లెఫ్టినెంట్ గవర్నర్ పాత్ర పరిమితమే
ప్రభుత్వ విధానాల మేరకు నడచుకోవాల్సిందే
అన్ని రాష్టాల్ల్రో ఉన్న మాదిరిగానే అధికారాలు
కేజ్రీవాల్ సర్కార్‌కు సుప్రీంలో భారీ ఊరట
అధికారలపై సుప్రీం ధర్మాసనం కీలక తీర్పు
:దిల్లీ పాలనా వ్యవహారాలపై ఇవాళ సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. ఎన్నికైన ప్రభుత్వానిదే అధికారమని విస్పష్ట తీర్పును ఇచ్చింది. దీంతో కేజ్రీవాల్ పెత్తనానికి కత్తెర వేస్తున్న లెఫ్టినెంట్ గవర్న్‌కు చెక్ పడనుంది. చాన్నాళ్లుగా ఢిల్లీ సర్కార్, ఆ రాష్ట్ర లెప్టినెంట్ గవర్నర్ మధ్య జరుగుతున్న వివాదానికి సుప్రీం బ్రేక్ వేసింది. ఈ కేసులో 2019 నాటి సింగిల్ జడ్జీ తీర్పుతో ఏకీభవించడం లేదని సుప్రీం ధర్మాసనం తెలిపింది. దిల్లీ ప్రభుత్వానికి అధికారాలు లేవన్న విషయాన్ని తాము అంగీకరించ బోమన్నది. దిల్లీ ప్రభుత్వం, ఎల్జీ మధ్య జరిగిన వివాదంపై జస్టిస్ అశోక్ భూషణ్ 2019లో తీర్పును వెలువరించారు. అయితే ఆ తీర్పును తాము అంగీకరించడం లేదని సీజేఐ డీవై చంద్రచూడ్ తెలిపారు. దీంతో సుప్రీంకోర్టులో కేజీవ్రాల్ ప్రభుత్వానికి భారీ విజయం దక్కింది. అధికారులను నియమించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నట్లు సుప్రీం తెలిపింది. ఇక అన్ని రాష్టాల్ర తరహాలోనే దిల్లీ లో పాలన ఉంటుందని సుప్రీం తెలిపింది. ల్యాండ్, పోలీస్, లాపై అధికారం కేంద్రానికి ఉంటుందని కోర్టు చెప్పింది. మిగిలి అన్ని అంశాలపై శాసనాధికారం దిల్లీ సర్కార్‌కు ఉంటుందని కోర్టు చెప్పింది. సీజేఐ చంద్రచూడ్ తీర్పును చదివి వినిపించారు. అయిదుగురు సభ్యుల ధర్మాసనం గురువారం ఏకగ్రీవ తీర్పును వెలువరించింది.రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనా వ్యవహారలను కేంద్ర సర్కార్ టేకోవర్ చేసుకోరాదని కూడా రాజ్యాంగ ధర్మాసనం తన తీర్పులో వెల్లడించింది.
ధర్మాసనంలో సీజేఐతో పాటు జస్టిస్ ఎంఆర్ షా, కృష్ణమురారీ, హిమా కోహ్లీ, పీఎస్ నర్సింహాలు ఉన్నారు. ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన ప్రభుత్వమే అధికారులపై నియంత్రణ కలిగి ఉండాలని, ఒకవేళ అలా ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన ప్రభుత్వానికి ఆఫీసర్లపై నియంత్రణ లేకుంటే, అప్పుడు ఆ సర్కార్ బాధ్యత సన్నగిల్లుతుందని కోర్టు చెప్పింది. ప్రభుత్వానికి ఆఫీసర్లు స్పందించకుంటే, అప్పుడు సమిష్ట బాధ్యత నీరుగారే అవకాశం ఉందని ధర్మాసనం తెలిపింది.దిల్లీ లెప్టినెంట్ గవర్నర్ – రాష్ట్ర ప్రభుత్వ అధికారాలపై సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. దిల్లీ పూర్తి అధికారం ప్రజా ప్రభుత్వానిదేనని సుప్రీం తేల్చి చెప్పింది. ప్రజల చేత ఎన్నుకున్న ప్రభుత్వం చేతుల్లోనే అధికారం ఉండాలని.. ఎల్జీ చేతుల్లో కాదని సుప్రీం స్పష్టం చేసింది. ప్రభుత్వాధికారులపై రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉండాలని.. లేదంటే తమను ఎవరూ తాకలేరన్న భావన అధికారుల్లో పెరుగు తుందని పేర్కొంది. తద్వారా జవాబుదారీతనం లేకుండా పోతుందని అభిప్రాయపడింది. నేషనల్ క్యాపిటల్ టెర్రిటరీ – దిల్లీ (దిల్లీ ప్రభుత్వం) మిగతా రాష్టాల్లో ప్రభుత్వం మాదిరిగానే భావించాలని సుప్రీం స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వ అధికారాలను విస్తరించడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని తీర్పులో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. మొత్తానికి దిల్లీ సీఎం అరవింద్ కేజీవ్రాల్‌కి ఈ తీర్పుతో ఊరట లభించింది.