Take a fresh look at your lifestyle.

పోలీసుల సేవలు అభినందనీయం

తాండూర్‌, ‌మే 13, ప్రజాతంత్ర విలేఖరి : కరోనా వైరస్‌ ‌కట్టడి నేపథ్యంలో భాగంగా అలుపెరుగక నేటికి ప్రజా రక్షణ కొరకు తమ విధులను బాధ్యతయుతంగా నిర్వహిస్తునే ఉన్నారు. సుమారు 50 రోజులుగా రాత్రి పగలు అనే తేడా లేకుండా నిర్విరామంగా పనిచేస్తు న్నారు. లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చినప్పటి నుండి మంచిర్యాల జిల్లా సరిహద్దు ప్రాంతమైన తాండూరు మండలం ఐబి కేంద్రంలోని చెక్‌పోస్ట్ ‌వద్ద కుటుంబాలకు దూరంగా ఉంటూనే విధుల్లో నిమగ్నమవుతున్నా రు. ఒకవైపు తమ విధులను నిర్వహిస్తునే మరోవైపు నిరుపేదల కో సం ఎన్నో సేవా కార్యక్రమాలను కూడా చేపట్టడం జరిగింది. ప్రజల ప్రాణాల రక్షణ కొరకు వారి ప్రాణలను ఫనంగా పెట్టి విధులు నిర్వహి స్తున్న రక్షక భటులసేవలు నేటికి కొనసాగుతూనే ఉన్నాయి.

ఈచెక్‌పోస్ట్ ‌వద్ద తాండూర్‌ ‌సిఐ ఉపేందర్‌, ఎస్సైలు శేఖర్‌ ‌రెడ్డి, కొమురయ్య, మానస, ప్రశాంత్‌ ‌రెడ్డితో పాటు ఏఎస్సైలు, హెడ్‌ ‌కానిస్టేబుల్లు, కానిస్టేబుల్లు, హోంగార్డులు నిర్విరామంగా తమ విధులను నిర్వహిస్తు న్నారు. రామగుండం సిపి సత్యనారాయణ, మంచిర్యాల డిసిపి ఉద య్‌ ‌కుమార్‌ ‌రెడ్డి, బెల్లంపల్లి ఎసిపి రెహమాన్‌లు జిల్లా సరిహద్దు చెక్‌ ‌పోస్ట్‌ను తనిఖీలు నిర్వహిస్తునే ఉన్నారు. కరోనా వ్యాప్తి చెందకుండా మనరక్షణ కొరకు పని చేస్తున్న వారి సేవలకు అభినందలు.

Leave a Reply