Take a fresh look at your lifestyle.

హైదరాబాద్‌లో వంద దాటిన పెట్రో లీటర్‌ ‌ధర

  • తాజాగా పెట్రోల్‌పై 29 పైసలు, డీజిల్‌పై 31 పైసల పెంపు
  • దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న పెట్రో ధరలు

దేశంలో పెట్రోల్‌, ‌డీజిల్‌ ‌ధరల పెంపు కొనసాగుతున్నది. గడిచిన 40 రోజులుగా చమురు కంపెనీలు ధరలు పెంచుతూ వొస్తుండగా.. తాజాగా లీటర్‌ ‌పెట్రోల్‌పై 29 పైసలు, డీజిల్‌పై 31 పైసలకు పెరిగింది. దేశవ్యాప్తంగా చాలా నగరాల్లో ఏడు ప్రధాన నగరాల్లో లీటర్‌ ‌పెట్రోల్‌ ‌ధర రూ.100 మార్క్‌ను దాటింది. మరో వైపు డీజిల్‌ ‌సైతం రూ.100 వైపు వేగంగా పరుగులు పెడుతున్నది. కొత్తగా పెంచిన ధరలతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ ‌పెట్రోల్‌ ‌ధర రూ.96.41, డీజిల్‌ ‌రూ.87.28కు చేరింది. మే 4వ తేదీ నుంచి ఇప్పటి వరకు ఇంధన ధరలు 25వసార్లు పెరిగాయి. దేశవ్యాప్తంగా పెట్రోల్‌, ‌డీజిల్‌ ‌ధరలు ఆల్‌ ‌టైమ్‌ ‌గరిష్ఠ స్థాయికి చేరాయి. మరో వైపు రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌లో లీటర్‌ ‌పెట్రోల్‌రూ.107, లీటర్‌ ‌డీజిల్‌ ‌రూ.100కుపైగా దాటింది. తాజాగా పెరిగిన ధరలతో హైదరాబాద్‌లో లీటర్‌ ‌పెట్రోల్‌ ‌ధర రూ.100 మార్కెట్‌ను దాటింది. ప్రస్తుతం లీటర్‌ ‌పెట్రోల్‌ ‌ధర రూ.100.20కు చేరగా.. డీజిల్‌ ‌లీటర్‌ ‌రూ.95.14కు పెరిగింది. దాదాపు ఐదారు జిల్లాలు మినహా రాష్ట్రవ్యాప్తంగా మిగతా అన్ని ప్రాంతాల్లో లీటర్‌ ‌పెట్రోల్‌ ‌రూ.100 దాటింది.

అత్యధికంగా ఆదిలాబాద్‌, ‌జోగులాంబ గద్వాల, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, ‌నిజామాబాద్‌ ‌జిల్లాల్లో పెట్రోల్‌ ‌రూ.102కుపైగా ధర పలుకుతుండగా.. భదాద్రి కొత్తగూడెం, జగిత్యాల, కామారెడ్డి, మెదక్‌, ‌మహబూబ్‌నగర్‌, ‌నాగర్‌ ‌కర్నూల్‌, ‌నిర్మల్‌, ‌సిద్ధిపేట, సూర్యాపేట, నల్గొండ, యాదాద్రి భువనగిరితో పాటు పలు జిల్లాల్లో లీటర్‌ ‌పెట్రోల్‌ ‌రూ.100 దాటింది. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో ఇంధన ధరలు ఈ విధంగా ఉన్నాయి. ఢిల్లీలో పెట్రోల్‌ ‌రూ.రూ.96.41.. డీజిల్‌ ‌ధర రూ.87.28, ముంబైలో పెట్రోల్‌ ‌రూ.102.58.. డీజిల్‌ ‌రూ.94.70, కోల్‌కతాలో పెట్రోల్‌ ‌రూ.96.34.. డీజిల్‌ ‌రూ.90.12, చెన్నైలో పెట్రోల్‌ ‌రూ.97.69.. డీజిల్‌ ‌రూ.91.92, పాట్నాలో పెట్రోల్‌ ‌రూ.98.49, డీజిల్‌ ‌రూ.92.59, లక్నోలో పెట్రోల్‌ ‌రూ.93.40, డీజిల్‌ ‌రూ.87.47,హైదరాబాద్‌లో పెట్రోల్‌ ‌రూ.100.20, డీజిల్‌ ‌రూ.95.14గా ఉన్నాయి. గత 42 రోజుల్లో పెరుగుదల నమోదు చేయడం 24వ సారి. దీంతో వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్‌ ‌ధరల ఆధారంగా వీటి ధరలు నిర్ణయిస్తుంటారు.రాష్టాల్లో్ర వ్యాట్‌తో సహా ఇతర పన్నులు కలుపుకుని ధరల్లో మార్పులు ఉంటాయి.

Leave a Reply