ప్రజాస్వామ్య పరిరక్షణలో పత్రికలే కీలకం
ప్రజాతంత్ర క్యాలెండర్‌ను ఆవిష్కరించిన మంత్రి హరీష్‌రావు
సిద్ధిపేట, జనవరి 8(ప్రజాతంత్ర బ్యూరో): ప్రజాతంత్ర తెలంగాణ దినపత్రిక-2022 ఆంగ్ల నూతన సంవత్సర క్యాలెండర్‌ను రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు ఆవిష్కరించారు. శనివారం సిద్ధిపేటలోని పత్తి మార్కెట్ యార్డు ఆవరణలో మంత్రి హరీష్‌రావు ‘ప్రజాతంత్ర’ దినపత్రిక బ్యూరో ఇంఛార్జి అయ్యమ్మగారి సత్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు, జర్నలిస్టు సంఘం నేతలతో కలిసి మంత్రి హరీష్‌రావు క్యాలెండర్‌ను ఆవిష్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రజాస్వామ్య పరిరక్షణలో పత్రికలే కీలకం అని అన్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో ‘ప్రజాతంత్ర’ దినపత్రిక పాత్ర మరువలేనిదనీ కొనియాడారు. మీడియా రంగం చాలా ఉధృతంగా విస్తరిస్తుందనీ, పత్రికకు సాంకేతికతను అందింపుచ్చుకుని మరింత సందేశాత్మక రీతిలో ఉపయోగపడాలన్నారు. ఇప్పటికే 23 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంలో ప్రజాతంత్ర దినపత్రిక మరింత చేరువ కావాలని క్యాలెండర్ ఆవిష్కరణలో పాల్గొన్న మరి కొందరు వక్తలు అభిప్రాయపడ్డారు. పత్రికకు ప్రజాస్వామ్యానికి నిదర్శనం అన్నారు.
ప్రజాతంత్ర దినపత్రిక నిజాయితీకి నిలువుటద్దమన్నారు. సామాజిక అంశాలతో ప్రజలను చైతన్యం చేసే దిశగా పత్రిక ప్రయత్నిస్తుందన్నారు. పత్రికలు సమాజానికి ఎంతో అవసరమన్నారు. పజాతంత్ర దినపత్రిక అనునిత్యం ప్రజల సమస్యలపై ప్రభుత్వాలకు అనుదినం జన స్వరం వినిపించే పత్రిక అన్నారు. పత్రికల పనితీరులో ప్రజాతంత్ర ప్రజల సమస్యలపై అధికార యంత్రాంగానికి చేరవేయడంలో ప్రముఖ పాత్రను పోషిస్తుందన్నారు. ఇలాంటి పత్రికలు సమాజానికి ఎంతో అవసరం అని వక్తలు గుర్తు చేశారు. సమాజంలో పత్రికలతో ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఉంటూ సమాజం పట్ల పత్రికలు ఎంతో మేలు చేస్తున్నాయన్నారు. ఈ క్రమంలో ప్రజాతంత్ర తెలంగాణ దినపత్రిక 23 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం శుభపరిణామన్నారు.
ప్రజా సమస్యలపై నిరంతరం రాజీలేని పోరాటాన్ని సాగిస్తున్న ప్రజాతంత్ర తెలంగాణ దినపత్రిక మరింత అభివృద్ధి చెందాలని వక్తలు ఆకాంక్షించారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ వేలేటి రోజారాధాకృష్ణశర్మ, టియూడబ్ల్యూజే(ఐజేయూ) సిద్ధిపేట జిల్లా అధ్యక్షుడు కలకుంట్ల రంగాచారి, టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుల వేలేటి రాధాకృష్ణశర్మ, కోమటిరెడ్డి వెంకట్ నర్సింహారెడ్డి(కేవీఎన్‌ఆర్)సుడా డైరెక్టర్ మచ్చ వేణుగోపాల్‌రెడ్డి, ములుగు డివిజన్ ఆత్మ కమిటీ ఛైర్మన్ గూండా రంగారెడ్డి, కొండపోచమ్మ ఆలయ ఛైర్మన్ రాచమల్ల ఉపేందర్‌రెడ్డి, ఆలయ ఈవో మోహన్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, శ్రీనివాస్, హరిబాబు, సీనియర్ జర్నలిస్టులు మడూరి శ్రీరామ్, ఏల్పుల మహేష్, తిప్పర్తి భాస్కర్, ముక్కెర జహంగీర్, టిఆర్ఎస్ నాయకులు సూరగోని రవిగౌడ్, కొంపల్లి కరుణాకర్, జంబుల శ్రీనివాస్‌రెడ్డి, కావ్య దర్గయ్య, రజిత రమేష్, గణేష్, కనకయ్య, పోచబోయిన శ్రీహరి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.