Take a fresh look at your lifestyle.

కుంభమేలాకు వెళ్లివచ్చిన పూజారి కొరోనాతో మృతి

  • ఎపిలో 15వేలకు చేరువలో పాజిటివ్ కేసులు
  • 57 మంది మృత్యువాత

ఏపీలో కొరోనా విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 14,792 కరోనా కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో కొరోనాతో 57 మంది మృతి చెందారు. ప్రస్తుతం ఏపీలో 1,14,158 యాక్టివ్‌ ‌కేసులున్నాయి. కొరోనా నుంచి కోలుకుని 9,62,250 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఏపీలో మొత్తం 10,48,336 పాజిటివ్‌ ‌కేసులున్నాయి. ఇప్పటివరకు 7,928 మంది మృతి చెందారు. మరోవైపు ఏపీ సచివాలయంలో కొరోనా కలకలం రేపుతోంది. కొరోనా తో మరో ఉద్యోగి ప్రాణాలు
కోల్పోయాడు. సాధారణ పరిపాలన శాఖలో డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పనిచేస్తున్నకిషోర్‌ ‌కుమార్‌ ‌బుధవారం అర్ధరాత్రి మృతి చెందాడు.

దీంతో అనేక మంది కొరోనా బారిన పడుతుండటంతో భయాందోళనకు గురవుతున్న ఉద్యోగులు తమకు వర్క్ ‌ఫ్రమ్‌ ‌హోమ్‌కి అవకాశం ఇవ్వాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదిలావుంటే దేశంలో కొరోనా విశృంఖలంగా వ్యాపించడానికి ప్రధాన కారణం కుంభమేలా అని అందరూ ఆరోపిస్తున్న వేళ ఓ పూజారి మరణించాడు. ఇప్పటికే కుంభమేలా కు వెళ్లి వచ్చిన వారికి మాత్రం పెద్ద సంఖ్యలో కొరోనా వ్యాప్తి చెందింది. కడప జిల్లాకు చెందిన ఆలయ ప్రధాన అర్చకులు కొరోనాతో మృతిచెందారు.

కడప జిల్లా పోరుమామిళ్ల పట్టణంలోని అమ్మవారిశాల ప్రధాన అర్చకుడు అనంతబోట్ల హరికృష్ణ శర్మ ఇటీవల హరిద్వార్‌లో జరిగిన కుంభమేలా కు వెళ్లారు. తిరిగి వచ్చిన అనంతరం ఆయనకు కొరోనా సోకింది. వారం రోజులుగా కొరోనా తో పోరాడుతున్నారు. చికిత్స పొందుతూ గురువారం ఆయన మృతి చెందారని వారి బంధువులు వెల్లడించారు. ఈ విధంగా కుంభమేలా కు వెళ్లి వచ్చిన చాలా మంది కొరోనా బారినపడ్డారని తెలుస్తోంది.

Leave a Reply