కొనుగోళ్లు..పంటల నష్టాలపై సీఎం ఆరా
ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం కాగా గ్రామాల్లో సేకరణ కార్యక్రమం నిరంతరంగా సాగుతోంది. ఈ దశలో వ్యవసాయ శాఖపై సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లో సక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, వ్యవసాయ శాఖ కార్యదర్శి జనార్ధన్ రెడ్డి హాజరయ్యారు. ధాన్యం, వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లు, ఖరీఫ్ సన్నద్ధతపై సక్షిస్తున్నారు. ఖరీఫ్ అవసరాల కోసం ఎరువులు, విత్తనాలు సమకూర్చుకునే అంశంపై సీఎం చర్చిస్తున్నారు. మరోవైపు పంటలు చేతికొచ్చిన దశలో అకాల వర్షం రైతులను నిండా ముంచింది. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఈదురు గాలులు, వడగళ్లతో కూడిన వర్షం పడింది. కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఆరబెట్టుకున్న ధాన్యం తడిసిపోయింది. వర్షాలకు వరి పంటే కాదు.. మొక్కజొన్న, ఉల్లి, మిర్చి, కూరగాయల పంటలకు తీవ్రంగా నష్టం జరిగింది. నిజామాబాద్ జిల్లా మోపాల్, సిరికొండ, నిజామాబాద్ రూరల్, వర్ని, డిచ్పల్లి, నిజామాబాద్ నార్త్, ధర్పల్లి, భీమ్‌గల్ మండలాల పరిధిలో రోడ్లు, కల్లాల వద్ద ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయింది. నిర్మ) రైతులను నిండా ముంచింది. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఈదురు గాలులు, వడగళ్లతో కూడిన వర్షం పడింది. కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఆరబెట్టుకున్న ధాన్యం తడిసిపోయింది. వర్షాలకు వరి పంటే కాదు.. మొక్కజొన్న, ఉల్లి, మిర్చి, కూరగాయల పంటలకు తీవ్రంగా నష్టం జరిగింది. నిజామాబాద్ జిల్లా మోపాల్, సిరికొండ, నిజామాబాద్ రూరల్, వర్ని, డిచ్పల్లి, నిజామాబాద్ నార్త్, ధర్పల్లి, భీమ్‌గల్ మండలాల పరిధిలో రోడ్లు, కల్లాల వద్ద ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయింది.
జిల్లా కుంటాల మండలంలోని పలు గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన మొక్కజొన్న కుప్పలు తడిసిపోయాయి. కరీంనగర్ జిల్లాలోని 16మండలాల్లో 5వేల క్వింటాళ్ల ధాన్యం తడిపోయింది. పెద్దపల్లిలో 200 క్వింటాళ్ల ధాన్యం తడిసింది. రాష్ట్రంలో వేర్వేరు చోట్ల పిడుగుపాట్లకు నలుగురు మృతిచెందారు. సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలోని ఐకేపీ కొనుగోలు కేంద్రంలో రైతు ప్లలె శ్రీనివాస్ (52), నిజామాబాద్ జిల్లా మెట్టుమర్రితండాలో కేతావత్ శీల (40) అనే మహిళ, సిద్దిపేట జిల్లా దుబ్బాక మునిసిపాలిటీ చెల్లాపూర్‌లో మట్ట బుచ్చిరెడ్డి కామారెడ్డి జిల్లా గౌరారంలో లక్ష్మణ్(35) అనే వ్యక్తి పిడుగుపాటుకు గురై చనిపోయాడు. నస్రుల్లాబాద్ మండలం సంగెం గ్రామంలో పిడుగు పడి ట్రాన్స్ఫార్మర్ ధ్వంసమైంది సిద్దిపేట జిల్లా కోహెడ మండలం గుండారెడ్డి పల్లి గ్రామంలో పిడుగుపాటుకు గురై ఓ పాడి గేదె మృతి చెందింది. ఈ పరిస్థితులపైనా సిఎం చర్చించారు. ఇప్పటి వరకు ధాన్యం కొనుగోళ్ల తీరును ఆరా తీసారు. అలాగే అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలకు సంబంధించిన వివరాలను కూడా అడిగి తెలుసుకున్నారు.