Take a fresh look at your lifestyle.

గత ప్రభుత్వానికి అవినీతిపై పోరాడే చిత్తశుద్ధి లేదు

  • మా పాలనలో ప్రజల్లో విశ్వాసం ఏర్పడింది
  • సివిసి, సిబిఐ సంయుక్త సమావేశంలో ప్రధాని మోడీ

గత కాంగ్రెస్‌ ‌ప్రభుత్వానికి అవినీతిపై పోరాడే చిత్తశుద్ధి లేదని ప్రధాని మోడీ అన్నారు. బుధవారం గుజరాత్‌లోని కెవాడియాలో సెంట్రల్‌ ‌విజిలెన్స్ ‌కమిషన్‌(‌సివిసి) మరియు సెంట్రల్‌ ‌బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌(‌సిబిఐ) సంయుక్త సమావేశంలో ప్రధాని వర్చువల్‌గా పాల్గొని ప్రసంగిస్తూ..గత ప్రభుత్వానికి అవినీతిపై పోరాడే ఉద్దేశం లేదని మోదీ పేర్కొన్నారు. తమ ప్రభుత్వం గత ఆరేడు సంవత్సరాలలో చేసిన కృషి ఫలితంగా అవినీతిపై పోరాడటం సాధ్యమవుతుందని, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా వివిధ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పొందుతామని ప్రజలలో విశ్వాసం ఏర్పడిందని ఆయన అన్నారు.

గత ఆరేడు సంవత్సరాలలో, దేశంలో అవినీతిని అరికట్టడం సాధ్యమవుతుందనే విశ్వాసాన్ని ప్రజల్లో నెలకొల్పగలిగామని, ఎలాంటి మధ్యవర్తులు లేకుండా ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పొందుతారని దేశ ప్రజలకు ఈ రోజు నమ్మకం ఉందని మోదీ అన్నారు. అవినీతి, ఆర్థికంగా అంతరాలు సాధారణ ప్రజల హక్కులను హరిస్తుందని, ఇది దేశ పురోగతికి ఆటంకం కలిగిస్తుందని, మన సమష్టి శక్తిని ప్రభావితం చేస్తుందని ప్రధాని అన్నారు.

Leave a Reply