Take a fresh look at your lifestyle.

దివ్యాంగుల పరిస్థితి దయనీయం..!

కొవిద్19 నేపథ్యంలో ప్రభుత్వాలు అండగా నిలవాలి: హ్యుమన్ రైట్స్ వాచ్

కోవిద్ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా దివ్యాంగులు చాలా ప్రమాదాలను చవిసుస్తున్నారని హ్యూమన్ రైట్స్ వాచ్ అనే అమెరికా స్వచ్చంధ సంస్థ తెలిపింది. మహమ్మారి సమయంలో దివ్యాంగుల హక్కులను పరిరక్షించడానికి ప్రభుత్వాలు అదనపు ప్రయత్నాలు చేయాలి అని హ్యూమన్ రైట్స్ వాచ్ కోరింది. మహమ్మారి నేపథ్యంలో అంగవైకల్యం ఉన్నవారికి ఇతరులకన్నా ఎక్కువ మద్దతు అవసరం. దివ్యాంగులు సరిగ్గా తినలేకపోతున్నారు. అధిక ఒత్తిడిని అనుభవిస్తున్నారు ఎందుకంటే వారి చుట్టూ ఏమి జరుగుతుందో అర్థం చేసుకోలేకపోతున్నారని ప్రొఫెసర్ జి.వి.ఎస్. మూర్తి, వైస్ ప్రెసిడెంట్ డైరెక్టర్, ఇండియన్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, అన్నారు. కరోనా సమయంలో దివ్యాంగులు పడుతున్న బాధలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలిపే స్టేట్మెంట్స్ ఈ రెండు.. పారా బాడ్మింటన్ ప్లేయర్ ప్రేమ విశ్వాస్ 2019 లో తైలాండ్ కి పోయి భారత దేశం తరుపున థాయిలాండ్ పారా -బాడ్మింటన్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్ లో ఆడారు. జాతీయంగా వికలాంగ ప్లేయర్స్ కోసం పెట్టే ఆటల్లో ప్రేమ విశ్వస్ ఇప్పటికి రెండు గోల్డ్ మెడల్స్ రెండు సిల్వర్ మెడల్స్ ఒక బ్రాంజ్ మెడల్ గెలిచి వున్నారు. ఈమె ప్రస్తుతం చాలా నిరాశలో వున్నారు . కారణం ఈ మీ స్పోర్ట్స్ కిట్ స్టేడియం లాకర్లో ఉండిపోయింది.. ఆమెకి ఏంతో ఇష్టమైన ఆట బ్యాడ్మింటన్ ప్రాక్టీస్ చేయలేకపోతున్నారు. ఈమె నివాసం నుంచి స్టేడియం 15 కిలోమీటర్ల దూరంలో వుంది.. అవయవాల లోపం లేని ఆటగాళ్లకోసం స్టేడియం హాస్టల్ గదులు నిర్వహిస్తున్నది శాప్ పారా ప్లేయర్స్ కోసం మాత్రం హాస్టల్ గది కాదు కదా కనీసం ప్రత్యేక బాత్రూం కూడా లేదు..దీనితో ప్రేమ లాక్ డౌన్ వలన ఇంటికి పరిమితం అయిపోయారు. దివ్యాంగుల్లో ఒక స్థాయి వున్నా స్పోర్ట్స్ వుమన్ పరిస్థితి ఇలా దారుణంగా వుంది. ప్రేమ విశ్వాస్ ఆడేటప్పుడు వాడే వీల్ చైర్ ఒక స్వచ్చంద సంస్థ స్పాన్సర్ చేసింది.

ప్రేమతో ఓ టోర్నీ ఆడించటానికి తీసుకుపోయిన ఉత్తరా ఖండ్ స్టేడియం అధికారులు ఆ వీల్ చైర్ ను అజాగ్రత్తగా తాము ప్రయాణిస్తున్న బస్సు టాప్ లో పడేస్తే, అది మార్గ మధ్యలో పడిపోయింది . ఇప్పుడామెకు ఆడేటప్పుడు వాడే వీల్ చైర్ లేదు.. 50000 రూపాయలు పెట్టి మరో విల్ చైర్ కొనుక్కునే స్తొమత ప్రేమ విశ్వాస్ కి లేదు.. తమ అజాగ్రత్త వలనే వీల్ చైర్ పోయింది అన్న సోయి స్టేడియం స్టాఫ్ కి లేదు వెరసి మొత్తం నష్టం ప్రేమ విశ్వాస్ భరిస్తున్నారు. ఒక జాతీయ ప్లేయర్ పరిస్థితి ఇలా ఉంటే అతిసాధారణ వికలాంగుని పరిస్థితి ఎలా ఉంటుంది వేరే చెప్పక్కరలేదు. వికలాంగులకు ప్రభుత్వం అందించే సహాయం వారి వికలాంగత శాతం మీద ఆధారపడి ఉంటుంది. శరీరంలో 20 శాతం వికలాంగత ఉంటే సదరు వ్యక్తికి దొరికే సహాయం స్వల్పంగా ఉండి 60 శాతం వికలాంగత ఉంటే ప్రభుత్వ సహాయం అధికంగా ఉంటుంది . అయితే మన రాజ్యాంగం ప్రకారం ప్రకృతి వైపరీత్యం వచ్చినప్పుడు లేదా మహమ్మారి వ్యాపించినప్పుడు అన్ని రకాల దివ్యాంగులకు ఒకే విధమైన సహాయం ప్రభుత్వ ఇవ్వాలి . రాజ్యాంగంలోని నియమాన్ని ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. మనిషి జీవితం సాఫీగా సాగాలి అంటే కావలిసింది ఆత్మ గౌరవం. ఆత్మగౌరవంతో నిండిన జీవితం సాధ్యం అయ్యేది మనిషి ఇంకొకరిపై ఆధార పడకుండా వున్నప్పుడే పడుతుంది. దివ్యాంగుల కు ఈ అవకాశం పుట్టుకతోనే ఉండదు. మరి వీరిని ఆదుకోవలసిన ప్రభుత్వం కబోది లాగా తన వికలాంగత ప్రకటించుకుంటున్నది. కరోనా కాలంలో దివ్యాంగుల పరిస్థితి దయనీయంగా ఉంది.

Leave a Reply