
- ఇసుక మాఫియాకు అడ్డు తగులుతున్నాడని హత్య
- నిందితులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి రిమాండుకు తరలింపు
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం లింగరాజుపల్లి గ్రామంలో ఇటీవల ఎమ్మా ర్పీఎస్ రాష్ట్ర నాయకుడు చాట్ల పాండును హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఇసుక మాఫియాకు అడ్డు తగులుతున్నాడనే నేపంతో కాపు కాసి మాటు వేసి చాట్ల పాండును హత్య చేసినట్లు నేరుస్తులు అంగీకరిం చారని భువనగిరి డిప్యూటీ పోలీస్ కమిషనర్ (డీసీపీ) నారాయణ రెడ్డి మీడియాకు సోమవారం నాడు వెల్లడించారు. నేరస్థులు ఇద్దరు వలిగొండ మండలం లింగరాజుపల్లి గ్రామానికి చెందిన ఎ-1 బొడిగే రవీంద-2 నీళ్ల నరేష్‌లుగా గుర్తించడం జరిగిందన్నారు. ఇద్దరు నిందితుల్లో ఒకరు లారీ డ్రైవర్, మరొకరు ట్రాక్టర్ డ్రైవర్ వృత్తి చేస్తుంటారని చెప్పారు.
వీరు పాత నేరస్థులని ఇరువురి పై గతంలో 2006, 2009లో కూడా ఇసుక అక్రమ రవాణా కేసులున్నాయని తెలిపారు. నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి రిమాండుకు తిరలించడం జరిగిం దన్నారు. ఈ సమావేశంలో చౌటుప్పల్ ఏసిపి కె.సత్తయ్య, రామన్నపేట సిఐ ఏవి రంగా, ఎస్‌ఐలు శివనాగప్రసాద్, సిహెచ్ సాయిలు తదితరులు ఉన్నారు.