగ్, ముకేష్ అంబానీ వంటివారిపై కూడా నీలి నీడలు ఏర్పడ్డాయి. ఆ సమయంలో అవినీతికి వ్యతిరేకంగా గాంధేయవాది అన్నా హజారే అవినీతికి వ్యతిరేకంగా పోరు ప్రారంభించారు. ఈ ఉద్యమంలో కేజ్రీవాల్, యువ బృందం పాలు పంచుకుంది. వారు రాజకీయాల్లో లేరు. వారిపై ఎటువంటి అవినీతి మరకలు లేవు. రాజకీయ వారసత్వం కూడా లేదు. వోటు బ్యాంకు సంస్కృతి అసలే లేదు. అంతేకాక, సైద్ధాంతికంగా కుడి, ఎడమ వంటి భేదభావం కూడా లేదు. సరిగ్గా ఆ సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ అవతరించింది. ఆ పార్టీ ఆవిర్భావ సభ వేదికపై భారత్ మాతాకీ జై, నినాదం, భగత్ సింగ్ చిత్రపటాలు ఉన్నాయి.
అన్ని అంకురాల మాదిరిగానే ఆప్ అనేక బాలారిష్టాలను ఎదుర్కొంది. వీటిలో కొన్ని స్వయంకృతాలు ఉన్నాయి. 2019 లోక్ సభ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోవడమే కాకుండా మూడో స్థానంలో రావడం. ముఖ్యంగా ఢిల్లీ నియోజకవర్గాల్లో బాగా తక్కువ మెజారిటీ రావడం వంటివి సంభవించాయి. యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్, కేజ్రీవాల్‌లు మార్క్ జుకెర్ బెర్గ్ కవలల వంటి వారు. అలాంటి వారిలో విభేదాలు వొచ్చాయి. కేజ్రీవాల్ ఢిల్లీలోని జెఎన్‌యూలో గొడవలు జరిగినప్పుడు వెళ్లలేదు. మోడీ జాతీయవాదం, మతం, సంక్షేమవాదం ఊపందుకున్నప్పుడు ఆయన ఏమాత్రం హడావుడి పడకుండా తన పని తాను చేసుకుంటూ పోయారు. కేజ్రీవాల్ ఉదార హిందూ ప్రతిపత్తిలో ఉండిపోయారు. ఆయన ఎన్నడూ నినాదాల హోరులో కొట్టుకుని పోలేదు. కొత్తగా పుట్టిన పార్టీ ఒక చిన్న రాష్ట్రంలో దశాబ్దంపాటు ఆధిక్యాన్ని ప్రదర్సించడం చిన్న విషయం ఏమీకాదు. బాలాకోట్‌లో మెరుపుదాడులను కేజ్రీవాల్ సమర్థించారు. కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే 370వ అధికరణం రద్దుకు మద్దతు ప్రకటించారు. మోడీని ఎంత తీవ్రంగా విమర్శించారో ఈ మధ్య కాలంలో మోడీ తీసుకున్న అనేక కార్యక్రమాలను సమర్థించారు. మెచ్చుకున్నారు. సీనియర్ సిటిజెన్స్‌కు తీర్థ యాత్ర సదుపాయం కల్పించారు. ఆ తీర్థయాత్రల్లో అజ్మీర్ షరీఫ్ కూడా ఉంది. దివాలీ మేళాను నిర్వహించారు. ఢిల్లీలో వాయకాలుష్యాన్ని నివారించేందుకు వాహనాలకు సరి-బేసి విధానాన్ని అమలు జేశారు. ఢిల్లీ ప్రజల హృదయాలను చూరగొనడానికి ఆయన అనేక సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. బస్సుల్లో వృద్దులకు ఉచిత ప్రయాణ సౌకర్యం వంటివి కల్పించారు. మొత్తం మీద ఆయనలో గుణాత్మకమైన మార్పు కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది.
– శేఖర్ గుప్త
‘ద ప్రింట్’ సౌజన్యంతో..
Tags: the print,aap party,aravindh kejriwal