Take a fresh look at your lifestyle.

కొరోనా కనుమరుగుకు అవకాశం.. నేడు ఖగోళ అద్భుతం,

  • ఉ. 9.16 నుండి మ. 3.04 వరకు గ్రహణం
  • గ్రహణాన్ని సోలార్ అద్దాల ద్వారా చూడాలి
  • గుజరాత్ లో మొదటి గ్రహణం చూస్తాం
  • మూఢ నమ్మకాలను ప్రోత్సహించవద్దు
  • ప్లానెట్ సొసైటీ ఆఫ్ ఇండియా

రేపు విశ్వవ్యాప్తంగా ఏర్పడే సూర్య గ్రహణం వల్ల ఖగోళంలో అద్భుత సంఘటన చూడబోతున్నామని ప్లానెట్ సొసైటీ ఆఫ్ ఇండియా తెలియజేసింది. ఈ మేరకు శనివారం హైదర్ గూడ ఎన్ఎస్ఎస్ సెంటర్లో సూర్య గ్రహణంపై అవగాహన కల్పించేందుకు సైంటిస్ట్ రఘునందన్ మాట్లాడుతూ ఉదయం 9.16గం.ల నుండి మధ్యాహ్నం 3.04 గం.ల వరకు గ్రహణం ఉంటుందన్నారు. ఇది పూర్తిస్థాయి వలయాకార సూర్య గ్రహణం అని తెలిపారు.

మన దేశంలో గుజరాత్ లో మొదటి గ్రహణం చూస్తామన్నారు. గ్రహణం వల్ల ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయనే అపోహలను నమ్మవద్దన్నారు. అలాగే గ్రహణం సమయంలో తినకూడతూ, మహిళలు బయటకు రాకూడదు చేతబడి, బలి ఇవ్వడం వంటి ఆచారాలను ప్రోత్సహించరాదన్నారు. అలాంటి వారిని శిక్షించాలన్నారు. గ్రహణం కారణంగా అతినీలలోహిత, ఆల్ఫా, బీటా కిరణాలు భూమి మీద పడటం వల్ల 0.01%  కరోనా వైరస్ చనిపోయే అవకాశం ఉందన్నారు. గ్రహణాన్ని డైరెక్ట్ గా చూడకుండ సోలార్ పేపర్ కాని సోలార్ అద్దాల ద్వారా చూడాలన్నారు.

Leave a Reply