తెలంగాణ రాష్ట్రంలో పోలీసులు అతిగా ప్రవరిస్తున్నారని, సీఎం కేసీఆర్‌కు తొత్తుగా వ్యవహరిస్తున్నారని బిజెపి రాష్ట్ర అద్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు.జనగామలో బిజెపి ప్లెక్సీలను కావాలని కమీషనర్ సమ్మయ్య తొలగించారని, ఎందుకు తొలగించారని కమీషనర్ చాంబర్ వద్ద నిరసన వ్యక్తం చేస్తుంటే బిజెపి నాయకులపై పోలీసులు లాఠీచార్జి చేయడం ఇదెక్కడి న్యాయమంటూ ఆయన ప్రశ్నించారు.ఆస్పత్రిలో ఉన్న బిజెపి శ్రేణులను పరామర్శించేందుకు జనగామకు వచ్చిన రాష్ట్ర అధ్యక్షుడితో పాటు స్దానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున్న పాల్గొని ఆర్టీసీ చౌరస్తా నుండి జిల్లా ఆస్పత్రి వరకు ర్యాలీ నిర్వహించారు.ఆస్పత్రిలో నాయకులతో మాట్లాడి అనంతరం విలేఖర్లతో ఆయన మాట్లాడారు.
విచక్షణా రహితంగా బిజెపి నాయకులపై పోలీసులు దాడులు చేయడం, అనంతరం స్టేషన్లోకి తీసుకువెల్లి తీవ్రంగా దూషించడం సరియైంది కాదన్నారు.సీఎం కేసీఆర్ అంబేడ్కర్, వివేకానంద జయంతిలకు రానేరాడని, కేవలం ఫాంహౌస్‌కు మాత్రమే పరిమితమేనన్నారు.బిజెపి బలపడుతున్న జిల్లాలలో పోలీసులు తమ శ్రేణులపై దాడులు చేయడం జరుగుతుందన్నారు.సీఎం కొడుకును కొట్టిస్తే ఆ బాదేందో తెలుస్తుందన్నారు.సీఎం కేసీఆర్ నోట్లో బెల్లం పెట్టుకుని ఉన్నాడ, కేంద్రం పైసల గురించి ముత్తిరెడ్డి మీ సీఎం ను అడిగితే తెలుస్తుంది.అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.కార్యకర్తలను కొడితే చూస్తూ ఊరుకోమని, అవసరమనుకుంటే సీఎం కేసీఆర్ పాలనకు సమాది కడతామన్నారు.వెంటనే బాద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ర్యాలీలో రాష్ట్ర నాయకులు గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి,రావు పద్మ, గుండె విజయరామారావు, మాదాడి వెంకటేష్, ఆరుట్ల దశమంత్‌రెడ్డి, రాకేష్‌రెడ్డి, కేవిఎల్ఎన్ రెడ్డి,గాడిపెళ్లి ప్రేమలతారెడ్డి, మహంకాళి హరిచ్చందగుప్త, సౌడరమేష్, గుజ్జుల నారాయణ,తదితరులు పాల్గొన్నారు.