Take a fresh look at your lifestyle.

‌గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు

జిల్లా ఎస్పీ సునీల్‌ ‌దత్‌ ఆదేశాల మేరకు జిల్లావ్యాప్తంగా చేపడుతున్న వాహన తనిఖీలలో భాగంగా బుధవారం ట్రైనీ ఐపీఎస్‌ ‌రోహిత్‌ ‌రాజు లక్ష్మీదేవిపల్లి పోలీస్‌ ‌స్టేషన్‌ ‌పరిధిలోని ఇల్లందు క్రాస్‌ ‌రోడ్డు వద్ద బుధవారం ఉదయం వాహన తనిఖీలు చేస్తుండగా మారుతి స్విఫ్ట్ ‌వాహనంలో గంజాయిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

పట్టుబడ్డ వీరి వద్ద నుంచి 27కేజీల గంజాయిని,62,000/-రూపాయల నగదును స్వాధీన పరుచుకున్నారు. దీని విలువ సుమారుగా 2,70,000/- రూపాయలు ఉంటుందని ట్రైనీ ఐపీఎస్‌ ‌రోహిత్‌ ‌రాజు తెలిపారు.పాల్వంచ వైపు నుండి ఇల్లందు క్రాస్‌ ‌రోడ్డు మీదుగా ఇల్లందు వైపు వెళ్తున్న మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన దినేష్‌ ‌నాగునాధ్‌ ‌సపాటి,విక్రమ్‌ ‌శరత్‌ ‌భోస్లే అను ఇద్దరు వ్యక్తులు ఈ గంజాయిని తరలిస్తున్నట్లుగా వెల్లడించారు. పట్టుబడిన వీరిపై కేసు నమోదు చేసి రిమాండ్‌ ‌నిమిత్తం కోర్టునకు పంపించడం జరిగిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో చుంచుపల్లి సీఐ అశోక్‌ ‌మరియు సిబ్బంది పాల్గోన్నారు.

Leave a Reply