వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

‌ప్రజల రక్షణ కోసం పోలీసులు ఎల్లప్పుడూ సిద్ధం: సిపి

January 18, 2020

The police are always prepared for the protection of the public CP

వరంగల్‌ ‌క్రైం, జనవరి 17, (ప్రజాతంత్ర విలేకరి) : సమాజం లోని ప్రజల రక్షణ కోసం పోలీ సులు నిరంతరం శ్రమిస్తూ ప్రాణ త్యాగాలకు సైతం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారని వరంగల్‌ ‌పోలీస్‌ ‌కమిషనర్‌ ‌డాక్టర్‌ ‌రవీందర్‌ ‌తెలిపారు. మడికొండలోని పోలీస్‌ ‌శిక్షణ కేంద్రంలో కొత్తగా ఎంపికైన కానిస్టేబుళ్ళ 9నెలల శిక్షణా తరగతుల ప్రారంభోత్సవ కార్యక్ర మాన్ని శుక్రవారం పోలీస్‌ ‌కమి షనర్‌ ‌జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం పోలీస్‌ ‌కమిషనర్‌ ‌మాట్లాడుతూ 9 నెలల శిక్షణలో ఎంపికైన 264 హైదరాబాద్‌కు చెందిన ట్రైనీ కానిస్టేబుల్‌కు ఫిజికల్‌ ‌ఫిట్‌నెస్‌, ‌డ్రిల్‌, ‌పోలీసులు వినియోగించే ఆయుధాల పనితీరు, రోజువారి విధులు, చట్టాలపై అవగాహన, పోలీస్‌ ‌టెక్నాలజీతో పాటు, నీతి నిజాయితీతో విధులు నిర్వహిస్తూ ప్రజలకు నిస్వార్థంగా సేవలు ఎలా అందించాలనే అంశాలపై శిక్షణ అందజేయడం జరుగుతుందన్నారు. ప్రజలకు ప్రత్యక్షంగా సేవలందించే అవకాశం కేవలం పోలీసులకు మాత్రమే ఉందన్నారు. ఇలాంటి శాఖలో చేరిన మీ అందరికీ అభినందనలని, శిక్షణ వచ్చిన వారిలో 20 మందికి పైగా పోస్ట్ ‌గ్రాడ్యుయేట్‌ ‌చదివారని, మరో 200 మంది డిగ్రీ పూర్తి చేసినవారు ఉన్నారన్నారు.

warangal crime, cp dr ravindar,acp jithendar, east zone dcp nagarajuముఖ్యంగా ఉన్నత చదువులు చదివిన కానిస్టేబుళ్ళకు ఈ శాఖలో సైబర్‌ ‌క్రైం, ఐటితో పాటు ఎన్నో విభాగాల్లో పనిచేసేందుకు అవకాశాలున్నాయన్నారు. మీలోని ప్రతిభను బట్టి ఈ పోలీస్‌ ‌శాఖలో ఉన్నత శిఖరాలకు అందుకునే అవకాశాలు ఎక్కువని, శిక్షణ సమయంలో ప్రతి అంశంలో అందజేసే శిక్షణను అందిబుచ్చుకొని నైపుణ్యంతో కూడిన పోలీస్‌ అధికారిగా సమాజంలోకి అడుగు పెట్టాలన్నారు. అనంతరం నూతనంగా రూపొందించబడిన పోలీస్‌ ‌వాచకాన్ని పోలీస్‌ ‌కమిషనర్‌ ‌చేతుల మీదుగా ఆవిష్కరించి ట్రైనీ కానిస్టేబుళ్ళకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఈస్ట్‌జోన్‌ ‌డిసిపి నాగరాజు, శిక్షణా కేంద్రం ప్రిన్సిపాల్‌ ‌మురళీధర్‌, అదనపు డిసిపిలు వెంకటలక్ష్మి, మల్లారెడ్డి, గిరిరాజు, వైస్‌ ‌ప్రిన్సిపాల్‌ ‌సాంబయ్య, ఏసిపిలు జితేందర్‌రెడ్డి, రవీందర్‌కుమార్‌, ‌సారంగపాణి, సిటిసి ఇన్స్‌పెక్టర్లు రామ్మూర్తి, సీతారెడ్డి, మడికొండ ఇన్స్‌పెక్టర్‌ ‌జాన్‌ ‌నర్సింహులుతో పాటు శిక్షణా కేంద్రం అవుట్‌డోర్‌, ఇం‌డోర్‌ ‌శిక్షణ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Tags: warangal crime, cp dr ravindar,acp jithendar, east zone dcp nagaraju