Take a fresh look at your lifestyle.

జిఓతో బాబును అడ్డుకోవాలన్న ప్లాన్‌ ‌ఫెయిల్‌

  • కుప్పంలో చంద్రబాబును అడ్డుకోలేక పోయిన పోలీస్‌
  • ‌వరుసగా మూడ్రోజులు దూకుడు ప్రదర్శించిన బాబు
చిత్తూరు,జనవరి7: జివో నంబర్‌ 1‌తో టిడిపిని అడ్డుకోవాలన్న అధికార వైసిపికి ఎదురీత తప్పడం లేదు. ఈ జీవోకు వ్యతిరేకంగా ఇప్పుడు అంతా ఏకమై ఉద్యమిస్తున్నారు. ప్రజల స్వేచ్ఛను కాలరాస్తున్నా రంటూ..జివోను ఎత్తేయాలని ఆందోళనలు సాగుతున్నాయి. టిడిపి కూడా ఆందోళనలతో వైసిపి వ్యతిరేక ప్రచారాన్ని ఉధృతం చేసింది. లెఫ్ట్ ‌నేతలు కూడా వీరికి మద్దతుగా కలసి వస్తున్నారు. ఇకపోతే కుప్పంలో చంద్రబాబును అడ్డుకోవాలన్న వైసిపి మాస్టర్‌ ‌ప్లాన్‌ ‌బెడిసికొట్టింది. చంద్రబాబు నేరుగా ప్రజలను కలుసు కునే అవకావం వచ్చింది. మొదటిరోజు పెద్దూరు వద్ద పోలీసులు అడ్డుకున్నా చంద్రబాబు అదరలేదు.. బెరదలేదు. రెండోరోజు శాంతిపురం మండలంలో తన ప్రచార వాహనాన్ని అదుపులోకి తీసుకున్నా ఆగేదే లేదన్నారు. మూడోరోజు కూడా అంతకుమించి అన్నట్టుగా బాబు కుప్పం యాత్ర సాగింది. ప్రజలు తండోపతండాలుగా వచ్చి చంద్రబాబుకు మద్దతు పలికారు. నినాదాలతో హోరెత్తించారు.  తన కారవాన్‌ ‌పైకెక్కి మైకందుకున్నారు.
పోలీసులే టార్గెట్‌గా ఉపన్యాసంలో విమర్శలు గుప్పించారు. డీఎస్‌పీ స్థాయి అధికారి దగ్గరుండి తన భద్రతా వ్యవహారాలు చూసుకోవాల్సింది పోయి అడ్డుకుంటారా అంటూ వమిర్వలు చేశారు. కొత్త జీవోను నల్లచట్టంతోను, చిత్తుకాగితంతో పోల్చారు. జివోను ఖాతరు చేసేది లేదని తేల్చి చెప్పారు. జగన్‌ ‌పాలన ఎమర్జెన్సీని తలపిస్తోందని బాబు నిప్పులు చెరిగారు.  మొత్తంగా వైసిపి తీరుపై ఇప్పుడు సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. కొత్తగా తీసుకొచ్చిన జీవో నంబర్‌-1 ‌టీడీపీకే ప్లస్‌ అవుతోందన్న బావన ప్రజల్లో వస్తోంది. జీవోను అడ్డుపెట్టి చంద్రబాబు రోడ్‌షో ఆపడం వల్ల జరగాల్సిన రోడ్‌షో కంటే జరగని రోడ్‌షోలతేనే చంద్రబాబుకు ఎక్కువ మైలేజ్‌ ‌వస్తోందని అంటున్నారు. కుప్పంలో కూర్చునే మిగతా 174 నియోజకవర్గాలకూ కావల్సినంత మైలేజ్‌ ‌సాధిస్తున్నారని అంటున్నారు. చంద్రబాబుకు తామే ఒక ఆయుధాన్నిచ్చామా అనే ఆందోళన వైసీపీ నేతల్లో కనిపిస్తోంది. రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోం దన్న చంద్రబాబు విమర్శల్ని ప్రజలు కూడా ఆదరిస్తున్నారు.
మరోవైపు చంద్రబాబును ఏ క్షణంలో ఐనా అరెస్టు చేస్తారన్న వార్తలు కూడా వైరల్‌ అయ్యాయి. నిజానికి జివో వ్యవహారం కేవలం రాజకీయ అంశం మాత్రమే కాదు.  పౌరహక్కులకు సంబంధించిన సమస్య. రేపటిరోజున జీతాలు రాలేదని ఉద్యోగులు, పంట నష్టమైందని రైతులు, హక్కుల కోసం కార్మికులు కూడా రోడ్డెక్కినప్పుడు ఇదే జీవో ఆధారంగా అడ్డుకోవ డానికి ప్లాన్‌ ‌చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి.  తగ్గేదే లేదని అంటున్నా ప్రజల ఆందోళనలకు తలొగ్గక తప్పదని అంటున్నారు. కందుకూరు, గుంటూరు ఘటనలపై దర్యాప్తు జరిపి నిజాల నిగ్గు తేల్చకుండా కొత్త జీవోతో కొత్త చిక్కుల్ని తెచ్చిపెట్టడంపై వైసిపి కూడా విమర్వలు ఎదుర్కొంటోంది. జీవో రద్దును కోరుతూ కోర్టుకెళ్లే యోచనలో జనసేన ఉంది.
జగన్‌ ఉన్మాద చర్యలకు పోలీసుల వత్తాసు
పోలీసులు శిక్షకు గురికాక తప్పదు
సభను అడ్డుకోవడంపై చంద్రబాబు ఆగ్రహం
image.png
చిత్తూరు,జనవరి7 : కుప్పం పర్యటనలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు పోలీసుల తీరుపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. గుడిపల్లిలో బహిరంగ సభకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడం పై చంద్రబాబు మండిపడ్డారు. అధికార, ప్రతిపక్షాలను పోలీసులు సమానంగా చూడాలన్నారు. సీఎం జగన్‌ ‌చేస్తున్న ఉన్మాది చర్యలను పోలీసులు ప్రోత్సహిస్తున్నారని ఆయన అన్నారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారంతా దోషులేనని చెప్పారు. తాను చేస్తున్న ప్రతిది ప్రజల కోసమే అని.. ప్రజాహితం కోసం తాను పోరాటం చేస్తున్నానని తెలిపారు. రాష్ట్రంలో సైకో పాలన పోయి సైకిల్‌ ‌పాలన రావాలని చంద్రబాబు నినాదాలు చేశారు.
ఒక సభను అడ్డుకోవడానికి 500 మంది పోలీసులు అవసరమా అని ప్రశ్నించారు. తమ కార్యకర్తలపై కేసులు పెట్టిన ఏ ఒక్క పోలీసును తాను వదలనని హెచ్చరించారు.సీఎం జగన్‌ ‌రాజమండ్రిలో టింగ్‌ ‌పెట్టినప్పుడు… రోడ్‌ ‌షో నిర్వహించినప్పుడు పోలీసులకు నిబంధనలు గుర్తుకు రాలేదా అని చంద్రబాబు ప్రశ్నించారు. అధికార పార్టీకి చెందిన మంత్రులు సభలు పెట్టినప్పుడు పోలీసులు ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. గుడిపల్లి మండలంలో యూనివర్సిటీ తెచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీదేనని చంద్రబాబు చెప్పారు.

Leave a Reply