న్యూదిల్లీ,జనవరి6 : న్యూఇయర్ తెల్లవారుజామున సుల్తాన్‌పురి నుంచి కాంఝవాలా వరకు 12 కిలోటర్ల మేర కారు స్కూటర్ని ఈడ్చుకెళ్లిన ఘనటలో 20 ఏళ్ల యువతి అంజలి మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు పాల్పడిన ఐదుగురు వ్యక్తుల్ని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనలో మరో నిందితుడైన ఆరో వ్యక్తి అశుతోషని పోలీసులు అరెస్టు చేసినట్టు అధికారులు శుక్రవారం తెలిపారు. ఈ కేసులో పోలీసులకు తప్పుడు సమాచారమందించిన అశుతోష్‌ని అరెస్టు చేశామని, తదుపరి విచారణ కొనసాగుతోందని స్పెషల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సాగర్ ప్రీత్ హుడా తెలిపారు. ఈ కేసులో ఇంతకుముందు అరెస్టయిన ఐదుగురు నిందితులు అశుతోష్ నుండి కారును అరువుగా తీసుకున్నారు.
ఈ ఘటనలో నిందితులను రక్షించేందుకు ప్రయత్నించిన మరో ఇద్దరిని వెతుకుతున్నట్లు పోలీసులు గురువారం వెల్లడించారు. అయితే, ఈ ఘటనలోని నిందితులు దీపక్ ఖన్నా (26), అమిత్ ఖన్నా (25), క్రిషన్ (27), మిథున్ (26), మనోజ్ మిట్టల్‌లను పోలీసులు అరెస్టు చేశారు. సీసీటీవీ ఫుటేజీ, కాల్ రికార్డులను పరిశీలించిన తర్వాత మరో ఇద్దరు నిందితులు..ఐదుగురు నిందితులను కాపాడే ప్రయత్నంలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ ఇద్దరు నిందితులు అశుతోష్, అంకుష్ ఖన్నాగా పోలీసులు గుర్తించారు. కాగా, అంకుష్.. నిందితుడు అమిత్ఖన్నాకు సోదరుడు. ఈ ఘటనలో కారు నడిపిన అమిత్ఖన్నాకు డ్రైవింగ్ లైసెన్స్ లేదు. కారు ప్రమాదం జరిగిన తర్వాత అమిత్ సోదరుడు.. అంకుష్‌కి సమాచారమివ్వగా.. ఆ నేరాన్ని దీపక్ అనే గ్రాణ సేవా డ్రైవర్‌పై మోపినట్లు పోలీసులు చెప్పారు.