Take a fresh look at your lifestyle.

పోలీసులు ప్రజలకు సత్వర న్యాయం అందించాలి

  • తెలంగాణ ఫ్రెండ్లీ పోలీస్‌  ‌దేశానికే ఆదర్శం
  • దేశంలోనే అత్యధిక సిసి కెమెరాలున్న  రాష్ట్రం
  • జిల్లా ప్రధాన రహదారిపై ముఖ్యమైన పోలీస్‌ ‌స్టేషన్‌
  • త్రీ టౌన్‌ ‌పోలీస్‌ ‌స్టేషన్‌ ‌ప్రారంభోత్సవంలో మంత్రి హరీష్‌రావు

సిద్దిపేట శరవేగంగా అభివృద్ధి చెందుతున్న సమయంలో పెరుగుతున్న జనాభా దృష్ట్యా 3వ(త్రీ టౌన్‌)‌టౌన్‌ ‌పోలీస్‌ ‌స్టేషన్‌ ఏర్పాటుతో మరింత భద్రత రక్షణ ఉంటుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు.  జిల్లా కేంద్రమైన సిద్దిపేట అర్బన్‌ ‌మండలం పొన్నాల పరిధి(బక్రిచెప్యాల చౌరస్తా)లో మూడవ పట్టణ పోలీస్‌ ‌స్టేషన్‌ను సోమవారం పోలీస్‌ ‌కమిషనర్‌ ‌జోయల్‌ ‌డేవిస్‌తో కలిసి మంత్రి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. గతంలో ముఖ్యమంత్రి సిద్దిపేటకు వచ్చినప్పుడు మూడవ పట్టణ పోలీస్‌ ‌స్టేషన్‌ ‌మంజూరు చేయాలని కోరగా వెంటనే అనుమతించడంతో ప్రస్తుతం ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. జిల్లా ఏర్పాటైన  తర్వాత అన్ని జిల్లా కార్యాలయాలు ఏర్పాటు చేసుకోవడం, ముంపు గ్రామాల ప్రజలు సిద్దిపేట పరిసర ప్రాంతాలకు నివాసానికి రావడం భవిష్యత్తులో మరిన్ని పరిశ్రమలు, రైల్వే లైన్‌ ఏర్పాటుతో జిల్లా పురోభివృద్ధి వైపు పయనిస్తుందన్నారు. రెండు లక్షల జనాభా దాటి పోతుండడంతో ప్రజలకు మరింత మెరుగైన భద్రత రక్షణ అందించటానికి త్రీ టౌన్‌ ‌పోలీస్‌ ‌స్టేషన్‌ ఎం‌తో ఉపయోగపడుతుందన్నారు.జిల్లాలోనే ఇది ముఖ్యమైన పోలీస్‌ ‌స్టేషన్‌ అని  కలెక్టరేట్‌, ‌కమిషనరేట్‌, ‌రెండు  మెడికల్‌ ‌కళాశాలలు, పరిశ్రమలు, ఆక్సిజన్‌ ‌పార్క్, ‌జిల్లా కోర్ట్ ,‌టోల్‌ ‌ప్లాజా, ఐటి హబ్‌, ఎల్వి ప్రసాద్‌ ‌కంటి ఆస్పత్రి త్రీ టౌన్‌ ‌పోలీస్‌ ‌స్టేషన్‌ ‌పరిధిలోకి వస్తాయని తెలిపారు. రాజీవ్‌ ‌రహదారిపై పోలీస్‌ ‌స్టేషన్‌ ఏర్పాటుతో ప్రమాదాలకు చెక్‌ ‌పెట్టడంతో పాటు క్లోజ్‌ ‌మానిటరింగ్‌ ఉం‌టుందని తెలిపారు. తెలంగాణ పోలీస్‌ ‌వ్యవస్థ రాష్ట్రానికి ఆదర్శంగా ఉందని రాష్ట్రంలో ప్రస్తుతం ఫ్రెండ్లీ పోలీస్‌ ‌విధానం నడుస్తోందని తెలిపారు. పోలీసులు ప్రజలలో భాగస్వాములు అవుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ సత్వర న్యాయం చేయాలని సూచించారు. ఇండియాలోనే అత్యధిక సిసి కెమెరాలు వాడుతున్న రాష్ట్రంగా తెలంగాణ ఉందని సిద్దిపేట జిల్లాలో 7 కోట్ల రూపాయలతో సిసి కెమెరాల ఏర్పాటు చేశామని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో క్రైమ్‌ ‌రేటు తగ్గిందని గుర్తుచేశారు. సిసి కెమెరాల ఆధారంగా ఇప్పటికి ఎన్నో కేసులు పరిష్కరించడం జరిగిందని క్లిష్టమైన కేసులలో సిసి కెమెరాల ఆధారాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. భవిష్యత్తులో ఉమెన్‌ ‌పోలీస్‌ ‌స్టేషన్‌, ‌భరోసా కేంద్రం ,సఖి కేంద్రం, చైల్డ్ ‌ఫ్రెండ్లీ  కోర్ట్, ‌షీ టీం అన్నీ ఒకే చోట  సకల వసతులు ఉండేలా ఏర్పాటు చేస్తామని తెలిపారు. సిద్దిపేట అర్బన్‌ ‌మండలంలోని మొత్తం గ్రామాలు, కొండపాక మండలంలోని కొన్ని గ్రామాలు త్రీటౌన్‌ ‌పరిధిలోకి వస్తాయని స్టేషన్‌ ‌పరిధిలో సర్కిల్‌ ఇన్స్పెక్టర్‌ ‌తో పాటు 57 మంది సిబ్బంది విధులు నిర్వహించనున్నట్లు తెలిపారు. త్రీ టౌన్‌ ‌పోలీస్‌ ‌స్టేషన్‌లో సిఐగా బాధ్యతలు తీసుకున్న ప్రవీణ్‌ ‌కుమార్‌ను మంత్రి హరీష్‌రావు అభినందించారు.


ప్రజల రక్షణ సెన్సాఫ్‌ ‌సెక్యూరిటీ గురించి పోలీస్‌ ‌స్టేషన్‌ : ‌పోలీస్‌ ‌కమిషనర్‌
‌ప్రజల రక్షణ సెన్సాఫ్‌ ‌సెక్యూరిటీ గురించి పోలీస్‌ ‌స్టేషన్‌ ఏర్పాటు చేయడం జరిగిందనీ పోలీస్‌ ‌కమిషనర్‌ ‌జోయల్‌ ‌డేవిస్‌ అన్నారు. నూతన పోలీస్‌ ‌స్టేషన్‌ ‌మూడు మండలాల పరిధిలోని గ్రామాలను కలిపి ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సిద్దిపేట అర్బన్‌  ‌మండలంలోని గ్రామాలు, సిద్దిపేట రూరల్‌ ‌పోలీస్‌ ‌స్టేషన్‌ ‌పరిధిలో ఉన్న గ్రామాలు రంగధాంపల్లి, మిట్టపల్లి, ఎల్లుపల్లి , బక్రీచేప్యాల, నాంచారు పల్లి, ఎన్సాన్‌పల్లి, పొన్నాల, కిష్టసాగర్‌, ‌తడకపల్లి, బొగ్గులోనిబండ, రాగోపాల్‌పేట పోలీస్‌ ‌స్టేషన్‌ ‌పరిధిలోని వెల్కటూర్‌, ‌కుకునూర్‌పల్లి పోలీస్‌ ‌స్టేషన్‌ ‌పరిధిలోని దుద్దెడ, దర్గా బంధారం, అంక్కిరెడ్డిపల్లి, దోమలపల్లి, తొగుట పోలీస్‌ ‌స్టేషన్‌ ‌పరిధిలోని ఖమ్మంపల్లి, రాంపల్లి, సిరసనగండ్ల, మర్పడగ గ్రామాలు కొత్తగా ఏర్పడిన త్రీ టౌన్‌ ‌పరిధిలోకి వస్తాయని తెలిపారు.  


ఈ మేరకు ప్రస్తుత పోలీసు కన్వెన్షన్‌ ‌హాల్‌, ‌డైనింగ్‌ ‌హాల్‌ ‌నిర్మాణ పనులను  సిపి, ఏసిపిలతో కలిసి  మంత్రి హరీష్‌రావు క్షే•త్రస్థాయిలో పరిశీలించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అటవీ భివృద్ధి సంస్థ ఛైర్మన్‌ ‌వంటేరు ప్రతాప్‌రెడ్డి, జిల్లా పరిషత్‌ ‌ఛైర్‌పర్సన్‌ ‌వేలేటి రోజా రాధాకృష్ణశర్మ, మునిసిపల్‌ ‌ఛైర్మన్‌ ‌కడవేర్గు రాజనర్సు, సుడా ఛైర్మన్‌ ‌మారెడ్డి రవీందర్‌రెడ్డి,  ఏఆర్‌ ‌డిసిపి బాపురావు, అడిషనల్‌ ఏఆర్‌ అడిషనల్‌ ‌డిసిపి రియాజ్‌ ఉల్‌ ‌హాక్‌, అడిషనల్‌ ‌డిసిపి అడ్మిన్‌ ‌శ్రీనివాసులు, సిద్దిపేట ఏసిపి రామేశ్వర్‌, ‌గజ్వేల్‌ ఏసిపి  నారాయణ, హుస్నాబాద్‌ ఏసిపి  మహేందర్‌, ‌ట్రాఫిక్‌ ఏసిపి సైదులు, ఎస్బి ఏసిపి రవీందర్‌ ‌రాజు, సిద్దిపేట రూరల్‌ ‌సిఐ సురేందర్‌ ‌రెడ్డి, టూటౌన్‌ ‌సిఐ పర్షరాంగౌడ్‌, ‌వన్‌ ‌టౌన్‌ ‌సిఐ శ్రీనివాస్‌, ‌దుబ్బాక సిఐ హరికృష్ణ గౌడ్‌, ‌తొగుట సిఐ రవీందర్‌, ‌జడ్పిటిసి సభ్యురాలు ప్రవళిక, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు దేవునూరి రవీందర్‌, ‌సభ్యుడు ప్రకాష్‌, ‌పొన్నాల గ్రామ సర్పంచి రేణుక శ్రీనివాస్‌ ‌పోలీస్‌ ‌సిబ్బంది, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a Reply