Take a fresh look at your lifestyle.

ఎన్‌కౌంటర్లు జరిపి నిందితుల్ని చంపడం ప్రభుత్వం పాలసీగా పెట్టుకుందా?

ఎనిమిది  రోజుల క్రితం ఎల్‌బినగర్‌ ‌దగ్గరలోని సింగరేణి కాలనీలో అత్యాచారానికి, హత్యకు గురైన బాలిక విషయంలో తెలంగాణ రాష్ట్ర మంత్రులు బాధ్యతారాహిత్యంతో, ఇష్టం వచ్చినరీతిలో మాట్లాడారు.. రాష్ట్ర మునిసిపల్‌ ‌శాఖ మంత్రి, కె. తారకరామారావు, సింగరేణి కాలనీలో బాలిక అత్యాచారం విషయంలో అనుమానితున్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నార అని ‘ట్వీట్‌’ ‌లో ఒక మెసేజ్‌ ‌ను పంపించాడు. పోలీసులు ఇంకా ఎవ్వరిని అరెస్టు చేయలేదని ప్రకటించడంతో పొరపాటు జరిగిందని నాలుక కరచుకున్నాడని పత్రికలో వార్త వచ్చింది. తెలంగాణ రాష్ట్ర కార్మిక, ఉద్యోగ శాఖ మంత్రి  చామకూరు మాల్లారెడ్డి,  మేడ్‌చల్‌లో టీఆర్‌ఎస్‌ ‌పార్టీ ఆఫీసులో పార్టీ శ్రేనులను ఉద్దేశించి మాట్లాడుతూ, అత్యాచారానికి పాలుపడ్డ నిందుతుడిని ‘ఎన్‌కౌంటర్‌’‌లో చంపేస్తామని ప్రకటన చేసాడు. ఈ వార్త అన్ని పత్రికల్లో ప్రచురితమైంది.
హక్కుల సంఘాలు నక్సలైట్లపై నిర్బంధం, అణిచివేత ప్రారంభం అయినప్పటి నుండి ‘ఎన్‌కౌంటర్‌’‌లో కాల్చి చంపడం ప్రభుత్వాలు పాలసీగా పెట్టుకున్నాయని ఈ విషయంలో పోలీసులపై ఏమీ చర్యలు ఉండవని ( ×వీ•ఖచీו• )  హామీ ఇచ్చి ఎన్‌కౌంటర్‌ ‌పేరుతో చట్ట వ్యతిరేకంగా కాల్చి చంపుతున్న పోలీసుల పట్ల చాలా ఉదాసీనంగా వ్యవహరిస్తూన్నామని అంటూ వస్తున్నారు. ఎన్‌కౌంటర్‌ ఉం‌డవని ముఖ్యమంత్రి ప్రకటించిన సందర్భాలలో ఎన్‌కౌంటర్లు ఆగిపోయాయి. తెలంగాణ ప్రభుత్వం, నూతన తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేపట్టిన కొద్ది మాసాలకు హక్కుల సంఘాల భార్యలు ముఖ్యమంత్రిని కలిసి,ఎన్‌కౌంటర్ల చరిత్ర…..లో వారితో చర్చించి, ‘‘ఎన్‌కౌంటర్లు’’ తెలంగాణ రాష్ట్రంలో విధానపరంగా కొనసాగవని ప్రకటన చేయమని కోరడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తానని అన్నారని కాని ఎటువంటి ప్రకటన చేయలేదు. రాష్ట్రం ఏర్పడ్డ తరువాత పాతపద్దలోనే ఎన్‌కౌంటర్స్ ‌ప్రారంభం అయినాయి. ఇప్పటి వరకు జరిగిన తొమ్మిది ఎన్‌కౌంటర్‌ ‌సంఘటనల్లో ముప్పైమూడు మంది కాల్చి చంపబడ్డారు.

ఏ ఒక్క  సంఘనలోనూ విచారణ జరగలేదు. అలేరు దగ్గర నాలుగేళ్లక్రితం జరిగిన ఎన్‌కౌంటర్‌లో జైలు నుంచి కోర్టుకు తీసుకెళ్తున్న అయిదుగురు ముస్లిం యువకులు,బేడీలతోనే ఎన్‌కౌంటర్‌ ‌చేయబడ్డారు. ప్రభుత్వం ఈ సంఘటనపై ప్రత్యేక విచారణ కమిటీ (సిట్‌ ) ‌ను నియమించింది. ఈ రోజు వరకు కూడా ‘సిట్‌’ ‌విచారణ పూర్తి చేసి నివేదిక బయటపెట్టలేదు.
2019, డిసెంబర్‌ ‌లో నగరం బయట జరిగిన ‘దిశ’ అత్యాచార సంఘటన సందర్భంగా జరిగిన ఎన్‌కౌంటర్‌ ‌హత్యలపై, హక్కుల సంఘాల అభ్యర్థన మేరకు, సుప్రీంకోర్టు విచారణ కమిషన్‌ను నియమించింది. ఆ విచారణ గత రెండు వారాలుగా హైకోర్టు ప్రాంగణంలో జరుతుంది. ఈ సమయంలో మంత్రి  అత్యా చార నిందితున్ని ఎన్‌కౌంటర్‌ ‌చేసి చంపేస్తాం, అని చాలా ఆగ్రహంతో ప్రకటించడంతో విషయాలు పూర్తిగా తేటతెల్లమయినట్టుగా భావించవలసి వస్తుంది. ఇటువంటి సంఘటనల్లో నేరగాళ్ళను తెలంగాణ ప్రభుత్వం వదిలిపెట్టదు అని కూడా వక్కాణించారు.

అంటే ప్రభుత్వం ఎన్‌కౌంటర్లు చేసి నిందితుల్ని, అనుమానితుల్ని,  ఉద్యమకారుల్ని హత్యచేయడం ఒక పాలసీగా పెట్టుకుందని అర్థం చేసుకోవలసి వస్తుంది. ఇంత కాలం జరిగిన ఎన్‌కౌంటర్లు అన్నికూడా ప్రభుత్వ పాలనా విధానంలో భాగంగా జరిగాయని కార్మిక శాఖ మంత్రి  ప్రకటన ద్వారా అర్ధం అవుతుంది.
అంటే ప్రభుత్వం న్యాయస్థానాలు, చట్టాలు, రాజ్యాంగ పద్దతులు అన్నింటిని పక్కకు తోసేసి తానే న్యాయస్థానంగా శిక్షవేసే  అధికారిగా, శిక్ష అమలు చేసే వ్యవస్థగా పనిచేయాలని భావిస్తున్నట్టుగా అనుకోవలసి వస్తుంది.

రాష్ట్ర కార్మికశాఖ మంత్రి ముఖ్యమంత్రిని, హోంమంత్రిని పూర్తిగా పక్కనపెట్టి, పోలీసులకు ఎన్‌కౌంటర్లు చేయడానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్టే.
ఇంత దురుసుగా చట్టవ్యతిరేకంగా ప్రజాస్వామిక పద్ధతిలో రాజ్యాంగా బద్దంగా ఎన్నికై, మంత్రిగా కొనసాగుతున్న మంత్రి విషయంలో ప్రభుత్వం, ప్రభుత్వాన్ని నడిపిస్తున్న పార్టీ వర్గాలు ఏం ఆలోచిస్తున్నాయో తెలుసుకోవాలని ప్రజలు అనుకుంటున్నారు.

రాజ్యా స్వభావంలోంచి వెలువడ్డ అహంకారాన్ని పుణికిపుచ్చుకుని జవాబుదారితనం కొరవడి ప్రవర్తిస్తున్న కార్మిక శాఖ మంత్రి విషయంలో ఏం చర్యలు తీసుకుంటారో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారే స్వయంగా ప్రకటన చేయాలని ప్రజాస్వామిక వాదులు కోరుతున్నారు.

– యస్‌. ‌జీవన్‌కుమార్‌,
‌మానవహక్కుల వేదిక..

Leave a Reply